Velpuri DharnaVelpuri Dharna

కొత్త జిల్లాలకు (New Districts) మహాపురుషుల (Stalwarts) పేర్లు పెట్టాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ (South Indian Kapu Association) డిమాండ్ చేసింది. సికా (SIKA) గుంటూరు నగర మహిళా అధ్యక్షురాలు గడదాసు అరుణనాయుడు నాయకత్వంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం (Guntur Collector Office) ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న దళిత ఉద్యమనేత చందవోలు శోభారాణి మాట్లాడుతూ గుంటూరుకి కవికోకిల గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు (Velpuri Srinivasa Rao) మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 225 కులాలు ఉంటే కేవలం రెండు మూడు కులాలు మాత్రమే అధికారంతో అన్ని వనరులు సొంతం చేసుకున్నారు. మిగిలిన 222 కులాలును అన్ని విధాలా అనగ దొక్కారని పేర్కొన్నారు. 90 శాతం ఉన్న దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ, కాపు కులాలలో ఎందరో త్యాగ పురుషులు ఉన్నా ఒక్కరి పేరు కూడా జిల్లాలకు పెట్టకపోవడం వివక్ష కాదా అని సీఎం జగన్’ను వేల్పూరి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ వర్గాలను ప్రభుత్వం బానిసలుగా,పాలేరులుగా, ఓటర్లు గా చూడటం సిగ్గుచేటు అని, స్వాతంత్ర్యము వచ్చి 73 సంవత్సరంలు దాటిన పాలకులు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని వేల్పూరి విమర్శించారు.

కొత్త జిల్లాలకు కవికోకిల గుర్రంజాషువా (Gurram Jashuva), దామోదరము సంజీవయ్య (Damodaram Sanjeevaiah), శ్రీకృష్ణ దేవరాయలు (Srikrishna Devarayalu), వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga), సర్దార్ గౌతు లచ్చన్న (Gouthu Lachanna), తాండ్ర పాపారాయుడు (Tandra Paparayudu), అల్లూరి సీతా రామరాజు (Seeta Rama Raju), పి.వి.సింధు, అన్నదాత డొక్కా సీతమ్మ (Dodda Seetamma), పింగళి వెంకయ్య (Pingali venkaiah), బీసీ నేత కటారి సత్యనారాయణ యాదవ్,షేకు నాజర్, కన్నెగంటి హనుమంతు, కవయిత్రి మొల్ల, కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (Veera Brahmendra swamy), రత్నసభాపతి, చేనేత నేత ప్రగడ కోటయ్య (Pragada kotaiah), సంత్ సేవాలాల్ నాయక్, ద్వారబందాల చెంద్రయ్య, తదితరుల పేర్లు పెట్టాలని వేల్పూరి డిమాండ్ చేశారు.

గుంటూరు నగర అధ్యక్షరాలు అరుణ నాయుడు మాట్లాడుతూ మహనీయుల పేర్లు పెట్టే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. జిల్లా జనసేన నాయకురాలు బిట్రగుంట మల్లికా నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానముగా చూడాలని సీఎం కు సూచించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ నేతలు దాసరి రాజేశ్వరి, పి. గంగాభవాని, పి. రేణుకాదేవి, కొల్లు శాంతలక్ష్మీ, పి.మంజులదేవి, పోలిశెట్టి విజయ లక్ష్మీ,షేక్ నసీమ, మహ్మద్ రఫీ, జనసేన (Janasena) నేత లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఓట్లు మనవి -పేరులు వాళ్ళవా?