కాపు, తెలగ, ఒంటరి, బలిజలకు EWS కోటాలో 5 % రిజర్వేషన్ (Kapu Reservations) తక్షణమే అమలు చేయాలనీ కాపునాడు (Kapunadu) అధ్యక్షుడు బండారు గంగ సురేష్ (Bandaru Ganga Suresh) డిమాండ్ చేసారు. ఎన్నో సంవత్సరాలుగా కాపులు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిన ప్రతి పార్టీలు కాపుల ఆగ్రహానికి గురి అవుతూనే ఉన్నాయి అని కాపునాడు అన్నది.
గత ప్రభుత్వంలో చేసిన ఉద్యమాల వలన లబ్ది పొందింది కాపులు కాదు జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అనడంలో ఎలాంటి అనుమానం లేదనే చెప్పాలి. 2016 లో తమిళనాడు తరహలో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పిన జగన్ రెడ్డి 2018 లో U టర్న్ ఎందుకు తీసుకున్నారో కూడా కాపు జాతికి సమాధానం చెప్పాలి. రిజర్వేషన్స్ కోసం కాపుల డిమాండ్ న్యాయబద్ధమే అన్న మీరు తరువాత మీ నిర్ణయం ఎందుకు మారింది? ఇది మోసం కాదా అని కాపునాడు అధినేత బండారు గంగ సురేష్ ప్రశ్నించారు.
గత ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్ అంశంలో ఏమి చేయలేను అన్నారు. కానీ 10 వేల కోట్లు కాపుల అభివృద్ధికి ఇస్తానని చెప్పారు. మీరు హామీ ఇచ్చినప్పటికీ కాపులకు డబ్బులు ఇవ్వకుండా కాపులను మోసం చేస్తున్నారు. అలానే గత ప్రభుత్వం తీర్మానం చేసిన 5% EWS reservation కూడా అమలు చేయకుండా కాపులని మోసం చేసారు అని కాపునాడు ఆరోపిస్తున్నది.
కాపుల రిజర్వేషన్ అంశం రాష్ట్రం పరిధిలోనే ఉందని అలాగే 5% EWS reservation కి కాపులు అర్హులు అని కేంద్రం చెబుతున్నది. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లను అమలు చెయ్యాలని కాపునాడు ద్వారా డిమాండ్ చేస్తున్నాము. లేని యడల గత ప్రభుత్వాల మాదిరిగానే కాపుల ఆగ్రహానికి జగన్ మోహన్ రెడ్డి కూడా గురి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాము… అని కాపునాడు అధినేత బండారు గంగ సురేష్ ఒక ప్రత్రికా ప్రకటన ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.