Janasenani in troublesJanasenani in troubles

జనసేనాని స్వప్నాలకు నేటితో నవవసంతాలు

జనసేన పార్టీ (Janasena Party) ఆవిర్భావ సభ (Formation day) అమరావతి (Amaravati) సమీపంలోని పట్టంలో నేడు జరుపుకొంటున్నది. ఎనిమిది వసంతాలు పూర్తి చేసికొని తొమ్మిదో వసంతంలోకి జనసేన (Janasena) అడుగెట్టబోతున్నది. అసలు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారు. నేడు ఈ పార్టీని చూసి ప్రధాన పార్టీలు ఏమనుకొంటున్నాయి? అనేదానిపై ప్రజల గుండె చప్పుడు ఏ విధంగా ఉన్నాది అంటే…

అక్రమాస్తులకు తన తండ్రి ముఖ్యమంత్రి (Chief Minister) కాదు
అధికారానికి తన మామ ముఖ్యమంత్రి కాదు

మరో పక్కన

ప్రజారాజ్యం (Prajarajyam) ఓటమి-విలీనం…
మూడు పెళ్లిళ్లు అనే అపవాదు…
అక్కరకు రాని,అమ్ముడు పోతున్న కుల సంఘాలు…
అనే మూడు బలిష్టమైన గుదిబండలు కాళ్ళకి, మెడకు వేళ్ళాడుతున్నాయి

ఇంకో పక్కన

చుట్టూ విభజనల గాఢాంధకారం…
ఉన్న నాలుగు పైసలు మనోవర్తులకు-దానాలకు పోగా
రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు తప్ప-చేతిలో చిల్లి గవ్వ లేదు
శంకర్ గౌడ్, మహీందర్ రెడ్డి, హరి ప్రసాదులు తప్ప
చేదోడుగా ఉన్న నాయకుడు లేక పోయే

గడ్డు పరిస్థితుల్లో జనసేన

ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో జనసేన అనే పార్టీ పెట్టి
నేడు తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టేలా చేసావు
ఓటమి చెందుతూ కూడా పాలకుల గుండెల్లో నిద్రపోతున్నావు.

జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులను కూడా నీ సినిమాలు చుట్టూ,
ఫ్లెక్సీలు చుటూ ప్రదక్షణం చేసేలా చేస్తున్నావు
నిన్ను తిట్టేవాడికి కాసుల వర్షం-పదవుల పందేరం
నిన్ను ఆశ్రయిస్తే సమస్యలు పరిస్కారం

ప్రేమకు వేళాయెరా అంటూ పచ్చ పరివారాన్ని నీ వెంట తిరిగేలా చేస్తున్నావు
తాడేపల్లి పెద్దలను పక్కలు తడిపేసుకొనేలా చేస్తున్నావు
ఢిల్లీ నుండి గల్లీ నాయకులూ నీ గురించే ఆలోచించేలా చేస్తున్నావు

నువ్వు ఈ బాధిత వర్గాలకు దేవుడివిలాంటోడివే సామీ…

జనం కోసం (Janam Kosam) జనసేన పార్టీని (Janasena Party) నడుపుతున్న ఓ జనసేనాని (Janasenani)
నీకివే మా హృదయ పూర్వక అభినందనలు.

ఓ జనసేనాని శతమానం భవతి శతాయుష్మాన్ భవ…

ఆలోచించండి… తరాలు మారుతున్నాగాని బాధిత వర్గాలకు అధికారం ఎండమావేనా? ఇంకెన్నాళ్లు

పొత్తుల ఊబిపై సేనాని ప్రసంగం ఎలా ఉండాలి?