వైద్య రంగంలో (Health Sector) మరిన్ని మౌలిక సౌకర్యాలు (Basic Facilities) కల్పించేందుకు రూ 50 వేల కోట్లను కేంద్రం (Kendram) కేటాయించింది. కోవిడ్ 19 (Covid 19) రెండో దశతో అతలాకుతలం అయిన భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) కు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) మరిన్ని ఉద్దేపన కార్యక్రమాలను ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman), సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో ప్రకటించారు. ముఖ్యంగా వైద్య వసతులను మెరుగుపరచడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కీలక రంగాలలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ఆర్థికశాఖ పలు కీలక చర్యలు తీసికుంది. పలు ఆర్థిక ఉపశమన కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక శాఖ నేడు ప్రకటించింది.
కేంద్ర తీసుకున్న కీలక నిర్ణయాలు!
కొవిడ్ ప్రభావిత రంగాలకు సుమారు రూ 1.1 లక్షల కోట్ల వరకు రుణ హామీ
వైద్యసౌకర్యాల కల్పన విస్తరణకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ప్రాధాన్యత
వైద్య రంగానికి రూ 50 వేల కోట్ల వరకు కేటాయింపు.
ఇతర కీలక రంగాలకు రూ 60 వేల కోట్ల వరకు కేటాయింపు.
వైద్య, ఆరోగ్యశాఖకు సాయం చేసే సంస్థలకు అండగా ఉండడం
వైద్య, ఔషధ రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టులకు రుణం ఇవ్వడం
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్)
ఈసీఎల్‌జీఎస్‌లో భాగంగా సూక్ష్మరుణ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల రుణం.
పర్యాటక రంగంపై ఆధారపడిన వారికి అండగా ఉండేందుకు ట్రావెల్ ఏజెన్సీలకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.10 లక్షల వరకు ఋణం.
రిజిస్టర్ చేసుకున్న టూరిస్ట్ గైడ్‌లు, పర్యాటక రంగంపై ఆధారపడిన వారికి ఆర్థిక సాయం.
సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల తనఖా లేకుండా రుణం కల్పించడం
కృత్రిమ ఎరువులకు రూ.14,775 కోట్ల మేర అదనపు రాయితీలు కల్పన.
డీఏపీకి రూ.9,125 కోట్లు, నత్రజనికి రూ.5,650 కోట్లు కల్పన.
ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ నిమిత్తం ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్‌కు 77.45 కోట్ల వరకు నిధులు మంజూరు.
రూ.88వేల కోట్ల వరకు ఎగుమతుల బీమాను పెంచేందుకు వీలుగా ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కి ప్రభుత్వ నిధులు కేటాయింపు
ప్రాజెక్టుల ఎగుమతులకు నేషనల్ ఎక్స్‌పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ కింద రూ.33 వేల కోట్ల వరకు అదనపు నిధులు.