RTO VerificationRTO Verification

మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act) ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారిపై RTI అధికారులు విధించే జరిమానాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) భారీగా పెంచింది. దీనికి సంబంధించి రవాణాశాఖ (Transport Department) కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విధంచబోయే జరిమానాలను రెండు కేటగిరీలుగా విభజించారు. ద్విచక్ర వాహనంతో పాటు తేలికపాటి నాలుగు చక్రాల వాహనాలు ఒక కేటగిరీ గాను, భారీ వాహనాలను (Heavy Vehicles)  మరో క్యాటగిరీ గాను విభజించారు.

ప్రభుత్వం విధించబోయే కొత్త జరిమానాలు ఇలా!

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750 జరిమానా విధించనున్నారు.

సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750 జరిమానా విధించనున్నారు.

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000 జరిమానా విధించనున్నారు.

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000 జరిమానా విధించనున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000 జరిమానా విధించనున్నారు.

రూల్స్’కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000 జరిమానా విధించనున్నారు.

వేగంగా బండి నడిపితే – రూ. 1000 జరిమానా విధించనున్నారు.

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000 జరిమానా విధించనున్నారు.

రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000 జరిమానా విధించనున్నారు.

రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000 జరిమానా విధించనున్నారు.

పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000 జరిమానా విధించనున్నారు.

ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనంగా జరిమానా విధించనున్నారు.

వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000 జరిమానా విధించనున్నారు.

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. ౧౦౦౦౦ జరిమానా విధించనున్నారు.

అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా విధించనున్నారు.

రూల్స్’కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి – రూ. లక్ష రూపాయిలు జరిమానా విధించనున్నారు.

 

Spread the love