Gorrela mandhaGorrela mandha

లోలోన ఒక్కటై ప్రజలను దోచుకు తింటున్న నరకాసురుడు (Narakasura), బకాసురుడుల (Bakasura) ఆధిపత్యం అంతమయ్యేది ఎప్పుడు ప్రజలకు నిజమైన దీపావళి వచ్చేది ఎప్పుడు? 

అనగనగా అంధకాసురం అనే రాజ్యం. ఆ అంధకాసుర రాజ్యంలో ఇద్దరి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి రాజుల పాలనల్లో ఆ గొర్రెలు నలిగి పోతున్నాయి. ఈ ఇద్దరి రాక్షస రాజుల (Rakshasulu) పాలనలో మేము నలిగిపోతున్నామే అని ఆ గొర్రెలు (Gorrelu) తెలిసికోలేవు.

వాడి పాలనలో వీడికి అమ్ముడు పోయారు అంటాడు. వీడి పాలనలో వాడికి అమ్ముడు పోయాడు అంటాడు.

వీరి దృష్టిలో వీరు ఇద్దరు తప్ప మిగిలిన అందరూ అమ్ముడు పోయేవాళ్ళమే అని ఆ రాజ్యంలో ఉన్న ఆ గొర్రెలు తెలిసి కోలేవు? అదే ఇద్దరి బలం. న్యాయ దేవతా రక్షకులపై కూడా మరింత అనుమానాలు వచ్చేలా ఈ రాక్షసులు ఇద్దరు ముద్రలు వేస్తుంటారు? చివరకు దేవుళ్ళను దేవతలను కూడా అమ్ముడు పోయారు అని ముద్ర వేసిన వేయగల సమర్థులు.

అయినా ఈ ఇద్దరి నిజరూపాలను ఆ గొర్రెలు తెలిసి కొనేది ఎప్పుడో? అంజనీపుత్రుడు (Anjanee Putrudu) అంతటి వాడు ఆ గొర్రెలకు నాయకుడుగా బయటకు వస్తాడా? అటువంటి వాడు వస్తే తన చుట్టూ ఉన్న కోటరీ అనే చైనా గోడని బద్దలు గొట్టుకొని బయటికి వచ్చేదెప్పుడో??? ఆ సమర్ధుని నాయకత్వంలో అప్పుడు ఆ గొర్రెలు గొర్రెలు కలసి తిరగబడేది ఎప్పుడో???

ఏ రాజ్యంలో అయినా, ఉన్న వ్యవస్థలను గౌరవించాలి. వాటిపై అపవాదులు వేయడం ఏ సమాజానికి అయినా మంచిది కాదు అని చెప్పే దేవ్వడో??? చెప్పనిచ్చే స్వేచ్చ వచ్చే దెప్పుడో??? ఆ సమాజంలో ఉన్న ఆ వ్యవస్థలు, ఆ పాలకులు ఇద్దరు లోలోన సయోధ్యతోనే మెలుగుతున్నారా? మెలిగితే ఈ రాద్ధాంతం ఏమిటో? ఇది ఆధిపత్య పోరునా లేక మరేదైనానా తెలీక ఆ గొర్రెల మంద బ్రతుకు సాగిస్తూ ఉండేవి.

ఆలోచించండి… అమ్ముడు పోయాడు అనే విష ప్రచారాలకు (bad campaign) అంతం ఎప్పుడు? ఎన్నాళ్లీ ఆధిపత్య పోరాటాల్లో నలిగి పోవడాలు అని గొర్రెలు తెలిసికొనేదెప్పుడు

(ఇది నా ఊహాజనిత కథ మాత్రమే… ఇది ఎవ్వరినీ ఉద్దేశించి మాత్రం కాదు)