PanchamruthamPanchamrutham

ఆలయ అర్చకులు, వేద పండితుల ఆద్వర్యములో శ్రీమద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారికి పంచామృత అభిషేకం (Panchamrutha Abhishekam) జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు స్వయంభువులై ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వెలిశారు. ఆయనకి శనివారం మరియు సంక్రాంతి సందర్భముగా పంచామృత అభిషేకం జరిగింది.

శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానమునకు చుట్టుప్రక్కల నుండి, సుదూర ప్రాంతముల నుండి భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి మ్రొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద (Anna Dana) వితరణ జరిగింది. పై పూజా కార్యక్రమములు అన్నియూ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేదాంతం వెంకటాచార్యులు ఆద్వర్యములోనూ, పర్యవేక్షణ ఆలయ పర్యవేక్షకులు కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావులు తెలిపారు.

రాక్షస పాలనను మంటల్లో వేసి దహించిన రోజే భోగి!