వెల్లడించిన ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలంలోని చారిత్రక దేవాలయం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 18 నుండి 22 తేదీవరకు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజాకు, ఆహ్వాన పత్రిక అందజేశారు. చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 18 నుండి 22 వరకు జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో చైర్మన్ వెంకటేశ్వరరావుతో పాటుగా సొసైటీ అధ్యక్షులు వీరంకి సత్యనారాయణమూర్తి, వైసీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పల్లా గంగాధర్ రావు, దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యుడు పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు