Pawan Kalyan on women safetyPawan Kalyan on women safety

ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా మౌనమే
గిరిజన మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు కలచి వేశాయి

మహిళపై (Women) అత్యాచారాలు (Rapes), అఘాయిత్యాలకు (Murders) సంబంధించిన కేసుల్లో మొదటి పది స్థానాల్లో ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) కూడా ఉందనే వాస్తవాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (Crime records Bureau) లెక్కలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వం మౌనంగా, ఉదాసీనంగా ఉండటం ఆడబిడ్డలకు శాపంగా మారింది. ఉత్తరాంధ్రలోని (Uttarandhra) అచ్యుతాపురం సెజ్ (Atchutapuram SEZ) లో ఉపాధి కోసం వచ్చిన గిరిజన మహిళపైన అత్యాచార ఘటన జరిగింది. అలానే పల్నాడులోని నాగార్జున సాగర్ దగ్గర ఆశా కార్యకర్తగా ఉన్న గిరిజన మహిళపైనా చోటు చేసుకున్న అత్యాచారం, హత్య ఘటనలు కలచివేశాయి అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు.

మహిళల మానమర్యాదలకు భంగం వాటిల్లే సంఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకొంటున్నా పాలకులు పట్టించు కోకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అత్యాచారం ఘటనలపై బాధ్యతతో తీవ్రంగా స్పందించాల్సిన హోమ్ మంత్రి (Home Minister) సైతం- తల్లి పెంపకంలోనే తప్పు ఉంది. ఏదో దొంగతనానికి వచ్చి అత్యాచారం చేశారు లాంటి వ్యాఖ్యలతో తేలిగ్గా మాట్లాడటం వల్లే మృగాళ్లు పేట్రేగిపోతున్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు? దిశా చట్టాలు (Disha Act) చేశాం, పోలీస్ స్టేషన్లు (Police Stations) పెట్టాం అని ప్రచార ఆర్భాటం తప్ప ఆడ బిడ్డకు మాత్రం ధైర్యం ఇవ్వలేకపోతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర పాలకుడు ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఓ యువతిపై అత్యాచారం జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ ఓ నిందితున్ని పట్టుకోలేక పోయారు అంటే రాష్ట్రంలో పోలీసింగ్ (Policing in AP), శాంతిభదత్రల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజురోజుకీ పెరగటం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే (Jagan Government Failed) అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

వైసీపీకి 45 కాదు.. 25 సీట్లు రావడం కూడా గొప్పే!