supreme courtsupreme court

కరోనా మరణాలపై సుప్రీమ్ తీర్పు

కరోనా (Carona) మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం (Financial support) రూపంలో పరిహారం (compensation) అందించాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం ఇవ్వడానికి తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు బుధవారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థను ఆదేశించింది. పరిహారం ఇవ్వాలని కేంద్ర విపత్తుల చట్టంలో విస్పష్టంగా ఉన్నందున ఆ చట్టాన్ని అమలు చేసి తీరాలని కోర్టు తేల్చి చెప్పింది. ఇతర రూపాల్లో కరోనా నివారణకుగాను సాయం చేస్తున్నామని, అందువల్ల నగదు కూడా ఇవ్వమనడం సరికాదన్న కేంద్రం వాదనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

సుప్రీమ్ తీర్పులోని ముఖ్యంశాలు

పరిహారం ఎంత ఇవ్వాలి అనేదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఎండీఏ (NMDA) ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు ఇవ్వాలి.

కరోనాతో చనిపోయిన వారి పేరున మరణ ధ్రువీకరణ పత్రాలు (Death Certificate) జారీ చేసే ప్రక్రియను సులభతరం చేస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలి.

పరిహారం చెల్లింపునకు సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 12(3)పై కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన సరియైనది కాదు. పరిహారం చెల్లించాలిసిన అవసరం లేదు అని అనడం కేంద్రానికి తగదు. ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు.

చట్ట ప్రకారం పరిహారం చెల్లింపుపై మార్గదర్శకాలు (Guidelines) ఇవ్వడంలో ఎన్‌డీఎంఏ విఫలమయింది. కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వలేకపోతే కోర్టే ఆ పని చేయవలసి వస్తుంది.

విపత్తుల నిర్వహణకు సంబంధించి ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులు ఏవీ సెక్షన్‌ 12లోని ఆదేశాలను కదనలేవు.

శ్మశాన వాటికల కార్మికుల కోసం బీమా పథకాన్ని ఆర్థిక సంఘం చేసిన ప్రతిపాదన మేరకు కేంద్రం రూపొందించాలి

ప్రభుత్వాలకు లభ్యమయ్యే వనరులు, నిధులను దృష్టిలో పరిగణలోకి తీసికొని ప్రభుత్వమే సరిఅయిన మొత్తాన్ని నిర్ణయించాలి.

Spread the love