రౌడీ దర్బారులు (Rowdy Darbar) రాజ్యమేలుతుంటుంటే;
“హస్తినీ” సింహాసనాలు వీళ్లకు వత్తాసు పలుకుతుంటుంటే;
ప్రజాస్వామ్య స్తంబాలు (Pillars of democracy) వీళ్లకు ఆయుధాలుగా మారుతుంటుంటే;
అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది;
పాలించేవాడు రాక్షస (Raksasa Rulers) మనస్కులైనప్పుడు;
దండించేవాడు పాలించేవాడి పాదాల చెంతనున్నప్పుడు;
అడగాల్సిన ఓటు (vote) ఒక పచ్చ నోటుకు అమ్ముడు పోతున్నప్పుడు;
అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది;
బూతుశాస్త్ర పితామహులు నీతులు వల్లిస్తుంటే;
వేటకొడవల్లే బలిపశువులను రౌడీసేనలుగా (Rowdy Sena) ముద్రలు వేస్తుంటే
అవినీతి సామ్రాధీశులు నీతిని ప్యాకేజీలుగా ముద్రలు వేస్తుంటే
అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది;
నీతిని నగ్నంగా మీడియాల (Media) ముందు నిలబెడుతుంటే;
అవినీతితో దూరం జరగలేని “చిరు-ముద్ర”ల మౌనం కొనసాగుతుంటుంటే;
మనోహరమైన కోటల గోడలను దాటి రాలేని పవనాలు (Pavanalu) పేలవంగా వీస్తుంటే;
అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది;
దొంగే దొంగా అన్నట్లు అవినీతే అవినీతి అంటుంటే;
ప్యాకేజీ రాజాలే మనల్ని ప్యాకేజీ పుత్రులంటుంటే;
అవినీతి సామ్రాట్టులే నీతిని శంకింస్తుంటే;
అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది;
రౌడీ దర్బారులే మనల్ని రౌడీలుగా ముద్రిస్తుంటే;
ప్రశ్నించే మన శీలాన్ని మార్కెట్టులో అమ్మేస్తుంటే;
స్వార్ధం ముసుగులో రౌడీ దర్బారులను మనమే పోషిస్తుంటే;
అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది (an order of corruption);
గమనిక: కాంతారా చుసిన తరువాత కలిగిన ఆవేదనలు నుండి రాసిందే తప్ప… ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదని గమనించ గలరు.
ఆలోచించండి… దుర్మార్గుడి దౌర్జన్యం కంటే ప్రశ్నించడానికి భయపడేవాడి వాడి మౌనం చాలా ప్రమాదకరం. (Its from Akshara Satyam)