Nagababu at YelamanchilNagababu at Yelamanchil

రానున్నది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే
దోచుకోవడానికి రూ.లక్షల కోట్లు ఉంటున్నాయి
కానీ ప్రజా ప్రయోజన పాలనకు నిధులు ఉండడంలేడు?
యలమంచిలి జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సభలో కొణెదల నాగబాబు

వచ్చి ఎన్నికల్లో రాబోయేది జనసేన ప్రభుత్వమే (Janasena Government). జనసేనానే (Janasenani) కాబోయే సీఎం (AP CM). జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగం వస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణెదల నాగబాబు (Konidela Nagababu) వెల్లడించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో నాగబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కాలంలో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశారు. జనసేన ప్రభుత్వంలో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రతీ ఒక్కరికీ ప్రయోజనకరమైన పాలన ఉంటుందని చెప్పారు. అవినీతి నాయకులు దోచుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు ప్రజా ప్రయోజన పాలన కోసం ఎందుకు రాదు అని కొణెదల నాగబాబు ప్రశించారు.

వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా దోచుకున్నారు. మరొక్కసారి వైసీపీని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని కొణెదల నాగబాబు అన్నారు. ఎత్తులు, పొత్తుల గురించి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్’కి వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉన్నదని నాగబాబు అన్నారు.

యువతను గంజాయి మత్తుకు, రవాణాకు అలవాటు చేసి వేలాది మంది యువకులను జైళ్లలో మగ్గిలా చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అన్నారు. గంజాయిని కేరాఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితికి తెచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఆస్తులు దాదాపుగా దోచుకుకున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయం ఎటు పోతోందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నదని కొణెదల నాగబాబు అన్నారు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని బాధ్యతతో స్వీకరించానని, జనసేన అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యంగా పని చేస్తానని కొణెదల నాగబాబు అన్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి యలమంచిలి వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు రోడ్లపై నిలబడి నాగబాబుకి ఘన స్వాగతం పలికారు.

గాల్లో పోయే సీఎం కోసం రోడ్ల మీద ట్రాఫిక్ ఆంక్షలా: జనసేనాని కార్టూన్

Spread the love