Maddi TempleMaddi Temple

వివరాలు వెల్లడించిన ధర్మకర్తల మండలి

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (Maddi Anjaneya Swamy) వారి దేవస్థానము (Temple) నందు అక్టోబర్ 23 నుండి కార్తీకమాస మహోత్సవములు (Kartika Masa Mahotsavam) ప్రారంభం కానున్నాయి. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామములొ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారు వేంచేసియున్న ఉన్నారు. ఈ స్వామి వారి దేవస్థానము నందు 26.10.2022 నుండి కార్తీకమాస మహోత్సవములు ప్రారంభమగుచున్నందున పండిర్లు వగైరాలు ఏర్పాటు చేయుటకు గాను శుభ సూచికముగా 09.10.2022 వ తేది ఆదివారం ఉదయం గం.09.05 ని.లకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేదాంతం వెంకటాచార్యులు, అర్చకులు మరియు వెదపండితులు పూజా కార్యక్రమము నిర్వహించి పందిరి రాట వేయడమైనదని తెలిపారు.

ఈ పూజా కార్యక్రమములో ఆలయ ధర్మకర్తలు  దండు వెంకట కృష్ణం రాజు,  మనికల బ్రహ్మానందరావు, శ్రీమతి బల్లే నాగలక్ష్మి మరియు ప్రత్యేక ఆహ్వానితులు కర్పూరం రవి పాల్గొన్నారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండల రావు తెలిపారు.

–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

సహనం చిరంజీవిని చేస్తే – అహంకారం అభాసుపాలు చేసింది
గరిక సందేశం