ఇటీవల విడుదలైన అఖండ (Akhanda) సినిమా (Cinema) హిట్ టాక్’తో దూసుకుపోతుంది. కరోనా (Carona) దెబ్బతో సినిమాల జోరు కనిపించక చాలా రోజులైంది. లాక్‌డౌన్‌లతో (Lock Down) చిత్రసీమ మందగించింది. కొన్ని సినిమాలు ఏళ్ల తరబడి సెట్స్‌పై ఉండిపోయాయి. ఇక థియేటర్ల (Theaters) ముందుకొచ్చిన వాటి సంగతి సరే సరి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అఖండ మొదటి ఆట నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టింది. వసూళ్లతో బాక్సాఫీసుకి (Box office) ఊపుని తీసుకొచ్చింది అనే ప్రచారం విపరీతంగా చేస్తున్నారు.
ఇది చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పక్కా మాస్ సినిమా. విజయవంతమైన బాలకృష్ణ – బోయపాటి (Bala Krishna-Boyapati) కలయికలో వచ్చిన సినిమా కావడంతో అఖండకి కలిసొచ్చింది చెప్పవచ్చు.