మా పవనేశ్వరుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకొన్నది లోక కళ్యాణం కోసమా లేక లోకేష్ కళ్యాణం కోసమా అనే చర్చ నేడు సర్వత్రా జరుగుతున్నది. అగ్నికి ఆజ్యం తోడు అన్నట్లు, వైసీపీ శ్రేణులు కూడా ఈ ప్రచారాన్ని జనాల్లోకి బాగా తీసికెళ్ళుతున్నారు.
నీతికి నిజాయితీకి పర్యాయపదం మా పవన్ కళ్యాణ్. ఇవ్వడమే తప్ప తీసికోవడం తెలీని భోళాశంకరుడు పరమేశ్వరుడికి ఆధునిక రూపం మా జనసేనాని పవన్ కళ్యాణ్ అని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. అటువంటి పవన్ కళ్యణ్ సీఎం కావాలని అనేక కోట్లమంది కలలు గన్నారు. కానీ కేవలం గుప్పెడు మంది మాత్రమే ఓట్ల రూపంలో పవన్ కళ్యాణ్ ని నాడు సమర్ధించారు అనేది వేరే చర్చనీయాంశం.
కూటమి ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కనీసం కొంతకాలం అయినా సీఎం అవుతాడు అనుకొన్నాం. సీఎం అవ్వలేదు సరికదా జనసేన పార్టీ క్యాడర్ నే కూటమి ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. కీలకమైన అన్ని పదవుల్లో బాబు కులపోల్లు. బాబు మనుషులే ఉంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి? అసలు పవన్ కళ్యాణ్ దేని కోసం కూటమిలోకి చేరాడు? బాబు పల్లకీలు మోయడానికేనా? అనే చర్చ రోజు రోజుకే పెరిగేలా పరిస్థితులు చక చకా మారిపోతున్నాయి. తెలుగు తమ్ముళ్లు కూడా దీనికి ప్రధాన కారకులు.
సోషల్ మీడియా గ్రూపుల్లో, అలానే పల్లె పల్లెలో కూడా నేడు ఇదే చర్చ జరుగుతున్నది. అణగారిన వర్గాలకు చెందిన ఒక ఆశావాదిగా ఒక జర్నలిస్టుగా వీటిని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి?
1. 1951 నుండి కూడా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు బ్రాహ్మణ, రెడ్డి కమ్మ కులాలచుట్టూనే తిరుగుతూ వస్తున్నాయి. కాపులతో సహా మిగిలిన కులాలు అన్నీ కూడా కమ్మ లాబీలో గాని రెడ్డి లాబీలో చిక్కుకొని నెట్టుకొంటూ వస్తున్నాయి తప్ప మూడవ ప్రత్యామ్న్యాన్ని ఈనాడు ఆదరించలేదు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూడవ ప్రత్యామ్న్యాయంగా పోటీ చేసి నెగ్గ లేడు అని 2019 లో నిరూపితమయ్యింది. పవన్ సీఎం కావాలి అనే వర్గాలు అన్నీ 2019 లోనే పవన్ వెనుక ఉండి ఉంటె పోత్తుల అవసరమే ఉండి ఉండేది కాదు. ఇది వేరే విషయం.
2. మూడవ ప్రత్యామ్న్యాయం వచ్చినప్పుడల్లా రెడ్డి పార్టీలు, కమ్మ పార్టీలు వారి అనుచర గణాలు ఒక్కటి అవుతూ మూడవ పార్టీని ఓడిస్తూ వస్తున్నారు. 2009 లో ప్రజారాజ్యం ఓటమికి 2019 లో జనసేన ఓటమికి కమ్మ, రెడ్డి పార్టీల తెరనుక కలయికనే కారణం అనేది గమనించాలి.
3. చంద్రబాబు, వైస్సార్ మరియు జగన్ రెడ్డిలు రాజకీయాలను డబ్బు మయం, మీడియా మయం, అనుచర గణ బూతులు మయం చేసేసారు. వీటిని ఎదుక్కొనే సత్తా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాని లేదా జనసేన మద్దతు వర్గాలకు గాని ఇంకా రాలేదు.
4. జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉండకపోతే ఆంధ్ర రాష్ట్రమే కాదు టీడీపీ, జనసేన పార్టీలే ఉండి ఉండేవి కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.
5. అందుకే ఆ రెండు పార్టీలను ఒంటరిగా ఓడించే సత్తా ఏపీ లోని మూడవ ప్రత్యామ్న్యానికి ఇంకా రాలేదని పవన్ కళ్యాణ్ గ్రహించాడు. ఏక కాలంలో రెండు బలమైన వర్గాలతో యుద్ధం కష్టం అని తలచి ఒక బలమైన వర్గంతో సేనాని పొత్తుకు పధకాలు పన్నాడు. పొత్తులు పెట్టుకొన్నాడు. టీడీపీని నిలబెట్టాడు అనే అసూయ కంటే రాష్ట్రాన్ని జనసేన పార్టీని జనసేనాని పవన్ కళ్యాణ్ నిలబెట్టగలిగాడు అనే అక్షర సత్యాన్ని అంగీకరించి తీరాలి. నీ జనసేన నేటికీ ఉంది అంటే దానికి సేనాని వ్యూహాలే కారణం అనేది వాస్తవం.
పొత్తులో లోకేష్ కళ్యాణమే గాని లోక కళ్యాణం ఎక్కడ? పవన్ ఏమి సాధించాడు?
1. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో టీడీపీ, బీజేపీలు చాలా బలమైన పార్టీలు. జనసేన పార్టీ విజయమే సాధించ లేని ఒక చిన్న పార్టీ. జనసేన పార్టీ కేవలం 21 ఎమ్మెల్యేలతో సుమ్మారు 9 మంత్రిత్వ శాఖలను దక్కించుకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కి 5 శాఖలు, కందుల దుర్గేష్ కి 2 శాఖలు, నాదెండ్ల మనోహర్ కి 2 శాఖలు. కేవలం 21 ఎమ్మెల్యేలతో 8 – 9 శాఖలను జనసేన దక్కించు కోవడం పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత. సీఎం చంద్ర బాబు జనసేనానికి ఇచ్చిన ప్రాధాన్యత అని గమనించాలి.
2. జనసేన పవన్ కళ్యాణ్ తన కింద ఉన్న మొత్తం శాఖలు మరియు తన పార్టీ మంత్రుల ఇద్దరికి దక్కిన మొత్తం శాఖల్లో బాబు పెత్తనం లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ పెత్తనానికి బాబు అంగీకరించారు. ఆ విధంగానే జనసేనాని తన పార్టీకి దక్కిన మొత్తం శాఖల్లో పవన్ తన భావజాలంతో సంచలన నిర్ణయాలతో ప్రజల మెప్పుని పొందుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత. సీఎం చంద్ర బాబు జనసేనానికి ఇచ్చిన ప్రాధాన్యత అని గమనించాలి.
3. గత ముప్పై సంవత్సరాల్లో ఎందరో నాంకె వాస్తి ఉప ముఖ్యమంత్రులను మాత్రమే చూసాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా అనేక అధికారాలను అనుభవించగలుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకొనే నాయకుడు అయ్యారు. దీనికి సేనాని తీసికొన్న పోతుల నిర్ణయమే కారణం. అలానే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో మరొకరికి స్వేచ్ఛ నిచ్చి సొంత నిర్ణయాలతో పరిపాలన చేయడానికి ఎవ్వరికి అవకావం ఇవ్వలేదు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే బాబు నుండి సంపూర్ణ స్వేచ్ఛ తీసికొని తన శాఖలపై పట్టు నిరూపించుకొనే అవకాశం దక్కించుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత. సీఎం చంద్ర బాబు జనసేనానికి ఇచ్చిన ప్రాధాన్యత అని గమనించాలి.
4. గ్రామ సభలు నిర్వహించడంలోగాని, కేంద్రం నుండి నిధులు సాధించడంలో గాని, ఆ వచ్చిన నిధులను పంచాయితీలకు ఇవ్వడంలో గాని, గ్రామీణ రోడ్లకు నిధుల కేటాయింపులో గాని, గ్రామీణ, పర్యావరణ శాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో గాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలన చేసికొంటూ పోతున్నారు. పవన్ నిర్ణయాల్లో సీఎం బాబు ఎక్కడ కలగచేసికోవడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత. సీఎం చంద్ర బాబు జనసేనానికి ఇచ్చిన ప్రాధాన్యత అని గమనించాలి.
5. ఒక్క రూపాయి లంచం తీసికోకుండా, ఒక్క సిపారేసు లెటర్ జోక్యం లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ తన కింద ఉన్న అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేయగలిగారు. బాబు గాని, బాబు యంత్రాంగం గాని ఈ బదిలీల్లో జోక్యం చేసికోలేదు. ఇది పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత. సీఎం చంద్ర బాబు జనసేనానికి ఇచ్చిన ప్రాధాన్యత అని గమనించాలి.
6. జనసేనాని పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పాలనలో తనదయిన మార్కు చూపిస్తున్నారు. దీనికి బాబు సహకారం కూడా ఎంతైనా ఉన్నదీ. దీన్ని విమర్శకులు గమనించాలి. అలానే జనసేనాని కూడా బాబు పాలనలో జోక్యం చేసికోవడం లేదు. కూటమి ధర్మం ఇలానే ఉఁడాలి. లేకపోతే కూటమి మనుగడ మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది.
7. అయితే ఇక్కడ ఒక విషయం గమనింహాలి. కూటమి ప్రభుత్వంపై ఎప్పుడైనా విమర్శలు వచ్చినప్పుడు గాని లేదా సేనకు రావాల్సిన పదవుల వాటాపై గాని జనసేన పార్టీ ఎక్కటికప్పుడు అంతర్గత ఉత్తరాల రూపంలో స్పందిస్తూనే ఉన్నదీ. ఈ విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా తన భాధ్యతను మరిచిపోవడం లేదు అని గమనించాలి.
8. అలానే జనసేన పార్టీ శ్రేణులకు రావాల్సిన పదవులు వాటా దక్కడం లేదు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులూ గాని లేదా కింది శాయి నాయకులూ గాని జనసేన పార్టీ శ్రేణులను పట్టించు కోవడం లేదు. చాలా చులకగా మాట్లాడుతున్నారు అనే ఆరోపణలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. టీడీపీ నాయకుల వైకిరితో జనసేన పార్టీ శ్రేణులు రగిలి పోతున్నారు. కొన్నిచోట్ల ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారు. ఇంకొన్ని చోట్ల బాహాబాహీ అని కొట్టుకొంటున్నారు కూడా. ఇవి అన్నే వాస్తవం కూడా. పొత్తులో ఇవి సహనమే అయినప్పటికీ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అతికి ముకుతాడు వేయాలిసిన అవసరం ఉంది.
జనసేన పార్టీ శ్రేణులకు అన్యాయంపై సేనాని వైకిరి ఏమిటి?
1. పవన్ కల్యాణ్ అవసరం ఈ రోజున టిడిపికి లేదు. కెలుక్కొని బయటికి వచ్చి వైసీపీ కి ఉపయోగడడం తప్ప జనసేనాని గాని టీడీపీ గాని సాధించేది ఏమీ లేదు. సహనంతో జనసేన తన ఓటు బ్యాంక్ పెంచుకోవాలి. జనసేనాని ఇప్పుడు అదే చేస్తున్నాడు అని గమనించాలి.
2. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ రాజ్యాంగ బద్ధంగా కేవలం ఒక మంత్రి మాత్రమే. ఇది అర్థం చేసుకోవాలి. సంపూర్ణ మెజారిటీ లేదా 50 శాతం స్థానాలు ఉన్నప్పడే పవన్ తన వాటాపై పట్టు పట్టగలడు అనేది కూడా అర్ధం చేసికోవాలి.
3. ఆయన కనీసం 50 పర్సంట్ స్థానాల్లో పోటీ చేయాలి అంటే ఒక్క కాపుల వల్లేనే సాధ్యం కాదు. అలానే కాపుల్లో కూడా ఐక్యత ఇంకా పెరగాలి. మిగిలిన కులాల్లో కాపులపై ఉన్న నెగెటివ్ ప్రచారం పోవాలి. పవన్ కళ్యాణ్ పాలనా విధానం వల్ల ఇతర కులాల్లో ఉన్న నెగటివ్ వైకిరి ఇప్పుడు పోతున్నది.
4. అలానే మిగిలిన కులాల్లో జనసేనపార్టీ పట్ల సానుకూలత సాధించాలి. జనసేనాని తీసికొన్న గ్రామీణ నేపధ్యం ఉన్న శాఖల వల్ల, పవన్ పాలనా నిర్ణయాల వల్ల , సనాతన ధర్మం వల్ల, పవన్ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరుగుతున్నది. దీనికి పొత్తు అవసరం.
జనసేన పార్టీలో నిరుత్సాహానికి కారణం ఏమిటి? చర్యలు ఎలా ఉండాలి?
1. జనసేన పార్టీ ఓడినప్పుడు కూడా జనసైనికులు నిరుత్సాహం చెందలేదు. కానీ జనసేన అధికారంలోకి వచ్చాక కుమిలిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో గుర్తింపు దక్కడంలేదు అని మదనపడుతున్నారు. మమ్ములను జనసేన పార్టీ లేదా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని సేన పార్టీ నాయకులు, శ్రేణులు నిరుత్సాహంతో డీలా పడిపోతున్నారు. ఇది జనసేన పార్టీకి చాలా ప్రమాదం. వీటిని అర్ధం చేసికొని తగిన యంత్రాంగాన్ని జనసేనాని తక్షణమే నిర్మించాలి.
2. జనసేన పార్టీ అభివృద్ధిపై అనురక్తి లేని, పార్టీ శ్రేణులు అంటే ఏవగించుకొనే వారే జనసేనాని పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నారు. వారికే ఎక్కువ పదవులు దక్కుతున్నాయి. నిజమైన నాయకుల, కార్యకర్తల బాధలను వీళ్ళు అంతా కూడా అర్ధం చేసికోవడం లేదు. పదవుల్లో ఉన్న వాళ్ళు సేనానికి అర్ధం అయ్యే విధంగా వాస్తవాలు చెప్పడం లేదు అని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. కీలక పదవుల్లో ఉన్నవారికి, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికి పార్టీ కార్యకర్తలకు అనుసంధానం ఉండే విధంగా సేనాని నిరంతరం పర్యవేక్షణ చేయాలి. పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేసేవారిని అవసరం అయితే తప్పించే యంత్రాంగాన్ని నిర్మించుకోవాలి.
3. పీఆర్పీ కోసం పనిచేశాం. గత పది సంవత్సరాలుగా జనసేన కోసం శ్రమించాం. కానీ మమ్ములను పార్టీ ఆఫీస్ లోనికి కూడా అనుమతించరు. మాకు పదవులు ఇవ్వకపోయినా బాధ లేదు గాని జనసేన పార్టీ ఆఫీస్ లోకి కూడా పంపకపోవడం బాధగా ఉంది. మా గోడుని వినే నాయకుడే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోగాని, జిల్లా/తాలూకా పార్టీ కార్యాలయాల్లో గాని మాకు కనిపించడం లేదు అని ప్రతీ కార్యకర్త నేడు మదన పడుతున్నాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సమస్య యొక్క తీవ్రతను అర్ధం చేసికొని చర్యలు తీసికోవాలి. లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం కలగవచ్చు.
4. కూటమి ప్రభుత్వంలో ఉన్నా గాని టీడీపీ వాళ్ళు మాకు విలువ నివ్వకపోగా టీడీపీలోకి వస్తేనే పనులు చేస్తాం అంటున్నారు. మేము పార్టీలో ఉండాలా లేక పనులు కోసం టీడీపీలోకి వెళ్లిపోవాలా. టీడీపీలోకి వెళ్లలేము. సేనలో ఉంటే బాధ పెడుతున్నారు అని మరికొన్ని చోట్ల పిర్యాదులు చేస్తున్నారు. దేని వెనుక ఉన్న నిజానిజాలను పరిశీలించి టీడీపీ జనసేన బీజేపీల మధ్య అనుసంధానం ఉండే విధంగా చర్యలు తీసిపోవాలి. లేకపోతే పార్టీ క్యాడర్ చేజారిపోయే అవకాశం ఉంది.
కొసమెరుపు: సూటిగా సుత్తి లేకుండా
జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొన్నది లోక కళ్యాణం కోసమే గాని లోకేష్ కళ్యాణం కోసం కాదు. పొత్తుల ద్వారా జనసేన పార్టీ బలపడుతున్నది. రాబోయే ఎన్నికల్లో భారీస్థాయిలో జనసేన పోటీచేయబోతుంది. తద్వారా పవన్ సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పుడు పాలనలో మార్పు తీసికొచ్చి తీరుతాడు అప్ప్పుడే అధికార ఫలాలు అందరికీ సమానంగా దక్కుతాయి అనే అక్షర సత్యాన్ని నమ్మండి. ప్రత్యర్థి పార్టీల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి.
అలానే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా లోక కళ్యాణం కోసమే కాకుండా జనసేన పార్టీ కళ్యాణం గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. జనసేన పార్టీ పటిష్టం కోసం కూడా చర్యలు తీసికొంటూ ఉండాలి. తద్వారా జనసైనికుల బాధలను అర్ధం చేసికొని, వారిని అక్కున చేర్చికొనే యంత్రాంగాన్ని తన చుట్టూ జనసేనాని పెట్టుకోవాలి. అప్పుడే జనసేన పార్టీ మీద ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉన్న నమ్మకం పటిష్టం అవుతుంది. లేకపోతే టీడీపీ అనే మర్రి చెట్టు నీడన జనసేన అనే మొక్క ఎదుగు బొదుగూ లేకుండా కాలగమనంలో కలిసి పోతుందేమో ఆలోచించండి (It’s from Akshara Satyam)