Mallu SwarajyamMallu Swarajyam

అమర వీరనారి మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) మృతికి పలువురు అశ్రు నివాళి (Tearful Tribute) ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట (Telangana Sayudha Poratam) యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల ముఖ్యమంత్రి (Chief minister) జగన్‌ మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. మల్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలు గానే కాక సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి మల్లు స్వరాజ్యం. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ, విలువలతో ఆమె జీవితకాలం మొత్తం జీవించారని సీఎం జగన్ పేర్కొన్నారు.

తెలంగాణ సాయుధపోరాట యోధురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం మరణవార్త చాలా ఆవేదన కలిగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలైన శ్రీమతి స్వరాజ్యం తెలంగాణలోనే కాకుండా యావత్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమ అజరామరంగా నిలుస్తాయి. స్వరాజ్యం అన్న ఆమె పేరులోనే ఒక స్ఫూర్తి ఎల్లప్పుడూ నిండి వుంటుంది. ఆమె మరణం ప్రజాస్వామ్యవాదులకు, పీడిత వర్గాలకు తీరని లోటు. ఆ అమర వీర నారికి నివాళులు అర్పిస్తూ అంజలి ఘటిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకనలో నివాళిలు అర్పించారు.

“చెత్త” విధానాలపై విరుచుకుపడిన జనసేనాని