ముద్రగడకి అక్షర సత్యం సూటి ప్రశ్నలు
పద్మనాభం (Mudragada Padmanabham) గారు! అక్షర సత్యం (Akshara Satyam) వ్యాఖ్యలు సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి గాని లారీలు ఇచ్చారుగా అని మీలా దిగజారి మాట్లాడలేను.ఎవ్వరిని విమర్శలు చేయలేను. దాసరి గారి,చిరు గారి సమక్షలోనూ, అలానే పవన్ గారి సమక్షంలో కూడా మీ గురించే మంచిగా వాదించేవాడిని. కానీ నేడు మీ ఉత్తరాలు చూసి “సిగ్గు” పడుతున్నాను. తల దించుకొంటున్నాను. బహుశా మీకు అది ఉండకపోవచ్చు?
ముద్రగడ పద్మనాభంగా మీరు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని విమర్శ చేసిఉంటే అక్షర సత్యంగా నేను పట్టించుకుని ఉండేవాడిని కాదు. కానీ మీ ఉత్తరంలోని ప్రతీ పదంలో కూడా కాపు ద్వేషం -జాతి విధ్వంశం తప్ప మరేది కనిపించడం లేదు అనే ఈ ఉత్తరం రాస్తున్నా. మీరు చేసిన నాటి కాపు ఉద్యమాలు అలానే మీరు నేడు రాస్తున్న ఉత్తరాలు కూడా రాజ్యాధికారం (Rajyadhikaram for kapus) అనే ఆశల సౌధాన్ని నాశనం చేస్తున్నాయి అనే ఆవేదనతో రాస్తున్నా. సమాధానాలు ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి.
అయ్యా! పద్మనాభం గారు కులాన్ని మీరు వాడుకొని నాయకుడు అయ్యారు గాని కులానికి మీరు చేసింది ఏమైనా ఉందా? మీ మాటలు ప్రకారమే మీ కులపోల్లు ఇప్పటికీ చెడ్డీలు కూడా లేని అడ్రస్ లేని వాళ్ళుగానే మిగిలిపోవడానికి మీరు చేసిన కాలం చెల్లిన కాపు ఉద్యమాలు ముఖ్య కారణం కాదా? కులపోళ్ళకి సంఘవిద్రోహులు అని ముద్రపడడానికి మీరు చేసిన పనికిరాని కుల ఉద్యమాలు కాదా?
ఇద్దరి వ్యక్తిగత కలహాలను మీరు కాపు కమ్మ కలహాలుగా
సుమారు 1987 లో మీకు ఎన్టీఆర్ కుటుంబాల మధ్య వచ్చిన స్వల్ప వ్యక్తిగత కలహాలను మీరు కాపు కమ్మ కలహాలుగా మార్చేశారు అనేది నిజమా కాదా? ఒంటరి అయ్యాను అని మీరు మదన పడుతున్న తరుణంలో రంగనాడు మీకు ఉపయోగపడిందా లేదా? రంగా సమాధులపై మీరు, కాంగ్రెస్ పార్టీ, అలానే రాజన్న కుటుంబం ఎదిగారా లేదా? చివరకు కాపులకు మిగిలింది రంగా సమాధులు, ఉద్యమాల్లో సొట్టపోయిన పల్లాలు, కాలిపోయిన రైలు తప్ప మిగిలింది ఏమిటి? అంటే మనం ఏమి చెప్పాలి.
రంగా కష్టాలమీద, రంగా సమాదులమీద ముద్రగడ నాయకుడుగా ఎదిగారు అనే కాపు యువత ఆరోపణలు నిజం కాదా? అయినా మీరు రంగా కుటుంబానికి చేసింది ఏమిటి? రంగా కుటుంబం కోసం గాని రంగా కుమారుడు కోసం మీరు చేసిన పోరాటాలు ఏమిటి? త్యాగాలు ఏమిటి? మీ జీవితంలో రంగా గారి ఫోటోకి ఏనాడు అయినా దండ వేసి దండం పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ?
1994 లో కాంగ్రెస్ పార్టీ మీకు మంత్రి పదవి ఇచ్చి ఉండి ఉంటే రావులపాలెం కాపు ఉద్యమంలో పాల్గొని ఉండేవారా? 1994 లో మీరు చేసిన కాపు ఉద్యమం మీకు మంత్రి పదవి ఇవ్వలేదు అనే కోపంతో కదా? మంత్రి పదవి ఇవ్వలేదు అనే కక్షతో మీరు వైస్సార్ వర్గంలో అనడు మీరు ఉన్నారా లేదా? అయినా రావులపాలెం నాటి సభలో మీ సమక్షంలో కాపులపై జరిగిన దాడికి మీరు అసలు స్పందించారా? ఆ తరువాత కొన్ని రోజులు తరువాత మీరు ఉద్యమంలోకి వచ్చి స్పందించారు అనుకోండి. అది మీ అవసరం కోసమే గాని కాపుల కోసం కాదు? అవునా కాదా?
ముద్రగడ ఉనికిని కాపాడిన కాపు ఉద్యమాలు?
1987 లోను, 1984 మీకు మంత్రి పదవి పోయింది అని బాధపడుతున్న తరుణంలో మీకు కాపు ఉద్యమాలు ఉపయోగపడ్డాయి. కాపులు, కాపు ఉద్యమాలు మీ ఉనికిని కాపాడాయి. కాపులను కాపు ఉద్యమాలను వాడుకొని ఎదిగిన మీరు కాపులకు చేసింది ఏమిటి? అంటే మనం ఏమి చెప్పాలి?
1994 లో మీరు చేసిన ఉద్యమానికి భయపడి కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన GO లోప భూయిష్టం అని సలాది గంగాధర రామారావు లాంటి పెద్దలు మీకు ఆరోజునే చెప్పారా లేదా? మీకు నిజంగా కాపులు మీద ప్రేమ ఉండి ఉంటే, మీరు చేసిన ఉద్యమాలు కాపుల కోసమే చేసి ఉంటే ఆ GO సవరణ కోసం ఆరోజునే పంపి ఉండేవారు కదా? మీ మొండి వైఖిరి కాపుల ఆశలను ఆనాడు నీరుగార్చింది అనేది నిజమా కాదా?
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1994 లో ఇచ్చిన GO No 30 ని నాటి ఉమ్మడి హై కోర్టు సమర్ధించిందా లేదా? హై కోర్టు సమర్ధించిన తరువాత కూడా నాటి చంద్రబాబుపై మీరు ఎందుకు వత్తిడి చేయలేదు. బాబు ప్రభుత్వంపై మీరు నాడు వత్తిడి చేయకపోగా అదే టీడీపీలో 1999 నుండి పోటీ చేసి టీడీపీ నుండి గెలిచారు కదా? రంగాని అడ్డుతొలగించు కొన్న టీడీపీలో మీరు మరల చీరలు. అలానే కాపుల కోసం వచ్చిన GO ని అమలు జరపని టీడీపీలో మీరు మరల ఎందుకు జాయిన్ అయ్యారు. ఇది మీ అవకాశవాదం కాదా?
GO No 30 ని అమలు చేయమని ఎందుకు వత్తిడి చేయలేకపోయారు
మీరు చేరిన ఉద్యమాలు కాపులు కోసమే అయితే GO No 30 ని అమలు చేయమని బాబుపై నాడు మీరు ఎందుకు వత్తిడి చేయలేకపోయారు. 1994 లో చేసిన మీ ఉద్యమం రాజన్న కోసమే గాని కాపులు కోసం కాదు అనేది నిజం కాదా?
కాపులను ఇన్ని మోసాలు చేసిన బాబు ప్రతినిధులు ఇచ్చిన నిమ్మ రసం తగి ఎందుకు ఉద్యమాన్ని విరమించుకున్నారు? అసలు తుని మీటింగులో మీరు ఎవరినైనా మాట్లాడనించారా? ఇది మీ స్వార్ధం కదా? మీరు చేసిన ఉద్యమాలు కాపుల కోసమే అయితే మీరు ఇలా ఎందుకు ఒంటెద్దు నిర్ణయాలు తీసికొంటారు?
1994 నుండి 2014 వరకు GO No 30 ని అమలుపై మౌనం వహించిన మీరు 2014 లో మరల కాపు ఉద్యమం చేయడానికి కారణం కాపుల కోసమా? లేక బాబు మీకు 2014 టీడీపీ నుండి సీటు ఇవ్వకపోవడం వలనా? ఈ ఆరోపణలపై వాస్తవాలు బాబుకి మీకు తప్ప ఎవ్వరికీ తెలీదు.
బాబు కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని హామీ ఇచ్చి మోసం చేసారు కాబట్టి 2016 లో కాపు ఉద్యమాన్ని చేశాను అని మీరు లేఖలో చెప్పారు. కాపు ఉద్యమాలు కాపుల కోసం చేస్తారా లేక రాజకీయ పార్టీలపై మీ వ్యక్తిగత కక్షలతో చేస్తారా?
ఇదే నిజమైతే… 2004 లో వైస్సార్ కూడా కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని హామీ ఇచ్చి కాపులను వైస్సార్ మోసం చేసారు. మరి అప్పుడు వైస్సార్ ప్రభుత్వంపై ఎందుకు ఉద్యమం చేయలేదు. టీడీపీపైన, బాబుపైన ఉద్యమం చేసే మీరు వైస్సార్ మీద ఎందుకు ఉద్యమం చేయలేక పోయారు. వైస్సార్ మీ అభిమాన నాయకుడనా లేక కారులు, లారీలు సప్లై చేసిన వారికీ వ్యతిరేకంగా ఉద్యమం చేయ కూడదు అని నిర్ణయించుకొన్నారా? లేక మరేదైనా ముఖ్య కారణం ఉన్నదా?
2016 లో మీరు చేసిన కాపు ఉద్యమాలకి నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మద్దతు నిచ్చారు. ఆ తరువాత ఎన్నికల ముందు మీ కిరంపూడి సమీపంలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేను అని జగన్ అన్నప్పుడు మీరు ఎందుకు జగన్ కి వ్యతిరేకంగా ఉద్యమించలేక పోయారు. రాజన్న కొడుకు అంటే మీకు అంత ప్రేమ దేనికి? మీరు చేసిన ఉద్యమాలు కాపుల కోసమే అయితే జగన్ ప్రభుత్వంపై కూడా మీ ఉద్యమాలు చేసి ఉండివారు కదా? మీరు చేసిన ఉద్యమాలు కేవలం రాజన్న కుటుంబాన్ని అధికారంలోకి తేవడం కోసమే అనేది మీ లేఖలు ద్వారా తెలియడం లేదా?
కాపులకు అన్యాయాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు
చంద్రబాబు కాపులకు మోసం చేసాడు అనేది అక్షర సత్యం. అలానే వైస్సార్ కూడా కాపులకు అన్యాయం చేశాడా లేదా? జగన్ రెడ్డి గారు కూడా కాపులకు మోసం చేశాడా లేదా? కాపు కార్పొరేషన్ అసలు ఉందా? కాపు కార్పొరేషన్ నుండి ఒక్క రూపాయి అయినా కాపులకు అందుతున్నదా? కాపులకు ఇచ్చిన EWS రిజర్వేషన్ తీసేసిన మీరు ఎందుకు స్పందించడం లేదు. మీ ఉద్యమాలు కాపులు కోసమే అయితే కాపులకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?
అసలు మీరు పవన్ కళ్యాణ్ నే కాదు. చిరంజీవిని గాని, దాసరిని గాని, చివరకు రంగాని గాని మీరు ఎప్పుడైనా నాయకుడిగా గుర్తించారా? రాష్ట్రంలో గాని, మీ జిల్లాలో గాని ఒక్క కాపు నాయుడుని నాయకుడిగా గుర్తించి ప్రోత్సహించారా? ఇది అంతా మీలో ఉన్న అసూయా కాదా? లేక మరేదైనా బలమైన కారణం ఉందా?
1953 నుండి రెడ్ల ప్రభుత్వాలు, కమ్మ ప్రభుత్వాలు, రాజన్న కుటుంబం, బాబు కుటుంబం కాపులకు అన్యాయం చేస్తుంటే. కాపులను వాడుకొని వదిలేస్తుంటే ఒక్క కమ్మ ప్రభుత్వపైనే మీ కక్ష దేనికి సంకేతం? మీరు రాజన్న కుటుంబం కోసమే రెడ్డి ప్రభుత్వాలపై ప్రేమ చూపుతున్నారు అనేది నిజం కదా?
అయ్యా! పెద్దయన ముద్రగడా మీరు రాయబోయే మరో ఉత్తరానికి సమాధానంగా మరికొన్ని విషయాలు ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. మా ఆవేదనను అర్ధం చేసికొంటారని భావిస్తూ… సెలవు.
ఆలోచించండి… ఇది, రాజ్యాధికార సాధన కోసం మీ గుమ్మాలు చుట్టూ తిరిగిన
మీ సత్తెకాలపు అక్షర సత్యం ఆవేదన మాత్రమే కాదు సగటు యువత ఆక్రందన కూడా (It’s from Akshara Satyam)