జనసేన పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు
అల్లే నాగరాజు కుటుంబానికి రూ. 5 లక్షలు ప్రమాద బీమా అందజేత
పార్టీని భుజాలపై మోసే కార్యకర్తల పట్ల జనసేనానికి (Janasenani) ముందు చూపు ఉంది. అందుకే వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తున్న గొప్ప నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు (Konidala Nagababu) స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం రంగాపుర్ గ్రామ నివాసి జనసైనికుడు అల్లే నాగరాజు ఇటీవల మరణించారు. నాగరాజు కుటుంబానికి రూ. 5 లక్షలు ప్రమాద బీమాను (Accident Insurance) చెక్కు రూపంలో నాగబాబు చేతుల మీదుగా అందజేశారు.
శుక్రవారం హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో (Janasena Party office) జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు గారు మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునే పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వం తీసుకునే ప్రతీ కార్యకర్తకు రూ. 5 లక్షలు ప్రమాద బీమా కల్పించడం ద్వారా ఏదైనా అనుకోని పరిస్థితుల్లో కార్యకర్త మరణించినా, ప్రమాదానికి గురైనా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా చేయూత నిస్తున్నారని అన్నారు. వీర మహిళలు, జన సైనికుల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతతో వ్యవహరిస్తారని నాగబాబు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో వీర మహిళలు, జన సైనికులపై వై.సీ.పీ. అనుసరించిన విధానాన్ని తిప్పి కొట్టిన సంఘటన దానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మేమే శాశ్వతం, మాదే రాజ్యం అనే ధోరణిలో వై.సీ.పీ. అక్రమాలు పెట్రేగి పోతున్నాయి. ప్రజా ఆగ్రహాన్ని తట్టుకోవడం వై.సీ.పీ. తరం కాదని అన్నారు నానాగబాబు అన్నారు. గుండాయిజం, రౌడీయిజం సంస్కృతిని పెంచి పోషిస్తున్న వై.సీ.పీ.ని ప్రజలు ఇంటికి పంపే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని అన్నారు. వై.సీ.పీ. ఎలాంటి బెదిరింపులకు గురి చేసినా జన సైనికులు, వీర మహిళలు మనో ధైర్యాన్ని కోల్పోవద్దని, పవన్ కళ్యాణ్ ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడు కుంటారని కొణెదల నాగబాబు ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నేమూరి శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగా లక్ష్మణ్ గౌడ్, వీర మహిళల విభాగం అధ్యక్షురాలు శ్రీమతి మండపాక కావ్య, జీ.హెచ్.ఎం.సీ. అధ్యక్ష కార్యదర్శులు రాధరం రాజలింగం, దామోదర్ రెడ్డి, పార్టీ నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.