Nadendla Manohar-2Nadendla Manohar-2

నిత్యం ప్రజా క్షేమం కాంక్షించే నాయకుడు పవన్ కళ్యాణ్
పాలకులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి
పల్నాడు ప్రాంతంలోనే కౌలు రైతు భరోసా యాత్ర
క్రోసూరులో మీడియాతో నాదెండ్ల మనోహర్

వైసీపీవి (YCP) పిచ్చి ప్రేలాపనలు. వైస్సార్ కాంగ్రెస్ (YSR Congress) పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను పట్టించుకునే తీరిక జనసేన పార్టీకి (Janasena Party) లేదని నాదెండ్ల మనోహర్ Nadendla Manohar) స్పష్టం చేశారు. కుటుంబాన్ని, సినిమాలను వదిలి 365 రోజులు ప్రజా క్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ (Political affairs Committee) నాదెండ్ల మనోహర్ అన్నారు.

రాష్ట్ర ప్రజానీకానికి సొంత డబ్బు వెచ్చించి సేవ చేస్తున్న నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో పల్నాడు ప్రాంతంలోనే (Palnadu) జనసేన కౌలు రైతు భరోసా యాత్ర (Kaulu Rythu Bharosa Yatra) చేపట్టనున్నట్టు చెప్పారు.

వైసీపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే?

ముఖ్యమంత్రికి (Chief Minister), ఆ పార్టీ నాయకులకు ప్రజా సంక్షేమం (People’s welfare) పట్ల ఏ మాత్రం నిజాయతీ, చిత్తశుద్ది ఉన్నా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని,  పవన్ కళ్యాణ్ మాదిరి వారి కుటుంబాల్లో పిల్లల చదువులకు అండగా నిలబడాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని (Janasena Party office) నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో (Media) మాట్లాడుతూ “రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడు (Honest Leader) మరొకరు లేరు. జనసేన (Janasena) నిజాయతీయే జనసేనకు ధైర్యం. వైసీపీ నాయకుల (YCP Leaders) చౌకబారు విమర్శలు పట్టించుకోం అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

మంత్రి పదవులు కాపాడుకోవడానికి విమర్శలు

గతంలో మంత్రి పదవులు కాపాడుకోవడానికి విమర్శలు చేశారు. వారు చేసే విమర్శల్లో వీసమెత్తు నిజాయతీ లేదు. వైసీపీ నాయకుల కల్లబొల్లి కబుర్లు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. రాబోయే ఆరు నెలల కాలం జనసేన పార్టీ నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజల పక్షాన పోరాటం చేసేలాగా కార్యక్రమాలు నిర్వహించనున్నాం అని మనోహర్ స్పష్టం చేసారు.

ఇప్పటికే జనవాణి (Janavani)పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని గడచిన రెండు వారాలు నిర్వహించాం. నిన్నటి కార్యక్రమంలో 539 అర్జీలు పవన్ కళ్యాణ్  దృష్టికి వచ్చాయి. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఆయన మీద విమర్శలు చేసే ముఖ్యమంత్రికి, వైసీపీ నాయకులకు (YCP Leaders) చిత్తశుద్ది ఉందా?  ఉంటే పవన్ కళ్యాణ్’లా జిల్లాల్లో తిరగాలి? అలా తిరిగి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు మీరు హామీ ఇచ్చిన రూ. 7 లక్షల పరిహారం అందించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేస్తున్నారు.

రైతుల బిడ్డల చదువులకు అండగా…

పవన్ కళ్యాణ్ మాదిరి ఆ రైతుల బిడ్డల చదువులకు అండగా నిలబడాలి. స్థానికంగా పార్టీ బలోపేతం దిశగా జనసైనికులు (Janasainiks) అద్భుతంగా పని చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వినే విధంగా పని చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో పార్టీ రోజు రోజుకీ బలపడుతోంది. రాబోయే రోజుల్లో ఇదే ప్రాంతంలో రైతు భరోసా యాత్ర చేపడతాం” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి  బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు  గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు  సయ్యద్ జిలానీ,  నయూబ్ కమాల్,  వడ్రాణం మార్కండేయబాబు, బేతపూడి విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జనసేన తుని మండల కమిటీ ప్రమాణ స్వీకారం