Ambedkar and PeriyarAmbedkar and Periyar

అక్కరకు రాని రిజర్వేషన్లా -అందలం ఎక్కించే రాజ్యాధికారమా?

కాపు యువతకు నిజంగా ఉపయుక్తమైన పధకం కాపు కార్పోరేషన్ ద్వారా కాపు విద్యార్థులకు, యువతకు అందే విద్యా, ఉపాధి అవకాశాలా? లేక కాపు రిజర్వేషన్ల అంశమా? లేకపోతే రాజకీయ సాథికారికతా? సమగ్రమైన విశ్లేషణ. దీనిని ఒకసారి గమనించాల్సిన అవసరం ఏంతైనా కాపు యువత పైన ఉన్నది.

కాపు రిజర్వేషన్లను పరిశీలిద్దాం

కాపు రిజర్వేషన్లు అనేది బీసీలో కానీ, ఓసీలో కానీ, విద్యా, ఉద్యోగ విషయాలకు మాత్రమే చెందినది మరియు నేడు ఏమాత్రం ఉపయోగం లేని అంశం. గతంలో కూడా దీనిని రాజకీయ కారణాల కోసం, ఒక రాజకీయ నాయకుడి కుర్చీ ప్రస్థానం కోసం ఉపయోగించిన అంశం మాత్రమే తప్పితే, దానిని నిజాయితీగా జాతిజనుల కోసం చేసిన ఉద్యమ అంశం కాదు.

ఇకపోతే ఈ అంశాన్ని పదే పదే తెర పైకి తేవడం చేస్తున్నారు. అంటే ఇది ఖఛ్ఛితంగా కాపు యువతలో గందరగోళం సృష్టించి మరలా రాజకీయ పబ్బం గడుపుకోవాలనే రాజకీయ పార్టీల కుట్రలో భాగమే తప్పితే, అందులో నిజాయితీ లేదు.

కారణం, నేడు ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోయాయి. కాబట్టి ఉద్యోగ కల్పనకు ఇది ఉతం కాదు. పైగా బీసీ-యఫ్ కేటగిరిలో ఉండటం వలన, అగ్రకుల ఉద్యోగాల మార్కులకు, దీనికి పెద్దగా వత్యాసం ఉండదు. ఇక ప్రైవేటు ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ల అంశం ఏమాత్రం ఉపయోగ పడదు. కాబట్టి కాపు యువత ఉద్యోగాల అవకాశాలను ఇది ఏమాత్రం మెరుగు పరచదు. కాబట్టి అనవసరం.

ఇక విద్యా రంగంలో అలోచన చేస్తే, బీసీలలో ఉండటం వలన ఏమైనా కొద్దిపాటి అతి స్వల్ప మార్కుల తేడా మాత్రమే అగ్ర వర్ణాలతో తేడా ఉంటుంది. కాబట్టి విద్యారంగంలో కూడా పెద్దగా ఉపయోగ పడదు.

ఇకపోతే, ఓసీలలో రిజర్వేషన్లు అందరితో సమానమే. కానీ ప్రత్యేకంగా ఇవ్వటం సాథ్యం కాదు చట్టపరంగా. ఇకపోతే, అర్హత ఉంటే, ఖఛ్ఛితంగా ఓసీ రిజర్వేషన్ల వలన బీసీల రిజర్వేషన్ల కన్నా అధిక ప్రయోజనం ఉంటుంది. కారణం పేదరికం అనేది నిర్దేశం అయినప్పుడు ఖఛ్ఛితంగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఓసీ రిజర్వేషన్లలో ఉన్న ఈడబ్లుయస్ ఉత్తమం. కాకపోతే, ప్రత్యేకంగా 5% అడగకుండా పూర్తి 10%లో పోటీ పడటానికి అవకాశం ఉన్నది.

ఇకపోతే, బీసీలలో రిజర్వేషన్ల అంశం వలన, కాపు యువత బీసీ యువతతో ఘర్షణ వాతావరణం, వ్యతిరేక భావాలు పెరుగుతాయి. అలాగే ఓసీలలో ఈడబ్లుయస్, రిజర్వేషన్లలో వాటా అడగటం వలన అగ్రకుల పేద వర్గాల యువతతో ఘర్షణ వాతావరణం, వ్యతిరేక భావాలు వస్తాయి. కాబట్టి, ఈ రెండు కూడా ఏమాత్రం కాపు యువత అభ్యున్నతికి ఉతం కాదు. పైగా ఇతరుల భాధ, ఘోష వలన వచ్చిన అవకాశాలు కాపు యువతకు మేలు చేయవు, దూరదృష్టితో అలోచన చేస్తే ఇవి అన్నీ అవగాహన కాగలవు.

కాపు కార్పోరేషన్ లాభమా నష్టమా?

నిధుల కల్పన:-

కాపు జాతిలో విద్య పట్ల మక్కువ కలవారు అత్యధికంగా ఉన్నారు. కానీ ఉన్నత విద్య అభ్యాసానికి పేదరికం వీరికి పెద్ద అడ్డంకి. ఇది రైతువారి కుటుంబాల్లో కానీ, మధ్యస్ధాయి ఉద్యోగ వర్గాల్లో కానీ, మధ్య తరగతి వారిలో కానీ. కారణం వారి సంపాదన కుటుంబ పోషణకు మాత్రమే సరిపోయేంత ఉంటుంది. మహ అయితే డిగ్రీ స్ధాయి చదువు వరకు కోనసాగవచ్చు. అది కూడా అతి కష్టం మీద మాత్రమే చదవగలరు.

కానీ ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, చార్టర్డ్ అకౌంటింగ్ లాంటి ఉన్నత విద్య చేయాలంటే, ఏమైనా స్థిరాస్తి ఉంటే, వాటిని అమ్మకుండా, విద్య పూర్తి చేయటం కుదరదు. ఒకవేళ అరకంగా ఉన్న అస్తి అమ్మి చదువుకున్న తరువాత ఉద్యోగ అవకాశాల దగ్గర మరలా యుధ్ధమే. ఇక్కడ కనుక అవకాశాలు దొరక్క పోతే, యువత పూర్తిస్థాయిలో నిసృహ, నిరాశకు గురిఅవుతుంది. ఉన్న కోద్దిపాటి అస్తి అమ్ముకుని, సంపాదించిన విద్య వలన ఏమాత్రం ఉపయోగం లేకపోతే, ఉహలకు అందని నైరాశ్యం కలుగుతుంది. ఇది ఎక్కువ జనాభా కలిగిన కాపు యువతకు వాంఛనీయం కాదు. సమాజంలో విపరిణామాలకు దారితీస్తుంది.

అదే కాపు కార్పోరేషన్ ద్వారా అయితే, పేద, దిగువ, మథ్య తరగతి కాపు యువతకు ఉన్నత విద్య అవకాశాలు ప్రభుత్వ సహకారంతో, సొంతంగా ఉన్న కోద్దిపాటి అస్తులు అమ్మకుండానే పూర్తి అవుతాయి. ఇకపోతే, ఉన్నత విదేశీ విద్య కూడా అందుబాటులో ఉంటుంది అర్హతలు ఉంటే. దీని వలన కాపు యువత చక్కగా కుటుంబ అర్థిక పరిస్ధితి చిధ్రం కాకుండా అభివృధ్ధి చెందుతారు.

ఎప్పుడైతే ఉన్నత విద్యావంతులు అవుతారో, దానితో ప్రైవేటు ఉద్యోగాల అవకాశాల వలన త్వరగా సంపాదన సాధించి, కుటుంబాలకు సాయం చేయగలుగుతారు.

అలాగే ఏవరైనా ఔత్సాహిక యువత కుటీరపరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు స్థాపనకు కాపు కార్పోరేషన్ ద్వారా పెట్టుబడులు లభ్యం కావటం వలన, ఉపాధి రంగంలో వెళ్ళునుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవకాశం ఉంటే చక్కటి దిగువ, మధ్యస్త పారిశ్రామికవేత్తలు కాగలరు. తద్వారా మిగిలిన వర్గాల యువతకు కూడా ఉపాధి కల్పించిన వారు అవుతారు.

కాబట్టి ఏరకంగా చూసినా కూడా కాపు కార్పోరేషన్ ద్వారా లభించిన అవకాశాల వలన కాపు యువతకు పూర్తిస్థాయి ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువ. అదే కాపు రిజర్వేషన్ల అంశం వలన కాపు యువతకు అభివృధ్ధి అవకాశాలు బహూ స్వల్పం.

కాబట్టి కాపు యువత పోరాటం చేయాల్సింది ఏపీ సీఎం జగన్ రెడ్డి ఇస్తామన్న సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల నిధుల కల్పన, వినియోగం పైన తప్పితే కాపు రిజర్వేషన్ల అంశం పైన కాదు అనేది అర్ధం చేసికోగలరు.

రాజకీయ సాధికారత లాభమా నష్టమా?

కాపు యువత ఒక విషయంలో అనగా పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. బీసీలు, అగ్రవర్ణాల పేదలకు తోడుగా నిలబడి, వారితో భుజం భుజం కలిపి రాజ్యాథికార సాథన దిశగా అడుగులు వేయాలని జనసేనాని అన్నారు. అలా అడుగులు వేయడం వలన ఖఛ్ఛితంగా రాజకీయాలలో మార్పు వస్తుంది. తద్వారా సమసమాజ స్థాపన వస్తుంది. అలావస్తే అన్ని వర్గాలకు సమాన విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ దిశగా కాపు యువత అడుగులు వేయాలి. అల్లా వేస్తే ఖఛ్ఛితంగా మిగిలిన వర్గాల యువత కూడా మీతో భుజం భుజం కలిపి నడుస్తారు.

కారణం ఇందులో అందరి ప్రయోజనాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి మరోకరి వలన ఇబ్బందులు ఉండవు. మాకు చెందిన అవకాశాలు దెబ్బతీసారు అనే భావన ఎవరికీ కలగదు.

పైగా ఇది సమాజ శ్రేయస్సు రీత్యా, రాష్ట్ర అభివృధ్ధి రీత్యా, సమసమాజ స్థాపన రీత్యా, కులరహిత సమాజ స్థాపన రీత్యా పూర్తిగా వాంఛనీయం.

కాకపోతే ఇది కుటుంబ, కుల, అవినీతి, తోడుదోంగల, భాగస్వామ్యుల పార్టీలకు అభ్యంతరకరం, ఇబ్బందికరం కావచ్చు. మరియు వాటి రాజకీయ మనుగడకు గోడ్డలిపెట్టు. కాబట్టి వారు మాత్రమే సమసమాజ స్థాపనకు వ్యతిరేకం. సమాజంలో కులాల మథ్యన చిచ్చు ఉంటేనే, వారికి రాజకీయ ప్రయోజనం ఊడవచు అని గమనించగలరు.

కానీ జనసేన పార్టీకి కులరహిత, సమసమాజ స్థాపన మూల సిధ్ధాంతం. కాబట్టి జనసేన దీనిని అచరిస్తూంది. అనుసరిస్తూంది, శిరశావహిస్తూంది అని చెప్పాలి. కాబట్టి కాపు యువత లోతైన అలోచన చేయాల్సిన సమయం వచ్చింది.

ముక్తాయింపు

కానీ నేటి ప్రభుత్వం చాలా తెలివిగా కాపు యువత అలోచనలు రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరిగేలా చేస్తూన్నారు. అలాగే వైకాపా అనుబంధ మీడియాలు కూడా. కానీ కాపు యువత అలోచన చేయాల్సిన అంశాలు రెండు. ఒకటి రాజకీయ సాథికారికత, రెండు కాపు కార్పోరేషన్ ద్వారా లభించే నిధుల కల్పన.

ఆలోచించండి… పాలకులకు వారి పాలేర్లకు మాత్రమే ఉపయోగపడే రిజర్వేషన్లు  కావాలా లేక పాలకుల ఎత్తులను చిత్తు చేసే రాజ్యాధికారం కావాలా?

–శింగలూరి శాంతి ప్రసాదు, న్యాయవాది, మచిలీపట్నం

బాబుతో పొత్తులపై చేదైన అక్షర సత్యాలు!!!