AP CM JaganAP CM Jagan

మొన్న చంద్రబాబు (Chandra Babu) మీటింగులో జరిగిన
తొక్కిసలాటలో ప్రమాదం జరిగిందని
రోడ్లపై సమావేశాలు రద్దు (Ban on Public meetings) అన్నారు.

సంతోషం. చాలా మంచి నిర్ణయమే అనుకొందాం. తప్పదు అనుకోవాలి కూడా.

మరి విశాఖ ఎయిర్ పోర్టులో (Vizag Airport) మీపై దాడి జరిగింది
మరి విమానాశ్రయాలను కూడా రద్దు చేసేస్తారా?

నాన్నగారు వైస్సార్ (YSR) హెలికాప్టర్ (Helicopter crash landing) ప్రమాదంలో చనిపోయారు కదా
మరి హిలికాఫ్టర్’లకు కూడా రద్దు చేస్తారా?

బాత్రూంలో మన బాబాయిని (Vivekananda Reddy) ఎవరో హత్య చేసారు కదా
మరి బాత్రూములకు వెళ్లడాన్ని కూడా నిషేధిస్తారా?

మీ హయాంలో పడవ ప్రమాదంలో (Boat accidents) కొంతమంది చనిపోయారు కదా
మరి పడవ ప్రయాణాలను కూడా నిషేదిస్తారా/రద్దు చేస్తారా?

వారానికొక రోడ్డు ప్రమాదం (Road accidents) అయినా జరుగుతున్నది కదా
మరి రోడ్లపై సామాన్యుల ప్రయాణాలను కూడా రద్దు చేసేద్దామా?

ఆ మధ్యన కెమికల్ ఫ్యాక్టరీలో (Chemical factory) ప్రమాదం జరిగింది కదా
మరి ఆ కెమికల్ ఫ్యాక్టరీలను కూడా రద్దు చేద్దామా?

మందు తాగుతున్నవారిలో అక్కడక్కడా చనిపోతున్నారు కదా.
మరి చేరిపోతున్నారు అని మందు షాపులను రద్దు (Ban on Liquor) చేసేస్తారా? మందు తయారు చేయడం ఆపేస్తారా?

ఇలా చెప్పుకొంటూ పోతే సవాలక్ష ఉన్నాయి. అయినా

పెరుగుతున్న ధరలతో ప్రజలు చస్తున్నారు.
మరి వ్యాపారాలను, షాపులను, ధరలను కూడా రద్దు చూసేద్దామా?

అదే సార్ సామాన్యుల క్షేమం కోసం మొత్తం సమాజాన్నే రద్దు చూసేద్దామా?
లేక ప్రతిపక్షాలకు నష్టం వచ్చే వాటినే మాత్రమే రద్దు చేస్తారు
అనే ఆరోపణలను ఒప్పుకొని సర్దుకు పోదామా?

ఆలోచించండి… ఆవేశం లేకపోతే ప్రతిపక్షం నాయకుడు కొనసాగలేడు. ఆవేశం ఉంటే అధికారంలో ఉన్నవాడు కొనసాగలేడు. ఇదే అక్షర సత్యం (It’s from Akshara Satyam)

(స్పష్టత కోసం అడుగుతున్నాం సుమా. మరేదీ కాదు)

అనుమతుల పేరుతో మా గొంతు నొక్కుతారా. తగ్గేదేలే: నాదెండ్ల మనోహర్