అక్షర సత్యం (Akshara Satyam) అంటే
పచ్చ పార్టీకి (Pacha Party) కడుపు మంట?
నీలి పార్టీకి (Neeli Party) వళ్లు మంట?
కమలానికి (Kamalam) కూడా కోపమే?
కుల సంఘాలకు (Kula sangalu) అసహ్యం…
కుల నాయకులకు (Caste leaders) ఏవగింపు…
మేధావులకు (Intellectuals) అర్ధం కాడు…
సామాన్యులకు అక్షర సందేశం (Akshara sandesam) చేరదు…
అయినను పోరాటం చేయవలె. ఇది బిడ్డల రేపటి భవిత కోసమే అంటూ పోరాడవలెను అనుకొంటూ పోరాడుతూనే ఉన్నాం. అణగారిన వర్గాల ఆశల సౌధం అయిన రాజ్యాధికార సాధనకు ఉడుతా భక్తిగా పోరాటం చేస్తూనే ఉన్నాం.
కానీ కానీ కానీ …
ఎవరి కోసం పోరాటం చేస్తున్నామో…
ఏ పవనాలు కోసం ఆరాటపడుతున్నామో…
ఏ అంజనీపుత్రుని వల్ల రాజ్యాధికారం (Rajyadhikaram) సాధిస్తాం అని ఆశ పడుతున్నామో…
ఆ అంజనీపుత్రుడే అర్ధం చేసికోకుండా ఉంటున్ననాడు…
మా కంఠ ఘోష్’ను, ఆక్రందనలను ఎవరికీ చెప్పుకోవాలి. ఆ నలుగురు మేఘాల్లా పవనాలను (Pawanalu) అడ్డుకొంటున్నాయా అనే మా అనుమానాలను ఎవరు నివృత్తి చేస్తారు?
ఆ నాలుగు మేఘాలను ప్రచండ పవనాలై (Pavanalu) చీల్చుకొంటూ వచ్చి ఆ రెండు దోపిడీ పార్టీలను మట్టు పెట్టేది ఎప్పుడు? మా లాంటి వారి దీన గాధలను మా పవనాలు వినేదెప్పుడు?
కొసమెరుపు:
ఎప్పటికైనా రాజ్యాధికార సాధన మెగా సోదరుల (Mega Brothers) వల్లే సాధ్యం అనే నిజాన్ని మార్పు కోరే సమాజానికి (ఆ పవనాలకు కూడా) చెప్పడానికి అక్షర సత్యం ఎప్పటికీ సిద్ధమే. అయినను పోరాటం చేయవలెనని ముందుకు సాగుతూనే ఉంటుంది.
ఆలోచించండి… ఇది అక్షర సత్యం ఆవేదన కాదు. మార్పు కోసం ఎదురు చూస్తున్న అణగారిన వర్గాల గుండె చెప్పడు (It’s from Akshara Satyam)