Pawaneswarudu with ChiruPawaneswarudu with Chiru

ఓ పవనేశ్వరా (Pawaneswara) అంటున్న ఓ నంది దీనగాథ!

రాక్షస మూకలకు (Raksasa Mukalu) కూడా నువ్వు దేవుడువి సామి. ఎందుకంటే

శంకరుడిని లేకుండా చేయాలనే రాక్షసులకు కూడా వరాలిస్తూ తన ఉనికికే ప్రమాదాలు కొని తెచ్చుకోవడంలో ఆ భోళాశంకరుడు (Bhola shakar) పెద్ద దిట్ట.

నీ సినిమాలు లేకుండా చెయ్యాలనే నీ ప్రత్యర్దులకే బ్లాక్’లో టిక్కెట్లు అమ్ముకొనే వరాలిస్తూ నీ ఉనికినే ప్రమాదంలో నెట్టుకొంటున్నావు. అయినా నువ్వు దేవుడవు సామీ (You are God).

నిన్ను అణచివేసే ఆ పచ్చ-నీలి రాక్షస మూకలకే వరాలు ఇస్స్తున్నావు. నీలో ఉన్న శివతత్వం (Siva Tatva) అటువంటిది సామి. అర్ధం చేసికోగలం. మరి మాకు ఎందుకు కనిపించవు సామి.

నిన్ను నమ్ముకొన్న నీ భక్తులకు కూడా దర్శనం ఇవ్వు సామి. నీ తలుపులు తెరుచుకొనేది ఎప్పుడు సర్వ దర్శనం జరిగేది ఎప్పుడు సామీ.

నీ దర్శనం దొరకాలి అంటే రాక్షస జన్మ అయినా ఎత్తాలి లేక మనోహరమైన జపం జన్మాంతం చేస్తూ ఉండు. వచ్చే జన్మలో నీకు దర్శన భాగ్యం దొరుకుతుంది అంటే ఎలా సామి?

కొంతమంది స్థార్ హోటల్ సమావేశాలు పెట్టినా, ఫ్యాన్ కింద చేదతీరుతున్నా, సైకిల్ తొక్కినా, నీ దర్శనం దొరక్కే సామి. దీనికి నీ స్వయంకృతాపరాధమే కారణంగా కనిపిస్తున్నది సామి.

నీ చేష్టలు రాక్షస మూకలకు వరాలుగా మారుతున్నాయి. నీ అడుగులో అడుగు వేద్దామనే వారికి శాపంగా మారుతున్నాయి. జరా ఆలోచించు సామీ.

మీరు ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే మీ మూడో నేత్రాన్ని తెరుస్తున్నారు. విరుచుకు పడుతున్నారు. కానీ అది అవసరం లేదు సామి. ప్రస్తుత రాజాకీలను నిరంతరం అర్ధం చేసికోవడానికి ఆ మీ రెండు నేత్రాలను కాస్త తెరిచే ఉంచండి సామీ.

ఆలోచించండి… రాజ్యాధికారం (Rajyadhikaram) మీకు అవసరం లేక పోవచ్చు. కానీ మాకు కావాలి. అది రావాలి అంటే మీరు మీ మనో నేత్రంతో ఆలోచించండి. అంతేగాని మనోహర నేత్రంతో కాదు.

ఇట్లు మీ నంది (Akshara Satyam )

అణచివేతలపై రగులుతున్న వివిధ కుల సంఘాలు?