విజయవంతంగా ముగిసిన జనసేన యువశక్తి (Highlights of Janasena Yuva Shakthi)
జగన్ ప్రభుత్వానికి మద్యం షాపులమీద ఆశక్తి వృద్ధాశ్రమాలపై లేదు: రణస్థలంలో యువత
పీఎచ్ డి చేసిన నన్ను జనసేన వెంట ఉన్నాను అనే వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్నది: సందీప్ పంచకర్ల
దేశానికైనా, రాష్ట్రానికైనా యువత వెన్నెముక లాంటివారు. కానీ మన ప్రభుత్వాలు ఆ వెన్నెముకని విరిచేస్తున్నారు: యువశక్తి
మన దేశంలో గాని రాష్ట్రంలో గాని రైతు కష్టాలను పట్టించుకోవడం లేదు. జై కిసాన్ అంటున్నారు గాని ఆ కిసాన్ పడుతున్న కష్టాలను వినిపించుకోవడం లేదు.
మన రాష్ట్రంలోని యువతను మంచి భవిషత్తు ఉండాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి: యువశక్తి
జగన్ మోహన్ రెడ్డి యువతికి ఇవ్వాల్సింది నిరుద్యోగ భృతి లేదా పెన్షన్ కాదు. యువతకి ఉపాధి కల్పించండి.
జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి ఎన్నుకొంటా ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానాన్నే రద్దు చేసేస్తారు.
వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రావడం లేదు. ప్రభుత్వం ఉద్యోగాలు రావడంలేదు. యువత ఉపాధి కోసం వలసలు పోతున్నారు.
సముద్రాన్ని తలపిస్తున్న రణస్థలంలో జరుగుతున్న జనసేన యువశక్తి
ఈ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడుతుంది ఈ జనసేన యువ శక్తి కార్యక్రమం. మా తాత పల్లకీలు మోశాడు. మా నాన్న పల్లకీలు మోశాడు. నేనూ పల్లకీలు మోయాలా. ఎన్నాళ్లీ మాకీ పల్లకీల మోత.
మాకు కావాల్సింది కూడు గూడు గడ్డ కాదు. మాకు కావాల్సింది విద్య వైద్యం ఉపాధి. వీటిని జనసేన కల్పిస్తుంది.
మాకు మత్సకార భరోసా వద్దు. మాకు కావాల్సిన జట్టీలు కట్టించండి. మా మత్సకారుడు మత్సకారుడే అవ్వాలా. మీరు మాత్రం సీఎంలు అవుతారా. ఎంతకాలం మాకీ బానిసత్వం
లక్షలు ఖర్చు పెట్టి పంచాయితీ అధ్యక్షులు గా గెలిచే ఏమీ చెయ్యలేక పోతున్నాం. మాకీ పంచేయితీలు వద్దు. రాదు చేసేయండి. మాకెందుకు పవర్ లేని పంచాయితీలు
ధర్మాన ప్రసాద రావు లాంటోళ్ళు బాగుపడుతున్నారు గాని శ్రీకాకుళం వెనుకపడుతున్నది. ఎందుచేత. దోపిడీ ప్రభుత్వాలు
గంజాయిని పండించాలి అంటే యువత, రవాణా చేయి అంటే యువత ఆ గంజాయిలో నాశనం అవుతున్నది యువత. జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్ములించక పోతున్నది. సిటీ అఫ్ డ్రగ్స్ గా వైజాగ్ మారిపోతున్నది.
మందు సీసా కోసమో లేక బిర్యానీ కోసమో ఇక్కడికి రాలేదు. వారి భవిష్యత్తు కోసమే వచ్చారు.
పవన్ కళ్యాణ్ డి నిలకడలేని రాజకీయం కాదు. పవన్ కళ్యాణ్ డి నికార్సైన రాజకీయం
నేను ఎప్పుడూ కష్టాల్లో ఉన్న యువత గురించి, సమాజం గురించే ఆలోచిస్తాను: పవన్ కళ్యాణ్
నేను ప్రతీ యదవ చేత, సన్నాసి చేత మాట అనిపించుకొంటున్నది మీ కోసమే, మీ భవితకు పునాది వేయడం కోసమే: పవన్ కళ్యాణ్
నేటి మన సమాజంలో ఈ ప్రభుత్వాలపై కోపం ఉంది అలానే ప్రశ్నించడానికి భయం ఉంది.
ఇది కళింగ ఆంధ్ర కాదు. కలియబడే, తిరగబడే ఆంధ్ర. వలసలు పోవడం కాదు. తిరగబడం నేర్చుకోండి.
శ్రీ శ్రీ, రవిశాస్త్రి, చాగంటి సోమయాజులు, గిడుగు రామ మూర్తి లాంటివారు స్ఫూర్తి నిచ్చారు.
నేను పార్టీ పెట్టినప్పుడు డబ్బులు లేవు. అంబెడ్కర్ భవనాల్లో పడుకొన్నాను. ఉత్తరాంధ్ర కష్టాలకంటే నేను పడ్డ కష్టాలు ఎంత అని అనుకొంటాను.
సభలకు వచ్చి నన్ను ఆదరించారు. కానీ ఓట్లు వేసేటప్పుడు నన్ను వదిలేసారు. అయినా నా పోరాటాన్ని నేను కొనసాగించాను.
నా చివరి శ్వాశ వరకు రాజకీయాలను మిమ్ములను వదలను.
పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారు. నేను ప్రజలను దోచుకొనే కాంట్రాక్టులు చేయలేను. సినిమాలు చేయాలి.
మూడు ముక్కాలా ముఖ్యమంత్రికి డంకా పలాస గాడు సలహాదారుడు.
రాజీ పడి బతకడం నాకు చేతకాదు. తిరగబడి బతకడమే తెలుసు. అవసరం అయితే చెప్పు తీసి కొడతా
నేను బ్రతికున్నంతవరకు వైసీపీ గుండాలపై పోరాటం చేస్తూనే ఉంటా
నేను కుల నాయకుడిని కాదు. నేను సమాజం కోసం వచ్చాను. నా దేశం కోసం అలానే నా రాష్ట్రము కోసం వచ్చిన వాడిని.
పొద్దుటే పథకం ఇది డబ్బులు ఇస్తాను. సాయంకాలం మందు రూపంలో పట్టుకుపోతా. ఇదే జగన్ నైజం
అధికారంలోకి వస్తాను. అభివృద్ధి చేసి చూపిస్తాను.
ఆమె బిడ్డ ప్రాణం ఖరీదు మూడు బస్తాల బియ్యమా. ఇదేనా వైసీపీ ప్రభుత్వ మంత్రి చెప్పేది.
జనసేనకు మీరు అండగా ఉండకపోతే రాష్ట్రము నాశనం అవుతుంది.
మీ పదవులు కోసం రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారా
నినాదాలతో మార్పు రాదు. మార్పు రావాలి అనే సంకల్పం ఉంటే మార్పు వస్తుంది.
ఫోటోలు కోసం వచ్చేవారు నాకొద్దు. నన్ను కలవక పోయినా పోరాడేవారు కావాలి
మీరేమో కొదమ సింహాలు కానీ మిమ్ములను పాలిస్తున్నది గ్రామా సింహాలు
మీరు ధైర్యం చేస్తే స్వేచ్ఛ మీ కోసం ఎదురు చూస్తున్నది
నన్ను గెలిపించి ఉంటే సభల్లో పోరాడేవాడిని. కానీ నేడు ప్రజా క్షేత్రంలో ఉద్యమిస్తున్నాను.
ఓటు చెలనివ్వను అంటే టీడీపీకి మద్దతు అని కాదు. బాబుని కలిసింది దాసోహానికి కాదు.
ప్రభుత్వ పెద్దల అవినీతి గురించి మాట్లాడాను.
వీర మరణాలు కాదు వ్యూహాలు కావాలి మనకి. నాకు మీ మద్దతు నిస్తాను అంటే ఒంటరిగానే పోటీ చేస్తాను.
మన గౌరవం తగ్గితే కలిసి పోటీచేసే పరిస్థితి లేదు. ఒంటరిగానే పోటీ చేస్తాను.
దామాషా పద్దతిలో అధికార ఫలాలు దక్కాలి. అదే జనసేన సిద్ధాంతం కాదు.
జనసేన ప్రభుత్వంలో పంచాయితీ నిధులు వచ్చేలా చేస్తాం
ఇంతకాలం అవినీతి పరుడి పాలనా చూసారు. ఒక్కసారికి పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ పరుడి పాలన చుడండి
వరహితో వస్తాను. సిద్ధంగా ఉండండి. ఎవడు ఆపుతాడో చూస్తాను. అపాండిరా చుసికొందాం.
అవినీతి లేని పాలన అందిస్తాను. విద్య వ్యవస్థని బాబు చేస్తాను. ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాను. అందరికీ ఉపాధి కల్పిస్తాను. సంక్షేమ పధకాలను కొనసాగిస్తాను.
ఈ ఎన్నికలు కీలకమైనవి. నన్ను నమ్మండి. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రిని అవుతాను. లేకపోయినా మీకు సేవ చేస్తాను.
మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. అలోచించి ఓటువేయండి.
రోజుకి కోటి ఆదాయాన్ని వదులుకొని మీ కోట్లాది ప్రజల కోసం వస్తున్నాను అలోచించి ఓటేయండి అని జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.