Modi and Venkaiah NaiduModi and Venkaiah Naidu

‘విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట కలుగుతుంది’ – ఈ మాటలు చాలు మన వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) గురించి మనం అర్థం చేసుకోవడానికి. ఆయనే తెలుగుతనం (Telugu) మూర్తీభవించిన రాజకీయ బాటసారి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుజీ (Venkaiah Naidu). ఉపరాష్ట్రపతిగా (Vice President) పదవీ విరమణ సందర్భాన అధికార వీడ్కోలు సభలో ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ చైతన్యపరుస్తాయి అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మన వెంకయ్య నాయుడుజీని (Venkaiah Naidu) కొనియాడారు.

వెంకయ్య నాయుడుని రాజకీయ బాటసారిగా ఎందుకు అభివర్ణించానంటే.. విద్యార్థి దశలోనే (Student Life) రాజకీయాలలో ప్రవేశించారు. అత్యవసర పరిస్థితిని ఎదిరించి, ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపారు. అది మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి (Vice President) పదవి వరకు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో అనుభూతులు ఉన్నాయి. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పదవీ లేకుండా ఆయన ఎప్పుడూ లేరు. ఆయన రాజకీయ మేధావి. ఇటు శాసనసభ, అటు రాజ్యసభలలో (Rajya Sabha) ఆయన చేసిన ప్రసంగాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింప చేశాయి. రాజ్యసభ ఛైర్మన్ గా ఆయన సభను నడిపిన తీరు బహుదా ప్రశంసనీయం అని పవన్ కళ్యాణ్ మన వెంకయ్య నాయుడుని (Venkaiah Naidu) కీర్తించారు.

తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై శ్రీ వెంకయ్య నాయుడుకి ఉన్న పట్టు, వాగ్ధాటి ప్రతి ఒక్కరినీ సమ్మోహన పరుస్తాయి. “ఉప రాష్ట్రపతి కంటే ఉషాపతిగా ఉండడమే నాకు ఆనందం” వంటి ఆయన చమత్కారాలు, భాషా విరుపులు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అటు పార్టీ పదవైనా ఇటు రాజ్యాంగ పదవైనా వాటికి వన్నెలు దిద్దడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా.. ఆయన గురించి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. ఆయనను నేను అరుదుగానే కలిసినప్పటికీ కలిసిన ప్రతిసారి ఆయన ఇచ్చే సలహాలు నా రాజకీయ ప్రయాణానికి ఉపయుక్తంగా ఉంటాయి అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

తెలుగు రాష్ట్రాలన్నా, తెలుగు భాషన్నా (telugu language) ఆయనకున్న మక్కువ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. శ్రీ వెంకయ్య నాయుడు తెలుగు బిడ్డగా (Telugu bidda) జన్మించడం తెలుగువారికి గర్వకారణం.

ఉప రాష్ట్రపతిగా (Vice President) పదవీ విరమణ చేసి ప్రజలతో మమేకం కావటానికి సమాయత్తమవుతున్న తరుణంలో శ్రీ వెంకయ్య నాయుడుకి జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హార్దిక శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయనకు ఆ భగవంతుడు సుసంపన్నమైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును, విశ్రాంతి అవసరమవ్వని జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని జనసేనాని మనసారా కోరుకున్నారు.

భయంతో పరిగెత్తడం ఆపి-పాలనపై దృష్టి పెట్టండి