శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము (Maddi Anjaneya Swamy Temple) నందు శుక్రవారం నాడు హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీలు లెక్కించగా 57 రోజులకు గాను దేవస్థానము హుండీ ద్వారా (Hundi Collections) రూ. 26,50,030/-లు, చిల్లర నాణెముల రూపములో రూ.1,42,057/-లు ఆదాయం లభించింది. అలానే అన్నదానం హుండీ ద్వారా రూ.32,239/-లు లభించింది. వివిధ రూపాల్లో లభించిన మొత్తము ఆదాయం రూ.28,24,326/- గా ఉన్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి కిసరి సరిత విజయభాస్కర రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేసారు.
ఈ దేవస్థానం పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయి గూడెం గ్రాములో ఉన్నది. ఇక్కడ ఉన్న తెల్ల మద్ది చెట్టు కింద శ్రీ మద్ది ఆంజనేయ స్వామి
వారు వేంచేసి ఉన్నారు.
అయితే మద్ది దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపును తాడేపల్లిగూడెంనకు చెందిన తనిఖీదారు ఏ.సుజన్ కుమార్ వారి పర్యవేక్షణలో, ధర్మకర్తల మండలి సభ్యులు దండు వెంకట కృష్ణం రాజు, శ్రీమతి పాములపర్తి యువరాణి, శ్రీమతి బల్లే నాగలక్ష్మి, శ్రీమతి జెట్టి దుర్గమ్మ మరియు ప్రత్యేక ఆహ్వానితులు కర్పూరపు రవి , కే.వీ.బీ .బ్యాంక్ సిబ్బంది, సమక్షమున స్వామివారి హుండీలను తెరచి లెక్కించడం జరిగింది.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబూరావు