Telugu MediaTelugu Media

పచ్చ మీడియాలోనూ (Pacha Media) అలానే నీలి మీడియాలోనూ (Neeli Media) లేదా వీరి అనుబంధ సోషల్ మీడియాలోను (Social Media) వస్తున్న చాలా విశ్లేషణలు అనుమానాలు కలిగించే విధంగా ఉంటున్నాయి. వీటిపై యువత జాగరూకులై ఉండాలి. కోన్ని ఛానళ్ళలో జరిగే డిబెట్లు (Debates) పరిశీలన చేస్తూన్నాను. వాటిలో ఎనలిస్టులు, తటస్థుల పేరుతో చాలామంది జనసేన (Janasena) తెదేపా (TDP) కలసి పోత్తు ఉంటుందని కోందరు పచ్చ పార్టీ పైయిడ్ వాళ్ళు అంటున్నారు. అలాగే జనసేన తెదేపా మరియు కేసిఅర్ (KCR) నూతన భారాసతో పోత్తు ద్వారా ఉభయ రాష్ట్రాలలో పోటీ ఉంటుంది అని మరికొందరు వాదనలు చేయటం చూస్తున్నాం.

మరోకడైతే, ఏకం గా ఒక ప్రైవేటు వెబ్ ఛానల్లో జనసేన-భాజపా-వైకాపా కలసిపోయి (Janasena BJP YCP) రాష్ట్రంలో తెదేపాని నాశనం చేయటం కోసం, రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేయటం కోసం చూస్తూన్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దిక్కుమాలిన వికారపు విశ్లేషణలు తప్పు దాని పట్టించే విధంగా ఉంటున్నాయి. అయన తటస్థుల పేరుతో కమ్మగా పలికే వాఖ్యానాలు పూర్తిగా మెగా సోదరులపైన విషం చిమ్ముతుంటాయి. కారణం వారి కమ్మనైన నాయకుడు 2009లో ముఖ్యమంత్రి కాకుండా, 2019లో కూడా మరలా ముఖ్యమంత్రి కాకుండా అడ్డం పడింది ఈ మెగా సోదరులే అనే విద్వేష భావం వారిలో ఉండి ఉండవచ్చు. 

అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వలన మరలా పచ్చ పార్టీ (Pacha Party) అవకాశాలు పూర్తిగా దెబ్బతిని పోతున్నాయి అనే అవేదన, అక్రోశం, నిసృహతో వాగుతున్న వాగుడు అయి ఉండవచ్చు. ఇదే జనసేన, వైకాపా కలసి పోయాయనే వాఖ్యలకు ప్రేరణ అయి ఉండవచ్చు.

కాబట్టి జనసైనికులకు ప్రత్యేకంగా చేసే విజ్ఞప్తి ఏమిటంటే… అటువంటి తటస్థులు, ఎనలిస్టుల పేరుతో చేసే విద్వేష పూరిత వాఖ్యలు, వాఖ్యానాలు పరిశీలనతో చుడండి. అవి ఏ ఛానళ్ళలో వచ్చినా, వెబ్ ఛానళ్ళలో వచ్చినా వెంటనే మీ అభిప్రాయాలు తెలియ చేయండి. మరలా చెబుతున్నాను మీ అభిప్రాయాలు ఖచ్చితంగా రిపోర్టు చేయడం మంచిది. అది సహేతుకమైన వాఖ్యలు, వాఖ్యానాలు అయితే వదిలేయండి.

పొత్తులపై తుది నిర్ణయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుండి వచ్చే వరకు ఈ పైడ్ విశ్లేషలను నమ్మవద్దు అని చెప్పదలచుకున్నాను.

జనసేన ఎదుగుదలకి కేవలం వైకాపా, తెదేపా మాత్రమే కాదు, తటస్థులు, ఎనలిస్టుల ముసుగులో ఉన్న కొందరు పైయిడ్ ఆర్టిస్టులు కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సదా అప్రమత్తంగా ఉండాలని జనసైనికులకు తెలియజేస్తున్నాను. తశ్మాత్ జాగ్రత్త.

–Shanthi Prasad Singuluri , High Court Advocate & Janasena Legal

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రశ్నించిన హైకోర్ట్!