Rythu sanghamRythu sangham

పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కొద్దిమంది సంపన్నుల చేతుల్లో ఉన్న ఎర్రకాలువ (Erra Kalava) ప్రాజెక్టు (Project) మిగులు భూములను (Excess Lands) పేదలకు పేదలకు పంచాలని కోరుతూ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం (Agriculture Employees Union) పాదయత్రని చేపట్టింది. వీరి పాదయాత్ర నిన్నటిరోజున తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారికి (National Highway) చేరుకొన్నది.

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జిల్లాలో సంపన్నుల చేతుల్లో ఉన్న అన్నిరకాల అసైన్డ్ ప్రభుత్వ భూములని పేదలకు పంచాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ భూములలో (Government Lands) పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని కూడా డిమాండ్ చేశారు.

ఏజన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల భూములు 1/70 చట్టం ప్రకారం గిరిజనులకు మాత్రమే దక్కాలి. కానీ వీటిలో కొన్ని గిరిజనేతర భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయని  వీరు వివరించారు. కావున వాటిని ప్రభుత్వమే స్వాధీనపర్చుకొని వాటిని గిరిజనులకు అప్పగించే చర్యలు తీసికోవాలని కార్మిక సంఘం కోరింది.

పేదల హక్కులపై పోరాడుతున్న గిరిజనులు (ST), వారికి అండగా నిలుస్తున్న సంఘాలపైన అన్ని ప్రభుత్వాలు (Governments) నిర్బంధాన్ని కొనసాగిస్తునే ఉన్నాయని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాసం పేరుతో స్థానిక గిరిజనుల భూములు లాక్కొంటున్నారని, నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమి అప్పగించలేదని కూడా ఆరోపించారు. వీటికి సత్వరమే పరిస్కారం చూపాలని ప్రభుతాన్ని కోరారు.

ఎన్నాళ్లని మోసపోతాం. మన కాళ్ళపై మనం జీవించేందుకు భూములను చట్టబద్ధంగా సాధించుకుందాం. ఆత్మగౌరవం సాధించుదాం. ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలని  “భూశంఖారావం” పూరిద్దాం అంటూ ఏలూరు కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రని కొనసాగిస్తున్నారు.

–గరువు బాబురావు

జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి!

Spread the love