ప్రభుత్వ వంచనతో దగాబడ్డ నిరుద్యోగ యువత (Unemployed youth) వీధులవెంట పడ్డారు? మెగా డీఎస్సీ (Mega DSC) లేదు. మెగా జాబ్ మేళా లేదు. ముష్టి ముప్పై ఆరు ఉన్నత ఉద్యోగాలు. మరియు కొద్దిపాటి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగ యువత ఆందోళన బాట పట్టారు. ఆదుకొంటాడు అని అన్నని అందలం ఎక్కిస్తే, అందరినీ వీధుల పాలు చేస్తాడా అంటూ నిరుద్యోగ యువత కన్నీరు కారుస్తున్నారు.
ఒక్క సారి అవకాశం అంటూ వచ్చాడు. ఆ వచ్చిన వాడు యువకుడు. అందునా పెద్దాయన కోడుకు. పైగా 25 మందిని ఇస్తే, ప్రత్యేక హోదాపైన కూడా కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తాను అంటూ ప్రతీ యూనివర్సిటీకి వెళ్ళి యువభేరి అంటూ ఊదర గొట్టాడు. ఏదో మా అన్న మమ్ములను ఉద్ధరిస్తాడు అని గుద్దుడే గుద్దుడు. అందరూ కష్టపడి అందలం ఎక్కించారు. మంచిదే.
ప్రైవేటు రంగంలో 75% ఉద్యోగాలు స్థానిక యువతకే?
వచ్చి రాగానే ప్రైవేటు రంగంలో (Private Sector) 75% ఉద్యోగాలు స్థానిక యువతకే అంటూ జీఓ కూడా తెచ్చాడు. ఆ జీవోతో మన వెర్రి గోర్రే యువత తెగ సంబర పడిపోయారు. డీజే సర్రండ్ సౌండ్’తో సాంగులు వేసి, లయబద్ధంగా స్టేప్పులు వేసి మరీ పండగ చేసికొన్నారు. ఇంకేముంది ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు గోదారి వరద లాగ మన రాష్ట్రంలోకి వచ్చేస్తాయి. మా అన్నోచ్చాడు కాబట్టి, మన ఉద్యోగాలు మనకే అంటూ అమాయక గోర్రేలు పూర్తిగా నమ్మారు. ఇది చూసిన పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా తమ తమ రాష్ట్రాల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే అని అంటే మన యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని మాలాంటి వారికి ఎక్కడో తేడా కొట్టి గళమెత్తి చెప్పాము. అయినా అమాయక గోర్రేలు మమ్మల్నినాడు తిట్టారు. తాము ఎన్నుకొన్న అన్నపై అంత నమ్మకం ఉంటే మంచిదే అనుకొన్నాం.
చివరకు జరిగింది ఏమిటంటే? ఉన్న ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లేవు. కోత్తగా ఏవీ రాష్ట్రంలోకి రావటం లేదు. మరియు మన యువతకి పక్క రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి అనుకొంటే, మనం పెట్టిన 75% స్థానికంగా అనే నిబంధన మనకే అడ్డం వస్తున్నది.
అన్నోచ్చాడు. ఉద్యోగాలు ఇస్తానన్నాడు?
అన్నోచ్చాడు, 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు అని గుండే నిబ్బరం చేసుకోని ఉందాం అనుకొన్నారు. అలా అనుకొంటుండగానే, రాగానే నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేసే గ్రామ/వార్డు వాలంటీర్ల (volunteer) ఉద్యోగాలు. గ్రామ సచివాలయం (Grama Sachivalayam) లో ఉద్యోగాలు అంటూ 4,00,000 పైగా ఉద్యోగాలు ఇచ్చాడు అనుకున్నారు. దీనితో సంతోషంతో కేరింతలు కూడా వేశారు.
సీన్ కట్ చేస్తే, మన నిరుద్యోగ యువతకి అన్న తత్త్వం బోధపడింది. గ్రామ/ వార్డు వాలంటీర్ల ఉద్యోగం అనేది మాయా ప్రపంచం తేలడం మొదలు అయ్యింది. అది తమలో ఉన్న ఉద్యోగం అనే బలహీనత అథారంగా చేసికొంటున్నారు. రాబోయే ఎన్నికలలో తమను పావులుగా వాడుకొంటున్నారు. తమ భూజాలుపైన వారు అథికార సౌథాలు నిర్మాణం కోసం పెట్టినదే ఈ వాలంటీర్ వ్యవస్థ అని నిరుద్యోగ యువత తెలుసుకొనే లోపే కాలహరణం జరగటం మొదలైంది.
వాలంటీర్ జాబులో ఉన్న చిక్కులు?
జీతం పెంచండి అని అడిగితే, జీతం పెంచటానికి అది ఉద్యోగం కాదు. కేవలం గౌరవపూరిత సామాజిక సేవకు ఇస్తూన్న పురస్కారం అంటూ అన్న అసలు విషయం చెప్పాడు. ఇక్కడ ఉన్న మరో కిటుకు ఏమిటంటే తెలుసా? వారు వాలంటీర్లను నిభంథనలు పేరుతో ఒక నేల నోటీసు ఇచ్చి తీసివేయగలరు. కానీ అదే వాలంటీర్లకు తమకు ఏదైనా మంచి స్థిరపడే ఉద్యోగం వస్తే, వాలంటీరు పోస్టుకి రాజీనామా చేయాలంటే. అప్పటివరకు తీసుకున్న పారితోషకం అణా పైసలతో సహా కక్కిన తరువాత మాత్రమే వాలంటీర్ ఉదేగాం వదిలి వెళ్ళాలి.
ఈవిషయంలో నన్ను చాలా మంది వాలంటీర్లు ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు, వారికి హైకోర్టు కి వెళ్ళి, మీ హక్కు ఏమిటి అని అడగండి అని మాత్రమే చెప్పగలిగాము. కారణం వీరు అటువంటి నిభంథనలు ఉన్న ఒప్పందం పైన అమాయకంగా సంతకం చేసారు.
గ్రామ సచివాలయం ఉద్యోగాలు?
ఇకపోతే గ్రామ సచివాలయం (sachivalam)ఉద్యోగాలు రాజ్యాంగ వ్యవస్థలో పంచాయితీ రాజ్(Panchayat Raj) వ్యవస్థకు వ్యతిరేకంగా మారాయి. ఇదోక దోపిడీ. ఉద్యోగం పేరుతో రెండు సంవత్సరాల ప్రోబేషన్ పేరుతో కేవలం నెలకు 15,000 రూపాయలు జీతంతో జీవితం వెళ్ళబుచ్చటం. తరువాత పనితీరు బట్టి కోనసాగింపు. అంటే యుశ్రారైకాపాకి (YSRCP) పూర్తిగా తల ఒగ్గితే ఉద్యోగం కోనసాగింపు, లేకపోతే లేదు. వీరికి కనీస వేతన చట్టం కింద జీతాలు లేకుండా కట్టుబానిసలుగా వాడుతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. పైగా ఈ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకం అంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేయటం జరిగింది. అంటే వీరి భవిష్యత్తు సదరు హైకోర్టు ఉత్తర్వులు పైన అథారపడి ఉంది. ఇది నిరుద్యోగ యువతకు నిజంగా ఘోరమైన వంచన, మోసం అని యువత భావిస్తున్నది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు?
ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగులను (RTC Employees) ప్రభుత్వ ఉద్యోగులు అనే తాయిలాలు చూపి, వారిని అటు, ఇటు కాకుండా చేయటం జరిగింది. వారికి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు మాదిరిగా రిటైరయ్యాక పెన్షన్ పథకాలు లేవు. ఇదంతా ఆర్టీసీ అస్తులు అమ్ముకోవటం కోసం వాటి పైన కన్నేసిన పెద్దలు కుటిల రాజకీయం అని మాలాంటి వారము చెబితే మమ్మల్ని ద్వేషించారు. కానీ ఇప్పుడు వాస్తవాలు తెలిసినా, ఏమీ పీకలేని పరిస్థితి.
నిరుద్యోగ యువత అశలకు దెబ్బ?
ఇప్పుడు లక్షలు, వేల స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత అశలకు చాలా గట్టిగా దెబ్బ తగిలింది. గ్రూపు ఉద్యోగాలు 36, పోలీసు ఉద్యోగాలు 450 అంటూ బిచ్చం వేయటం చూసి నిరుద్యోగ యువత అవ్వాక్కు అయ్యారు. దీనితో నిరుద్యోగ యువత చాలా అవేశంతో రగిలిపోతున్నారు. కరోనా నిభంథనలు థిక్కరించి అన్ని చోట్ల రోడ్డుపైకి ఆవేశంతో వస్తూన్నారు. పైగా రెండు సంవత్సరాల అలస్యంగా జరుపుతున్న ఉద్యోగాలకు వయస్సు మినహాయింపు లేదా లేదు. దీనితో తమ తప్పు లేకపోయినా చాలామంది నిరుద్యోగ యువత అవకాశాలు కోల్పోతున్నారు.
నిరుద్యోగ యువత జీవితాలు బలి?
ఈరకంగా ఒక తరం తరం నిరుద్యోగ యువత ఒక రాజకీయ పార్టీ యువనాయకుడు చేసిన కుటిల రాజకీయాలకు తమ జీవితాలను బలి చేసుకున్నారు. యువభేరీలను నమ్మారు. ప్రత్యేక హోదా అంటే నమ్మారు. నమ్మి ఓటు వేసినందులకు, చివరకు ఏందుకు పనికి రాకుండా పోవటం జరిగింది. పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రైవేటు రంగంలో చేరలేరు. అన్న పెట్టిన 75% నిభంథనలు అడ్డు వస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అవిరైపోయినాయి. పైగా ఉన్న ఉద్యోగులకు సక్రమంగా జీతాలు, డీఏలు చెల్లించే అర్థిక పరిస్థితి కూడా అన్న ప్రభుత్వంలో లేదు. ఇక కోత్త వారికి జీతాలు ఎక్కడ నుంచి వస్తాయి?
దుష్ట రాజకీయాలలో నిరుద్యోగ యువత?
నిజంగా నిరుద్యోగ యువత, ఈ దుష్ట రాజకీయ వలలో అమాయకంగా చిక్కుకుని, తమ జీవితంలో అత్యంత విలువైన ఐదు సంవత్సరాల కాలం కోల్పోవటం జరుగుతున్నది. పైగా పప్పు బెల్లాల కార్యక్రమంతో రాష్ట్రం మరింత అప్పుల అవుతున్నది. దీనితో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా మృగ్యం సత్యం. దీన్ని వారు చేతులారా చేసుకున్న పరిస్థితి.
ఆలోచించాలిసిన సమయం?
ఇప్పటికైనా సదరు నిరుద్యోగ యువత, వారి కుటుంబాలకు చెందిన వారు అలోచన చేయాలి? ఓటుకు రెండు వేల నోటు కావాలా? లేకపోతే 25 సంవత్సరాల మీ పిల్లల భవిష్యత్తు కావాలా అని తమలో తామే తర్కించుకోవాలి? ఏమైనాగాని ఒక మోసగాడు, సుప్రీంకోర్టు ద్వారా ఆర్ధిక నేరారోపణలు ఉన్న వ్యక్తి చేతిలో నిరుద్యోగ యువత మోసపోయిందా? అదీ కూడా అమాయకంగా, నిర్దయగా, నిస్సహాయంగా, నిక్కచ్చిగా మోసపోయారా లేదా అని ఈ ప్రజలు తెలుసుకోగలిగితే మార్పు మొదలు అయ్యినట్టే. నిరుద్యోగ యువతని మేల్కొల్పడంలో నా ఈ ప్రయత్నం ఫలించినట్లే? ఆలోచించండి
–శాంతి ప్రసాద్ శింగలూరి (Shanti Prasad Singaluri), న్యాయవాది, జనసేన లీగల్
వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు విశదీకించారు
ధన్యవాదములు