shakthishakthi

ఆడది అంటే శక్తి స్వరూపిణి. నేటి మహిళ ఎన్నో అణచివేతలు, అవమానాలు ఎదుర్కొంటూ, తలకు మించిన కుటుంబ బరువు బాధ్యతలతో సతమవుతున్నది. కానీ మహిళకి కావాలిసినది చలం కోరిన విశృంఖలత్వమా లేక కందుకూరి వీరేశలింగము, రాజా రామ్ మోహన్ రాయ్ గారులు కోరుకొన్న పురుషులతో సమానమైన హక్కులా? హక్కుల కోసము పోరాడుతున్న మహిళలకు ఉండాలిసిన బాధ్యతల మాటేమిటి?

నేటి మహిళ స్వత్రంత్రంనకు ముందు ఉన్న మహిళ కంటే ఎన్నోరెట్లు మెరుగు. ఆర్ధిక, సామాజిక, వ్యక్తిగత పరిస్థితుల రీత్యా ఆమె నేడు ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నది. అయితే భారత, రామాయణ కాలాలలో భారత నారి ఎన్నో ధైర్య సాహసాలు చూపింది. కుటుంబ బాధ్యతలను భారత మహిళ నెత్తిన పెట్టుకొని మోసిన సందర్భాలు కోకొల్లలు. అనన్య సామాన్యం.

యుద్ధ తంత్రాలలో చూపిన పోరాట పటిమ?

యుద్ధ తంత్రాలలో చూపిన పోరాట పటిమ గురించి, సామాజిక అవగాహన గురించి నేటి మహిళలకు ఎంతమందికి తెలుసు? ఎంతమంది వాటిని పాటిస్తున్నారు. నాటి వీర మహిళలను ఎంతమంది అనుసరిస్తున్నారు. నాటి మహిళ గొప్పతనం గురించి, నేటి మహిళ బలహీనతల ఎంతమంది మహిళలు గురించి తమ తరువాతి తరానికి తెలియచేస్తున్నారు.

రామాయణము కాలము నాటి సీత ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన భర్తకి, తన తండ్రికి, తన అత్త మామలకు, తన బిడ్డలకు చెడ్డ పేరు తెచ్చే పని ఎప్పుడు చేయలేదు. సీత శివ ధనుస్సుని ఒంటి చేతితో ఎత్తగలిగిన శక్తి వంతురాలు. సీతా మహాతల్లి చూపిన మానసిక పరిపక్వత కూడా కొనియాడతగినదే. అరణ్యములో ఒంటరిదైనా కూడా బిడ్డలను పెంచి ప్రయోజకులుగా చేయగలిగింది. ఆ ధైర్యము, మానసిక పరిపక్వత నేడు మహిళల్లో ఎంతవరకు ఉన్నది.

పురాణాల్లో మహిళ

రామాయణములో ఉన్న మరికొన్ని ముఖ్యమైన స్త్రీ పాత్రలు అయిన అహల్య, ఊర్మిళ, కైకేయి, మండోదరి లాంటి వారి నుండి నేటి మహిళ నేర్చుకోవాలిసినది ఎంతైనా ఉన్నది. కైకేయి చూపిన యుద్ధతంత్రాలు, ధైర్య సాహసాలు తెలుసుకోవాలి. మండోదరి, రావణుడికి చేసిన నీతి బోధలు, మండోదరి రావణుడిని కొంతవరకైనా కట్టడి చేసిన విధము స్త్రీ జాతి ఔనత్యాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.

మహాభారములో శక్తివంతమైన స్త్రీలు ఎందరో ఉన్నారు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టగలిగి నడిపిన సత్యవతి, హక్కులు కోల్పోయినప్పుడు, తిరిగి ప్రతీకారము తీర్చుకోగలిగిన అంబ లాంటి మహిళలు ఉన్నారు. అలానే ఉన్నతమైన వ్యక్తిత్వము ఉన్న గాంధారి లాంటివారి నుండి నేటి మహిళలు, నేటి సమాజం తెలిసికోవాలిసినది ఎంతైనా ఉన్నది. ఇష్టము లేని పెళ్లి చేసికొన్న కూడా గాంధారి జీవితాన్ని చీకటి మాయం చేసికోలేదు. చీకటి మయము చేసికొని కూడా, ధైర్యముగా నిలబడి తన బిడ్డల, భర్త పరిపాలనలో ఉన్న తప్పులను ఎత్తిచూపుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే ధీర మహిళ గాంధారి.

కుంతి వయసులో ఉన్నప్పుడు తొందరపాటులో చేసిన తప్పులకు కుంగిపోలేదు. మిగిలిన జీవితాన్ని నిజాయితితో, బాధ్యతలతో, కష్టాల కడలిలో కొనసాగించింది. భర్త లేన్తి లోటుని, రాజ్యము లేని లోటుని బిడ్డలకు రానీయకుండా ధర్మాన్నే భోదించుకొంటూ వచ్చింది. అంతిమ విజయము ధర్మానిదే అని నిరూపించడములో కుంతీ పాత్రకూడా ఉన్నది.

భారతములో ఇంకా ద్రౌపది, మాద్రి!

భారతములో ఇంకా ద్రౌపది, మాద్రి, భాగవతములో ఉన్న సత్యభామ, రుక్మిణి, సావిత్రి లాంటివారు ఎప్పుడు మహిళలకు ఆదర్శముగానే మిగులుతారు. వీరు అంతా పాతివ్రత్యాన్ని కోల్పోని వీర మహిళలే. వీరు అంతా బాథ్యతలతో నడుచుకుంటూ, అవసరమైనప్పుడు తమ తమ హక్కుల కోసము పోరాడినవారే. అవసరమైతే మహిళ పురుషిని కంటే బలమైనది, ఉత్తమైనది అని నిరూపించిన వారే.

అయితే నాటి భారతీయ మహిళ ఔన్నత్యము ఎందమంది మహిళలు తెలిసికొని అనుచరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంగుళము గుడ్డముక్కలు కట్టుకొనే విదేశీ మహళలను, విశృంఖల శృంగారానికి విలువనిచ్చే విదేశీ సంస్కృతిని అనుచరిస్తున్నారు.

వీరత్వాన్ని, మాతృ తత్వాన్ని, ధాత్రుత్వాన్ని, బాధ్యతలను నెత్తిన పెట్టుకొని పోరాడే నాటి స్త్రీ మూర్తుల ఔనత్యాన్ని తెలిసికోవడానికి ఎంత మంది స్త్రీలు నేడు ప్రయత్నం చేస్తున్నారు. నాటి భారతీయ మహిళను అధర్మసంగా తీసికొని తప్పు ఒప్పులని సరిచేసికొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రతీ భారతీయ మహిళ ప్రశ్నించుకోవాలి.

ఇంతముందునే వివరించినట్లు, ప్రతీ మహిళకు హక్కులు ఉండితీరాలి. అవసరమైతే పోరాడి సాధించుకోవాలి.అలాగే హక్కులతో పాటు ప్రతీ మహిళకు బాధ్యతలు కూడా తెలిసికొని మసలుకోవాలి. నాటి మహిళ గొప్ప తనాన్ని భావి తారలకు చాటి చెప్పే గొప్ప శక్తి స్వరూపిణిగా తనను తాని మలచుకోవాలి. అప్పుడే భారతీయ మహిళ గొప్పతనం నలుదిశలా వ్యాపించి సమాజం పురోభివృధి చెందుతుంది.

హక్కుల ఉండాలి దీనికి తోడు బాధ్యతలు కూడా తెలిసి ఉండాలి అనేదే నా ఈ వ్యాఖ్యానాల్లో అంతరార్ధము అని మంచి మనస్సుతోమహిళా మణులు అందరూ  అర్ధం చేసికొంటారని భావిస్తూ….

ఆలోచించండి… ఆడది అంటే అంగట్లో బొమ్మ కాదు.  కుటుంబం కోసం పురోభివృద్ధి కోసం నిత్యం నీ వెన్నటివుండే మాతృ మూర్తి. అలానే మగాడు దారి తప్పితే కట్టడి చేయడంలో శక్తి స్వరూపిణి అని కూడా గ్రహించండి.

by Akshara Satyam 

Spread the love
One thought on “ఆడది అంటే అంగట్లో బొమ్మ కాదు… శక్తి స్వరూపిణి!”
  1. హక్కులు ఆశించే ఎవరైనా . బాధ్యత గా ఉండి తీరాలి,,
    చాలా మంచి విషయాన్ని ,మంచి విధానం లో చెప్పారు
    ???

Comments are closed.