Nadendla-Kothapeta JanasenaNadendla-Kothapeta Janasena

బటన్లు నొక్కుతూ భ్రమలో బ్రతికించే ముఖ్యమంత్రి!
తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
మూడో ప్రత్యామ్నాయం ఉండకూడదనే కుట్రలు
పవన్ కళ్యాణ్’పై రెక్కి నిర్వహించిన వారిపై దర్యాప్తు చేయించాలి
ప్రతి కార్యకర్తకు అండగా పవన్ కళ్యాణ్
కొత్తపేట నియోజకవర్గ సమావేశంలో నాదెండ్ల మనోహర్

బటన్ నొక్కితే ప్రజల బతుకులు బాగు పడిపోతాయని ముఖ్యమంత్రి (AP CM Jagan) అనుకుంటున్నారు. బటన్లు నొక్కడం ఏమైనా రాజ్యాంగంలో రాసిపెట్టి ఉందా..? బటన్లు నొక్కడానికేనా ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చింది? గత మూడున్నర ఏళ్లలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. పరిశ్రమలు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. మీరు ఇలా ఎంతకాలం బటన్ నొక్కి పరిపాలన చేస్తారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం కొత్తపేటలో (Kothapeta  Janasena) ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా (Third alternative) జనసేన (Janasena) ఎదుగుతుంటే దానిని కొన్ని పక్షాలు, వ్యక్తులు భరించలేక పోతున్నారు. ఎలాగైనా ప్రత్యామ్నాయ శక్తినీ తొక్కి వేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద వరుస కుట్రలు జరుగుతున్నాయి. ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని జనసేన పార్టీని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పవన్ కళ్యాణ్ లక్ష్యం తప్పకుండా ముందుకు నడిపిస్తున్నారు.

కోడి కత్తి డ్రామాలు (Kodi Kathi) వాడి ప్రజల నుంచి సానుభూతి సంపాదించి ఓట్లు దండుకున్నారు. అటువంటి ముఖ్యమంత్రికి, విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని జనసేన పార్టీ చెబితే మాత్రం వణుకు పుట్టింది. ఫలితంగానే విశాఖపట్నంలో డ్రామా నడిపారు. వందలాది జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారు. జనసేన పార్టీ మీద పూర్తి అక్కసుతో వైసీపీ చేస్తున్న కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నతంగా ఆలోచించే పవన్ కళ్యాణ్ ఆశయాలు సాధనకు మనమంతా ఒక్కటవుదాం అంటూ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

రహస్యాలు బయటపెడుతున్నందుకే కుట్ర

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రత విషయంలో ఎప్పుడు గట్టిగా పట్టించుకోరు. తన వెన్నంటి ఉండే జనసైనికులు, వీర మహిళలే తన భద్రత చూసుకుంటారని, వారికి మించిన భద్రత వలయం ఏముంటుందని ఆయన
భావిస్తారు. గత రెండు రోజులుగా హైదరాబాదులో జరిగిన కొన్ని ఘటనలు పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై పూర్తి సాక్షాధారాలతో జనసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానిత వ్యక్తుల పేర్లతో సహా బయటపెట్టాం.

అధికారంలో ఉన్న మీరు ఆ పేర్లు మీద, ఆ వ్యక్తుల కదలికల మీద ఎందుకు ఇప్పటివరకు విచారణ చేసేందుకు సిద్ధం కాలేదు. అనుమానిత వ్యక్తులు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే కదా… మరి వారిపై ఎందుకు దర్యాప్తు చేయలేదో ప్రభుత్వం వివరించాలి. కడప జిల్లా సిద్ధవటంలో కౌలు రైతు భరోసా యాత్ర సభ విజయవంతం అయిన దగ్గర నుంచి ఈ ముఖ్యమంత్రిలో అసహనం కనిపిస్తోంది. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో 48 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బయట ప్రపంచానికి జనసేన తెలియజెప్పింది. జనసేన వారికి సహాయం చేసింది.

ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే ప్రజలకు కొండంత భరోసా కలుగుతుంది. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు నోరు విప్పిన ప్రజలు భయంతో వణుకుతారు. ఏం చెబుతారా ఏ పన్నులు వేస్తారా అని ప్రజలు భయపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా పక్కదారి పట్టించారు. అసలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఏమయ్యాయో కూడా అంతు పట్టని పరిస్థితి నెలకొందని నాదెండ్ల మనోహర్ అన్నారు.

అవినీతిలో రైతులను వదలని ప్రభుత్వం

ఆరుగాలం కష్టపడే రైతులు వద్ద కూడా బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వం ఇదే. ఈ క్రాప్ నమోదుకు సైతం డబ్బులు డిమాండ్ చేయడం అత్యంత హేయమైన చర్య. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి అవినీతి రాజ్యమేలుతోంది. మరో పక్క జగనన్న ఇళ్ల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. జగనన్న ఇళ్లు, టిడ్కో గృహాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసింది. ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలు తప్ప, క్షేత్ర స్థాయిలో వారికి జరుగుతున్న అన్యాయం మీద నోరు మెదపడం లేదు. ప్రజలకు సంబంధించిన సమస్య లు నీలదీస్తున్నాం అనే విశాఖపట్నం లో జనంతో కలవకుండా రకరకాల కుట్రలు చేసి అడ్డుకున్నారు. ఎంతోకాలం ఈ కుట్రలో నిలవవు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

కార్యకర్తల క్షేమం కోసం ఆలోచించే నాయకుడు

కార్యకర్తల సంక్షేమం కోసం నిత్యం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ మనకు అండగా ఉన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఈ విధంగా సహాయ పడింది లేదు. పవన్ కళ్యాణ్ ప్రతి ఆలోచన ఉన్నంతంగా ఉంటుంది. అందరి బాగు కోసం ఉంటుంది. కచ్చితంగా భవిష్యత్తులోనూ పార్టీ పరంగా ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్తాం అని మనోహర్ వివరించారు.

వ్యూహం అధినేతకు వదిలేద్దాం

ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారికి వదిలేద్దాం. నిత్యం ప్రజల కోసం తపించే ఆయన, రాష్ట్ర ప్రజల బాగు కోసం మాత్రమే ఆలోచిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ నిర్ణయాలు ఆయనకు వదిలేసి, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు జనసైనికులు, నాయకులు పాటు పడదాం. ఇతర పార్టీల నాయకులు వేసే ఉచ్చులో పడకుండా పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్లాం. జనసేన పార్టీ కోసం… జెండా కోసం నిజాయితీ గా నిలబడదాం” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యకులు కందుల దుర్గేష్, పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, పార్టీ నేతలు బండారు శ్రీనివాసరావు, శెట్టిబత్తుల రాజబాబు, వేగుళ్ళ లీలా కృష్ణ, తుమ్మల బాబు, మరెడ్డి శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, తాడి మోహన్, డి.ఎమ్.ఆర్. శేఖర్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కొత్తపేట జనసైనికులకు ప్రమాద భీమా చెక్కులు పంపిణీ