Janasenani pawan kalyanJanasenani pawan kalyan

జనసేనాని నేటి పర్యటన వివరాలు
గెలిచినవారు పదవులు కోసం పోరాటాలు
ఓడిన వారు రైతుల కోసం ఆరాటాలు
కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం

అనంతపురం జిల్లా (Anantapur District) నుండి జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ Pawan Kalyan) రైతు భరోసా యాత్ర (Rythu Bharosa Yatra) ప్రారంభం కాబోతున్నది. ఒక పక్కన గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మంత్రి పదవులు కోసం వీధి పోరాటాలు చేస్తున్నారు. మరొక పక్కన ఓడిన జనసేన పార్టీ (Janasena Party) నాయకులూ రైతుల కోసం ఆరాటం పడుతున్నారు అని బాధిత రైతు కుటుంబాలు భావిస్తున్నారు. మరణించిన కుటుంబాలకు మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు.

కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం

ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం (Financial assistance) అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను (Kaulu Rythu Bharosa Yatra) అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించ నున్నారు. ఈ కార్యక్రమం కోసం 12వ తేదీ ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు.

కొత్తచెరువు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి పవన్ ఆర్ధికసాయం చేస్తారు. గం 10:30 నిమిషాలకు కొత్త చెరువు నుంచి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందిస్తారు.

గం. 11:20 నిమిషాలకు ధర్మవరం నుంచి బయలుదేరి, ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు. గొట్లూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం చేస్తారు.

అక్కడి నుంచి గం. 12: 10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ పూలకుంట గ్రామంలో సుమారుగా 20 రోజుల క్రిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్ధిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు.

ఆ మన్నీల గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే గ్రామసభ(రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారు. గ్రామసభ అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్’కు (Hyderabad) బయలుదేరి వెళతారు.

జగన్ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం పూర్తి
మంత్రులకు శాఖలు కేటాయింపు