Prathipadu congress meetingPrathipadu congress meeting

ఆంధ్రాకి (Andhra) న్యాయం జరగాలి అంటే ఒక్క జాతీయ పార్టీలనే (National Party) ఆంధ్ర ప్రజలు (AP People) ఎన్నుకోవాలి అని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు (Pallam Raju) అన్నారు. ప్రత్తిపాడులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పల్లంరాజు ప్రసంగిస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రాతీయ పార్టీల వల్ల రాష్ట్రాల సమస్యలు తీరవని అయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాలాంటి (Special Status) అనేక సమస్యలకు పరిస్కారం దొరుకుతుంది అని తద్వారా రాష్ట్రము (State) బాగుపడుతుంది అని అయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా (East Godavari), ప్రత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ ఉమ్మిడి వెంకటరావు స్వగృహం నందు ప్రత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎ.పి.సి.సి. మెంబెర్ శ్రీ ధర్నాలకోట శ్రీను అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి శ్రీ మల్లిపూడి రాంబాబు, రాష్ట్ర బి.సి సెల్ అధ్యక్షులు శ్రీ నూలుకుర్తి వెంకటేశ్వరరావు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు శ్రీ ఇంటి వీరభద్రరావు, ప్రత్తిపాడు మండల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దంతులూరి రమేష్ రాజు… కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు శ్రీ కోప్పన కోటేశ్వరరావు, కాకినాడ పార్లమెంట్ ఎస్.సి సెల్ అధ్యక్షులు శ్రీ మొయ్యేటి సూర్యప్రకాశరావు, ప్రత్తిపాడు నియోజకవర్గం బి. సి సెల్ అధ్యక్షులు శ్రీ కొల్లు వీరగణేష్ … రంపచోడవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గొంపా కొండబాబు,ప్రత్తిపాడు నియోజకవర్గం శక్తీ కో-ఆర్డినేటర్ శ్రీ ఉమ్మిడి సురేష్ … ఏలేశ్వరం టౌన్ ప్రెసిడెంట్ శ్రీ సిరిపురపు బాబీ, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం జగన్’తో ఉద్యోగ సంఘాలు భేటీ
ఇక సమస్య కొలిక్కీ?