Pawan Kalyan quotePawan Kalyan quote

తెలంగాణా ఎన్నికల్లో (Telangana Elections) భయపడకుండా పోటీకి నిలబడ్డ జనసేన పార్టీ (Janasena Party) ధైర్యానికి జయహో. గెలుపు ఓటములు దైవాప నిర్ణయాలు అంటారు. తెలంగాణాలో స్థానిక పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాగాని ధైర్యంగా పోటీ చేసిన యోధుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలానే జనసేన పార్టీ నిలుస్తాయి. సేనానికి అండగా ఉన్న జనసేన నాయకులు, జనసైనికులు కూడా అభినందనీయులే.

అయితే తెలంగాణ ఎన్నికలు ముగిసారు. ఆంధ్ర ఎన్నికలు (Andhra Elections) సమీపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆలోచనా సరళి ఏమిటీ? జనసేనాని తీసికోవాలిసిన కఠిన నిర్ణయాలు ఏమిటీ అనే దానిపై అక్షర సందేశం (Akshara Sandesam) (సూటిగా సుత్తి లేకుండా)

జయహో జనసేనాని

సేనానికి గోదావరి జిల్లాల్లోనే ఆదరణ ఉంటుంది అన్నారు

అందుకే సేనాని గోదారి జిల్లాల్లో చేసిన పర్యటనల్లో ఇసుక వేస్తే రాలనంత జనాలు

కానీ కానీ

సేనాని ఉత్తరాంధ్ర వెళ్లినా అదే ఆదరణ
మధ్య కోస్తా జిల్లాలు వెళ్లినా అదే జన నీరాజనాలు
సేనాని రాయలసీమ వెళ్లినా ఇసుక వేస్తే రాలనంత జనాలు

అలానే అలానే…

జనసేనాని చివరకు తెలంగాణాలో ఏ ప్రాంతం వెళ్లినా
అదే ఆదరణ. అదే జన నీరాజనాలు
కేరింతలు. పులకరింతలు. మార్పు కోసం జనాలు ఎదురు చూపులు.

అయితే…

కులం చూడకుండా,
మతం చూడకుండా,
ప్రాంతం చూడకుండా,
పార్టీలు పంచె నోట్ల కట్టలు చూడకుండా
ఓటరులు ఓట్లు వేయడం మొదలు పెడితే
యావత్తు దక్షిణ ఆంధ్రాలో
జనసేన లాంటి పార్టీలు మాత్రమే విజయ దుందుభి మోగిస్థాయి.
మిగిలిన పార్టీలు నామ రూపాలు లేకుండా పోవచ్చు.

అయితే అయితే…

సేనాని వద్ద నీతి, నిజాయితీ, అంకిత భావం, మార్పు కోసం అకుంఠిత దీక్ష తప్ప
ఓటరులకు పంచడానికి (అవసరమైతే) నోట్ల కట్టలు పవన్ కళ్యాణ్ వద్ద లేక పోయి ఉండవచ్చు అని అంటుంటారు.
ఎలెక్షనీరింగ్ చేయడానికి సేనాని చుట్టూ వ్యూహకర్తలు లేరు. గ్రౌండ్ లెవెల్ లో పోల్ మానేజ్మెంట్ చేసే పార్టీ యంత్రాంగం లేదు. పోలింగ్ బూత్ స్థాయిలో కష్ట పడేవారిని మనోహరమైన మాయ అడ్డు తగులు తుంది అనే ఆరోపణలకు పరిస్కారం కనపడడం లేదు. అని ప్రజలు నమ్ముతున్నారు. ఉన్నవారు అంతా “మనోహరమైన మాయ”కు గులాం గిరి చేస్తున్న వారే అనే ఆరోపణలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి..

మనోహరమైన మాయలో మనం మసగబారి పోతున్నాం అని
సేనానికి చెప్పేది ఎవ్వరు అని మార్పు కోసం ఎదురు చూస్తున్న సమస్త బాధిత వర్గాలు మదన పడుతున్నాయి?

అలానే

సేనాని నిజాయితీ, అంకిత భావం చూసి
ఓట్లు వేసే రోజు వచ్చే దెప్పుడు?
నోట్ల కట్టలు పంచి వంచన చేసే పార్టీలకు బొంద పెట్టేది ఎప్పుడూ

ఆలోచించండి…మనం నోట్ల మాయలో పడి అమ్ముడుపోతున్నామా అని ఓటరులు తెలిసికోనంత వరకు “మార్పు” మూలుగుతూనే ఉంటుంది. అలానే “మార్పు” మనోహరమైన మాయ చుట్టూ “మార్పు” బిత్తర చూపులు చూస్తూనే ఉంటుంది (It’s from Akshara Satyam)

(ఇది వాస్తవ ఫీడ్ బ్యాక్ నే గాని అక్షర సత్యం వ్యక్తిగత అభిప్రాయం కాదు అని గమనించగలరు)

ఓరి నాన్నోయి! జరా నా గోడు విను: అక్షర సందేశం

Spread the love