జంగారెడ్డిగూడెం (Jangareddygudem) ప్రభుత్వాసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి (Health Minister) ఆళ్ల నాని (All Nani) చేరుకొని ప్రమాద బాధితులను పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District), జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం జల్లేరు వాగు (Jillruvagu) లో బోల్తా పడి ప్రమాదం జరిగిన సంఘటనపై మంత్రి ఆళ్ల నాని గూడెం ఏరియా ఆసుపత్రికి వచ్చి మీడియాతో (Media) మాట్లాడారు. ఆళ్ల నాని మాట్లాడుతూ దురదృష్ట వశాత్తు ఈ ప్రమాదం జరిగిందని ప్రమాదం జరిగిన వాళ్ళలో ఆరుగురు మహిళలు, ముగ్గురు మగవాళ్ళు ఉన్నారని తెలిపారు. అయితే వీరికి జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో (Government Hospital) పంచనామ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
మిగిలిన 26 మంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించే ఏర్పాట్లు చేసినట్లు అయితే వీరిలో ఒక మహిళ, అలాగే ఒక పురుషుడును మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు నాని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.5 లక్షలు జిల్లా కలెక్టర్ ద్వారా వారికి అందేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు ఆళ్ల నాని తెలిపారు.