అయ్యప్ప స్వామికి (Ayyappa Swamy) రూ 12వేల విలువైన డమరకాన్ని (Damarukam) దాతలు అందజేశారు. జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం గురవాయిగూడెంకి చెందిన కొనకళ్ల రామకృష్ణ, శివకుమారి దంపతులు డమరకాన్ని ఆలయానికి అందజేశారు. ఈ సందర్బంగా దాతలు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు సాయి బాలాజీ శర్మ వేద ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు కీసరి రామిరెడ్డి, డవలప్‌మెంట్ చైర్మన్ శ్రీరాములు, ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ మాల్యాద్రిరెడ్డి, శ్రీనివాసరావు, సూర్యచంద్రం, జగన్‌మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు.