జనసేన (Janasena) బాబుతో పొత్తు (Alliance) పెట్టుకోవడంపై అక్షర సత్యం (Akshara Satyam) వ్యతిరేకం కాదు. కానీ బాబుతో పొత్తు పెట్టుకొనేటప్పుడు బాబు నైజం ఏమిటి అనేది జనసేనాని (Janasenani) పూర్తిగా తేలికోవాలి అని ప్రజలు భావిస్తున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ నిజాయితీపై, నాయకత్వ లక్షణాలపై సంపూర్ణ నమ్మకం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఒక్క పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కోటికొక్కరు కూడా ఉండరు. అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడే సీఎం కావాలని ప్రజలు ఆశిస్తున్నారు.
అయితే పొత్తులపై కొనసాగుతున్న సందిగ్ధత, పర్యవసానాలపై అణగారిన వర్గాల మనోవేదనను సేనానినికి తెలియజేయడం కోసమే ఈ మా చిరు సందేశం.
నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర మొదలుకొని,
దగ్గుపాటి వెంకటేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్ & అతని కుటుంబం వరకు
అందరూ చంద్రబాబు కుళ్ళు రాజకీయాలకు బలి అయినవారే.
ఇప్పటివరకు బాబుతో పొత్తు పెట్టుకొన్న పార్టీలు, మద్దతునిచ్చిన నాయకులూ
సర్వ నాశనం అయ్యారు తప్ప బాగుపడ్డవారే లేరు ప్రజలు భావిస్తున్నారు.
అటువంటి బాబు జనసేనను ఎదగనిస్తాడా అని అణగారిన వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి?
పచ్చి ఆకాశవాది అనే పదం బాబుకి సరిపోదు. మరే పదమైన కనిపెట్టాలి అని రాజకీయ పండితులు చెబుతుంటారు. ఇదీ బాబు నైజం!
మోదీనే బాబు దెబ్బకి భయపడతారు. మొసలి నోటిలో తల పెట్టడం కంటే బాబుతో పొత్తు పెట్టుకోవడం చాల ప్రమాదం బాధిత వర్గాల యువత ఆందోళన చెందుతున్నది?
జనసేనానిని సీఎంగా బాబు ముందుగా మద్దతు ప్రకటిస్తే
అప్పుడు కొంతవరకు పొత్తులు గురించి ఆలోచించండం తప్పులేదు. ముందుకు వెళ్ళవచ్చు.
అప్పుడ కూడా సేనాని సవాలక్ష జాగ్రత్తలు తీసికోవాలి. లేకపోతే బాబుతో పొత్తు చాలా ప్రమాదకరం అని గమనించాలి.
అలా కానీ పక్షంలో పచ్చ విష సర్పాల కాటుకి మరొక్కసారి బలికావాల్సిందేమో. ఇదే అక్షర సత్యం.
ఆలోచించండి… జనసేన మద్దతు లేకపోతే 2014 లోనే టీడీపీ అంతం అయి ఉండేది. పొత్తులు ప్రసక్తి తెచ్చి తెలుగుదేశాన్ని సేనాని మరొక్కసారి బతికించారు. పాముకి పాలు పోసి పెంచడం అంటే ఇదేనేమో? (It’s from Akshara Satyam)