Congress for Kapu ReservationsCongress for Kapu Reservations

ప్రత్యేక హోదా ఫైలు పైనే తొలి సంతకం
2024 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తాం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెబిఆర్ నాయుడు

కాంగ్రెస్ పార్టీ (Congress Party) కాపు రిజర్వేషన్లకు (Kapu Reservations) కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి సమన్వయ కమిటీ సభ్యులు కెబిఆర్ నాయుడు (KBR Naidu) పేర్కొన్నారు. 2024 లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్’కు ప్రత్యేక హోదా (Special Status) ఫైల్ పైనే కాంగ్రెస్ ప్రభుత్వ్వ మొదటి సంతకం చేస్తుంది. ఎనిమిదేళ్లుగా పెండింగ్ లోనే ఉన్న ఇతర విభజన హామీలైన పోలవరం ప్రాజెక్ట్’కు (Polavaram Project) పూర్తి స్థాయి నిధులను రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. విశాఖపట్నం రైల్వే జోన్ (Visakha Railway Zone) మరియు ఇతర విభజన హామీలు పూర్తి చేస్తుంది. అదేవిధంగా ఆంధ్రులు హక్కుగా భావించే విశాఖ ఉక్కును (Vizag steel plant) కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచుతుందని కూడా కె.బి.ఆర్ నాయుడు ప్రకటించారు.

కార్తీక మాస వన సమారాధన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షులు జి.రఘ నరేష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో జరిగిన వన సమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఫైలు పైనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం చేస్తుందని కె.బి.ఆర్ నాయుడు వివరించారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాపులు

1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల జాబితానే స్వల్ప మార్పులతో ఆమోదించారు. అప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని కెబిఆర్ నాయుడు వివరించారు.

1956 నవంబర్ 1వ తేదీన.. తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు.. ఆంధ్ర రాష్ట్ర వెనుకబడిన కులాల జాబితాతో పాటు, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాల జాబితా కూడా కొనసాగింది. దానివల్ల వెనుకబడిన తరగతులకు సంబంధించి రెండు జాబితాలు ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే.. 1956లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితా నుంచి కాపులను తొలగించిందని కె.బి.ఆర్ నాయుడు తెలిపారు.

ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 1961లో స్వర్గీయ దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఒక ఉత్తర్వు ద్వారా కాపులను మళ్లీ వెనుకబడిన తరగతి కింద గుర్తించేందుకు ప్రయత్నించగా ఆ జీఓను సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు కొట్టివేసిందని కె.బి.ఆర్ నాయుడు వివరించారు.

అప్పటి నుంచీ కాపులకు రిజర్వేషన్ల కోసం డిమాండ్లు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 27 శాతంగా ఉన్న కాపు ఉపకులాలు ఎన్నికల రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉంటున్నారు. కాపు ఉద్యమం కూడా రాజకీయంగా కూడా కీలకంగా మారిపోయిందని కె.బి.ఆర్ నాయుడు వివరించారు.

కాపు కార్పోరేషన్ ద్వారా నిరు పేద కాపులకు రుణాలు అందడం లేదని కె.బి.ఆర్ నాయుడు అన్నారు. కాపుల సంక్షేమం కింద ఈ ఏడాది బడ్జెట్లో రూ. 3,531 కోట్లు కేటాయిస్తూ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన ప్రకటించారని అయితే పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదన్నారు.ఈ సమావేశంలో గనిశెట్టి శ్రీరామచంద్రమూర్తి, న్యాయవాది టివి గోవింద రావు, కాపునాడు నాయకులు రామినీడు మురళి తదితరులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పలువురు హాజరయ్యారు.

ఘనంగా జరిగిన కాపునాడు కార్తీక వన సమారాధన:-

రాజమండ్రి కాపునాడు ఆధ్వర్యంలో దివాన్ చెరువు తోటలో కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. పలువురు నాయకులు,పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు వన భోజనాలకు హాజరై సంతోషంగా గడిపారు. కాపునాడు కార్యవర్గం గుదే రఘు నరేష్, ముమ్మిడి వీరబాబు, వుర్రింకల సతీష్ కుమార్, మేడిబోయిన సునీల్ కుమార్,అక్కిరెడ్డి ప్రసాద్, చోడిశెట్టి పళ్లంరాజు, ఇంటి దొరబాబు, దేవకివాడ చక్రపాణి, కోరుమిల్లి నాయుడు, రాపాక రాజేష్, రుద్ర ప్రసాద్, నలంశెట్టి వీరబాబు,పాలూరి శ్రీను, కోలా భాస్కర్, మీసాల రాజు, రంకిరెడ్డి రమేష్ వన భోజన సమారాధన కార్యక్రమాలను పర్యవేక్షించారు.

నాయకులు కందుల దుర్గేష్, యర్రా వేణు, జక్కంపూడి విజయలక్ష్మి, నందెపు శ్రీనివాస్, రామీనీడి మురళి, అడబాల రామకృష్ణ, యెనుమల రంగబాబు, ఎన్.ఎస్. చంద్రశేఖర్, కే. బీ.ఆర్. నాయుడు, అల్లూరి శేషు నారాయణ రావు, టీ వీ గోవింద రావు, అర్లపల్లి పురుషోత్తం, ఆళ్ల ఆనందరావు, జక్కంపూడి ప్రకాశరావు, ఆకుల వేంకటేశ్వరరావు, వేంట్రపాటి ఉమా మహేశ్వరి, చింతం వీరబాబు, మాజీ కార్పొరేటర్లు.. బూరాడ భవానీ శంకర్, మానే దొరబాబు, బొంతా శ్రీహరి. ఇసుకపల్లి శ్రీనివాస్. కొళ్లిమళ్ల రఘు, నామన వాసు, అడపా అనిల్, కంచుమర్తి చంటి, వై శ్రీనివాస్, ఆకుల భారతి, నాగులాపల్లి లక్ష్మణరావు, లాయర్లు,డాక్టర్లు ఉద్యోగులు పాల్గొన్నారు.

— Dr గనిశెట్టి శ్రీరామచంద్రమూర్తి

మెగాస్టార్ చిరుకి అత్యున్నత పురస్కారం

Spread the love