రాయలసీమలో (Rayalaseema) అప్పుల భాధ తాళలేక మరో అన్నదాత (Farmer) ఆత్మహత్య (Suicide) చేసికొన్నట్లు తెలుస్తున్నది. కడప జిల్లా (Kadapa District) రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుళవారిపల్లె మండలం యర్రగుంటకోట పంచాయితీ యాద్దాలవారిపల్లెలో ఆలం విజయ్ కుమార్ అనే రైతు నిన్నశుక్రవారం రాత్రి (30 జూన్ 2022 ) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసికొన్నట్లు తెలుస్తున్నది.
పంట పండించడం కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం తనకు ఉన్న 3 ఎకరాల పొలాన్ని విజయ్ కుమార్ అమ్మేసి కొన్నాడు. అప్పులు తీర్చేసి ఈ సంవత్సరం కౌలుకి పొలాన్ని తీసికొని కొత్త పంటకు పెట్టుబడి పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఉన్న పొలం పోయింది. కౌలుకి తీసికొని పండించ పంట కూడా నష్టపోవడంతో, అప్పులు తీర్చే దారిలేక పొలం కోసం తెచ్చిన పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసికొన్నట్లు విజయ్ కుమార్ కుటుంబ సైభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసిన విజయ్ కుమార్ వయస్సు 41 సంవత్సరాలు. అతనికి భార్య లత మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తండ్రి ఆత్మహత్య చేసికోవడంతో భార్యా ముగ్గురు పిల్లలు అనాధలు అయ్యారు.
అయితే విజయ్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తు (Police enquiry) ద్వారా తెలియాల్సి ఉంది.
— రైల్వే కోడూరు నుండి అనంత రాయలు