AP High CourtAP High Court

అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చారంటూ పిటిషన్
హైకోర్టును ఆశ్రయించిన రైతులు
బెదిరించి ఎన్ఓసీ ఇచ్చారని ఆరోపణ
విచారణ చేపట్టిన న్యాయస్థానం

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి (AP Health Minister) విడదల రజీనీకి (Vidudala Rajani) హైకోర్టు (AP Court) నోటీసులు జారీ చేసింది. చిలకలూరిపేట మండలం మురికిపూడిలో అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇవ్వడంపై హైకోర్టులో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలైంది. తవ్వకాలకు రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వడంపై రైతులు అభ్యంతరం తెలిపారు. తమను బెదిరింపులకు గురిచేసి చట్టవిరుద్ధంగా ఎన్ఓసీ ఇచ్చారని ఆరోపించారు.

రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మంత్రి విడదల రజనీతో పాటు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాపరెడ్డి, తహసీల్దార్, సీఐ, ఎస్ఐలకు నోటీసులు జారీ చేసింది.

పిటిషన్ల నేపథ్యంలో, కోర్టు తుది నిర్ణయానికి గ్రానైట్ తవ్వకాల లీజు ఖరారు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

టివి గోవింద రావు -ఫాస్ట్ న్యూస్

 

ఇంతకీ ఏపీ టైగర్ రంగాని చంపించింది ఎవరు?

Spread the love