NarappaNarappa

నారప్ప (Narappa) సినిమా (Cinema) సెన్సార్ పూర్తి పూర్తి చేసికొంది. శ్రీకాంత్‌ అడ్డాల (Shrikanth addala) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ (Victory Venkatesh) హీరోగా నటించిన ‘నారప్ప’ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసికొంది. దీనికి యు/ఎ సర్టిఫికెట్‌ లభించింది. సురేష్‌ బాబు (Suresh Babu), కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ పూర్తి కావడంతో త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

జాతీయ పురస్కార గ్రహీత ప్రియమణి (Priyamani) ఇందులో సుందరమ్మ అనే గుర్తుండిపోయే పాత్రను పోషించారు. ఫస్ట్‌ గ్లింప్స్‌, పోస్టర్స్‌, టీజర్‌ ఇప్పటికే విడుదల అయ్యాయి. వీటికి మంచి స్పందన వచ్చింది. ఇందులో వెంకటేశ్‌ పాత్రను దర్శకుడు సరికొత్తగా తీర్చిదిద్దారని తెలుస్తున్నది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.

Spread the love