Cheekati VeluguluCheekati Velugulu

ఇది కథకాదు. జనసైనికుల అంధర్మధనం

జాతీయ/రాష్ట్ర రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో జనసేనాని (Janasenani) పోషిస్తున్న ముఖ్య భూమిక గురించి ప్రతీ జనసైనికుడి కీర్తిస్తున్నాడు. రోజుకి 18 గంటలకి పైగా తన శాఖల కోసం పనిచేస్తున్న ఏకైన నాయకుడు మా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని పది మందికీ చెప్పుకొంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ద్వారా జనసేన సాధించిన ఇంతటి గొప్ప విజయాన్ని ప్రతీ జనసైనికుడు కూడా ఒక పక్కన ఒప్పుకొంటున్నారు. నిజానికి “తృతీయ ప్రత్యామ్న్యా విజయభేరి” అనే విజయోత్సవాన్ని ప్రతీ జనసైనికుడు జరుపుకోవాల్సిన శుభ తరుణం ఇది.

అయినప్పటికీ మెజారిటీ జనసైనికులు నేడు నిరాశ నిస్పృహతో ఉన్నారు. మునుపటి ఉత్సాహంతో జనసైనికులు నేడు ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ఎందుకు వీరు నిరాశ చెందుతున్నారు. అనవసరపు అనుమానాల సుడిగుండాల్లో జనసేన పార్టీ శ్రేణులు ఎందుకు చిక్కుకొంటున్నాయి? అసలు జనసైనికుల్లో ఆవేదన ఉందా? ఉంటే దానికి కారణం ఏమిటి? ఇదే నేటి అక్షర సత్యం (Akshara Satyam) చేయబోయే విశ్లేషణ యొక్క ముఖ్య ఉదేశ్యం.

పొత్తుల వల్ల పవన్ కళ్యాణ్ ఏమి సాధించారు?

జనసేన పార్టీ (Janasena Party) పెట్టుకొన్న వ్యూహాత్మక పొత్తుల వల్లనే మా వైసీపీ పార్టీకి ఘోర పరాజయం సంభవించిందని వైసీపీ పార్టీ శ్రేణులు జనసేనపై పడి రోదిస్తున్నారు. సేనాని వల్లనే అధికారం కోల్పాయాము అనే వైసీపీ నాయకుల లేదా వైసీపీ శ్రేణుల ఆక్రందనలకు అర్ధం ఉంది.

మాతెలుగుదేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మాకు అండగా ఉన్నాడు. పొత్తుల ఎత్తుతో కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ ముఖ్య కారకుడు అయ్యాడు. జనసేనాని, జనసేన న్యాయకుల త్యాగాల వల్లనే మా తెలుగుదేశం నేడు అధికారాన్ని అనుభవిస్తున్నది అని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే చెబుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూటమికి దక్కిన అధికారంతో ఉబ్బితబ్బవుతున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆనందం కూడా అర్ధం చేసికోవాల్సిందే.

దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన కారకుడు అయ్యాడు. పవన్ కళ్యాణ్ పొత్తుల చొరవ తీసికొని ఉండకపోతే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది కాదేమో అనేది కూడా వాస్తవం. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర అనే వాస్తవాన్ని బీజేపీ శ్రేణులు బహిరంగంగా అంగీకరించడం లేదు. అంగీకరించక పోయినప్పటికీ, జాతీయ మీడియా మాత్రం బహిరంగానే సేనాని గొప్పతనంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నది. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహ చతురతని జాతీయ మీడియా ఆకాశాన్ని ఎత్తు చూపుతున్నది. జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం చూసి యావత్తు బీజేపీ శ్రేణులతో పాటు, జనసైనికులు కూడా ఆహ్వానిస్తున్నారు. హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వల్లనే మాకు అధికారం దక్కింది అనే బీజేపీ శ్రేణుల ఆనందంలో అర్ధం ఉంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి నేటి విభజిత ఆంధ్ర ప్రదేశ్ వరకు కూడా కేవలం కమ్మ, రెడ్డి కులాలు మాత్రమే పాలిస్తున్నాయి. మెజారిటీ కులాలు అయిన కాపులు, దళితులు, బీసీలు అణచివేతలకు గురిఅవుతూనే ఉన్నారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ లో తృతీయ ప్రత్యామ్న్యాయం అధికారంలోకి రావాలి అనేది అణగారిన వర్గాల డబ్భై సంవత్సరాల కల. ఆ కల సాకారం కోసమే కాపులు, బీసీలు కలిసి కమ్మలతో కలిసి నిన్నటి ఎన్నికల్లో పనిచేసారు. కూటమి విజయానికి స్పర్ధలు మాని అందరూ కలిసికట్టుగా విజయానికి పనిచేశారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాలతో పాటు, తాడిత, పీడిత, బాధిత వర్గాల సమిష్టి కృషితో, జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించింది. తృతీయ ప్రత్యామ్న్యా జండా చట్ట సభల్లో రెపరెప లాడుతోంది. నేడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం అనేది సామాన్య విషయం కాదు. రెండు బలమైన పాలక వర్గాల మధ్య జనసేన పార్టీ దశాబ్దం పైగా నిలబడి గెలవడం అనేది అసామాన్యం. దీని వెనుక పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహ చతురత ఉంది. అణగారిన వర్గాల సమిష్టి కృషి ఉంది అనేది అక్షర సత్యం. అయినను జనసేన పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో ఉండాల్సిన ఉత్సాహం లేదు.

జనసేనాని పవన్ కళ్యాణ్ ద్వారా జనసేన సాధించిన ఇంతటి గొప్ప విజయాన్ని ప్రతీ జనసైనికుడు ఒకపక్కన ఒప్పుకొంటున్నారు. జాతీయ/రాష్ట్ర రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో జనసేనాని పోషిస్తున్న ముఖ్య భూమిక గురించి ప్రతీ జనసైనికుడికి కూడా తెలుసు. నిజానికి “తృతీయ ప్రత్యామ్న్యా విజయభేరి” అనే విజయోత్సవాన్ని ప్రతీ జనసైనికుడు జరుపుకోవాల్సిన శుభ తరుణం ఇది. అయినప్పటికీ జనసైనికులు నేడు ఎందుకు నిరాశ చెందుతున్నారు. అనుమానాల సుడిగుండాల్లో ఎందుకు చిక్కుకొంటున్నారు? అసలు జనసైనికుల్లో ఆవేదన ఉందా? ఉంటే కారణం ఏమిటి? ఇదే నేటి అక్షర సత్యం చేయబోయే విశ్లేషణ యొక్క ముఖ్య ఉదేశ్యం.

ఎన్నికల అనంతరం జనసేనాని సాధించిన విజయాలు ఏమిటి?

1. 100 శాతం స్ట్రైక్ రేటుతో తృతీయ ప్రత్యామ్న్యాయ జండాని రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) లోను, శాసన పరిషత్ లోను ఎగురవేశారు. డబ్భై సంవత్సరాల అనంతరం తృతీయ ప్రత్యామ్న్యాయ జండాని లోక్ సభలో కూడా జనసేన పార్టీ ఎగురవేసింది.

2. జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత పార్టీ జండాపై గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడమే కాకుండా, ఐదు మంత్రిత్వ శాఖలను తీసికొని గరళకంఠుని చేతిలో గ్రామీణం, పర్యావరణం అని అందరూ ప్రశంసించే స్థాయికి సేనాని ఎదిగారు. అప్రాధాన్య శాఖలకు కూడా సేనాని ప్రాధాన్యతను తీసికొచ్చారు.

3. జనసేన పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అల్లకల్లోలమే అవుతుంది. కాపుల గుంపు తెలిస్తే భూమి మీద నిలబడరు అనే చెడ్డ పేరు నిన్నటి వరకు జనాల్లో ప్రచారంలో ఉండేది. కాదు కాదు అలా పాలక మీడియా ప్రచారం చేసింది. కానీ నిన్నటివరకు వైసీపీ దాడులు చేసింది. నేడు టీడీపీ దాడులు చేస్తున్నది. కానీ అణగారిన వర్గాల పార్టీ అయిన జనసేన మాత్రం దాడులు చేయకుండా తమ పని తానూ చేసుకుపోతున్నది. శాంతి భద్రలు అదుపులో ఉండాలి అంటే జనసేన లాంటి పార్టీ మాత్రమే ఇక ముందు అధికారంలో ఉండాలి అని నేడు జనాలు చర్చించుకొంటున్నారు. ఈ క్రెడిట్ అంతా జనసేన పార్టీకి మాత్రమే దక్కుతుంది.

4. గత పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తీసికొచ్చిన కేంద్ర బడ్జెట్ లలో ఆంధ్రాకి వచ్చిన కేటాయింపులు అంతంత మాత్రమే. కానీ నిన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకి కేటాయింపులు భారీగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ యొక్క పొత్తుల ఎత్తులు, పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహ చతురత మాత్రమే అని చెప్పక తప్పదు.

5. అసెంబ్లీలో తిట్టుకోవడం, బురద చల్లుకోవడం మాత్రమే నిన్నటివరకు చూసాం. కానీ నేడు ఒక చక్కటి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ ఉంటే కమ్మ పాలన, వైసీపీ ఉంటే రెడ్డి పాలన అనే రోజుల నుండి కూటమి పాలన అంటే అందరి పాలన, పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ పాలన అనే రోజులు నేడు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే అనడం అతిశయోక్తి కాదు.

6. ఆంధ్ర రాష్ట్ర పాలనలో జనసేన పవన్ కళ్యాణ్ ముద్ర మరింత ప్రస్ఫుటంగా ఉండాలి అంటే జనసేన యొక్క సీట్ల సంఖ్య మరింత పెరగాలి. పొత్తుల్లో ఉన్నప్పటికీ సమ సీట్లలో జనసేనకు గెలుపు వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ ద్వారా సంపూర్ణ మార్పుని ఆశించగలం. కేవలం 21 సీట్లతో రాష్ట్ర పాలనలో ఈ మాత్రం మార్పు వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధత ప్రభావమే అని గమనించగలరు.

7 జనసేన ఇన్ని విజయాలు సాధించినప్పటికీ జనసైనికుల్లో నేటి అసంతృప్తికి కారణాలు ఏమిటి? దీనికి జనసేనానిది తప్పా? లేక సేనాని చుట్టూ ఉన్న పూజారులది తప్పా లేక జనసైనికుల ఆలోచనా విధానంలో తప్పా అనేది నిశితంగా విశ్లేషించాలి.

అసలు జనసైనికుల మనోభావాలు ఏమిటి?

మా భోళాశంకరుని త్యాగాలతో వైసీపీ శ్రేణులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నవి. టీడీపీ శ్రేణులు తమకి అధికారం దక్కడంతో ఉబ్బితబ్బైవుతున్నవి. రాక్షస పాలన పోవడంతో రాష్ట్రము ఊపిరి పీల్చుకొంటున్నది. మార్పు రాబోతున్నదని వ్యవస్థలు ఉరకలు వేస్తున్నవి.

కానీ గెలిచిన 23 చోట్ల తప్పించి మిగిలిన చోట్ల మా జనసేన పార్టీ బిత్తర చూపులు చూస్తున్నది. గెలిచిన వాళ్లకు పార్టీ క్యాడర్ అంటే పట్టదు. పోటీ చేయలేని వాళ్లకు పార్టీ బాధలు పట్టవు. ఇన్చార్గులు లేనిచోట్ల పార్టీ క్యాడర్ అనాధ చూపులు చూస్తున్నది. పార్టీ నిర్మాణానికి పవనేశ్వరుని చొరవ కోసం జనసేన పార్టీ ఆత్రంగా ఎదురు చూస్తున్నది. ఈ మా బాధలు మా పార్టీ అధినేతకు చెప్పుకొందాం అంటే వీలు కావడం లేదు. మా దేవుడు పవన్ కళ్యాణ్ ని కలవకుండా సేనాని చుట్టూ ఉన్న పూజారులు అడ్డుకొంటున్నారు అని మెజారిటీ జనసేన నాయకులు, క్రియాశీల జనసైనికులు మదన పడుతున్నారు.

మా పక్కింటోడి పెరట్లో మొక్కలు నాశనం అయిపోయాయిలే. మా ఎదిరింటోడి పెరట్లో మొక్కలు ఏకుగా పెరుగుతున్నాయిలే అని సంతోషపడడమేనా లేక జనసేన అనే నా పెరట్లోని మొక్కలు ఎదగలేక పోతున్నది అని మదన పడాలా అనేదే మెజారిటీ జనసైనికుల మదిని వేధిస్తున్న ప్రధాన సమస్య.

తృతీయ ప్రత్యామ్నాయ విజయాన్ని ఆనందించాల్సిన సమయంలో జనసైనికులలో ఈ అనవసరపు అనుమానాలు రావడం తప్పే కావచ్చు. కానీ వారి ఆవేదనలో కొంత వరకు వాస్తవాలు లేకపోలేదు. అసలు జనసైనికులు లేదా జనసేన పార్టీ శ్రేయోభిలాషులు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ నుండి ఏమి కోరుకొంటున్నారు?

జనసేన పార్టీని ఆవరించిన మేఘాల చీకటి – దానికి పరిస్కారాలు?

1. వివిధ స్థాయి నాయకులుగా జనసేన పార్టీకోసం పది సంవత్సరాలుగా పని చేసాం. జనసేన పార్టీ సాధించిన నేటి విజయాన్ని నలుగురితో పంచుకొందాం అని పార్టీ ఆఫీస్ కి వెళుతుంటే పార్టీ ఆఫీస్ లోనికి కూడా మమ్ములను వెళ్లనివ్వడం లేదు అనేది నాయకుల, కార్యకర్తను ప్రధాన ఆరోపణ. (పార్టీ ఆఫీస్ ప్రధాన ద్వారం దాటి లోనికి వెళ్ళడానికి అనుమతి నివ్వవలసిన అవసరం ఉంది. ప్రతీ క్రియాశీల కార్యకర్త కూడా పార్టీ ఆఫీస్ లోనికి వెళ్లే విధంగా అనుమతులు ఉఁడాలి. పార్టీ ఆఫీస్ లోనికి వెళ్ళడానికి అవసరమైన అనుమతులపై చర్చించి చర్యలు తీసికోవడం మంచిదేమో అని ఆలోచించాలి).

2. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అని శుభాకాంక్షలు చెబుదాం అని పార్టీ ఆఫీస్ కి వెళుతుంటే జనసేనాని చుట్టూ ఉన్న వారు అనుమానితులు ఇవ్వడం లేదు. మా దేవుడు పవన్ కళ్యాణ్ ని కలవనివ్వడం లేదు అనేది మరొక ముఖ్యమైన ఆరోపణ. (జనసేనాని ఇటువంటి వారికి ప్రతీ రోజు ఒక గంట పాటు సమయం కేటాయించి, వచ్చిన పార్టీ నాయకులను కలుస్తూ ఉండడం చేయాలి. చంద్రబాబు చేస్తున్నది ఇదే. మనం కూడా ఇలా చేయడం వలన పార్టీలో ఉన్న అసంతృప్తిని చాలా వరకు నివారించవచ్చేమో సేనాధిపతి ఆలోచించాలి).

3. మేము అధికార ప్రథినిధులం. మేము తాలూకా నాయకులం. మేము రాష్ట్ర స్థాయి నాయకులం. మమ్ములను కూడా మా అధినేతను కలవడానికి పూజారులు అనుమతి నివ్వడం లేదు అనేది కూడా ఇంకొక ప్రధాన ఆరోపణ. (చంద్రబాబు ప్రతీ ఒక్కరిని కలిసి పంపుతున్నారు. మనం కూడా ఇలా కలుస్తూ ఉండాలి. దీని కోసం కొంత సమయాన్ని జనసేనాని కేటాయించి పార్టీ అధికార ప్రతినిధులను, నాయకులను, కార్యవర్గాన్ని ఒక్కసారి కలిస్తే మంచిదేమో జనసేనాని ఒక్కసారి ఆలోచించాలి).

4. మా నియోజక వర్గంలో జనసేన పార్టీకి ఇంచార్జి లేడు. టీడీపీ గెలిచినాగాని జనసేనకి ఇంచార్జి లేక పోవడం వలన జనసేన పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం లేడు. మా జనసేన పార్టీ క్యాడరు టీడీపీకి లొంగిపోతున్నారు. తక్షణమే మాకు ఇంచార్జి ని వేసి మా నియోజక వర్గంలో జనసేనపార్టీని కాపాడు కోవాలి అనేది మెజారిటీ నియోజక వర్గాల కార్యకర్తల ఆవేదన. (ఈ సమస్యకు పరిస్కారం అంత సులువు కాదు. కానీ కసరత్తు ఇప్పుడే మొదలు పెట్టాలి. పార్టీ పటిష్టత కోసం చర్యలు తీసికొని, ప్రతీ నియోజక వర్గంలో ఇంచార్జి ఉండేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ చేయడం మంచిదేమో చూడాలి).

5. గెలిచిన టీడీపీ పార్టీ పటిష్టం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. బాబు, లోకేష్ ప్రభుత్వ బాధ్యతలతో బిజీ అయినందు వలన పార్టీ నిర్వహణ బాధ్యతలు పల్లా శ్రీనివాస్ లాంటి వారికి అప్పగించారు. అలానే జనసేన పార్టీ కూడా పార్టీ పటిష్టత కోసం రాష్ట్ర స్థాయిలో ఒక ఇంచార్జిని తక్షణమే నియమించాలి. వారికి అవసరమగు బాధ్యతలు, అధికారాలు ఇవ్వాలి. ఆ ఇంచార్జి జనసేనాని పవన్ కళ్యాణ్ కింద పనిచేయాలి. ఆ రాష్ట్ర స్థాయి ఇంచార్జి పనితనాన్ని నిరంతరం పార్టీ అధినేత సమీక్ష చేస్తూ ఉండాలి. అప్పుడే జనసేన పార్టీ మరింత బలపడుతుంది అనేది జనసైనికుల మరో మనోవేదన. (దీనికి పరిస్కారం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు అని అనుకొంటున్నాను. అయితే రాష్ట్ర స్థాయి ఇంచార్జిని తక్షణమే నియమించడం మంచిదేమో ఆలోచించాలి).

6. జనసైనికుల సమస్యల పరిస్కారం కోసం గెలిచిన ప్రజాప్రతినిధులు రోజుకొకరు చొప్పున ప్రతీ రోజు పార్టీ ఆఫీస్ లో ఉండాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఇది జనసేనలో సంతృప్తిగా అమలు జరగడం లేదు. కానీ దీన్ని చూసి ప్రకటించిన టీడీపీ ఆఫీస్ లో ఇది పక్కాగా అమలు జరుగుచున్నది. టీడీపీలో అమలు జరుగుతున్నప్పుడు, మా జనసేనలో ఎందుకు అమలు జరగడం లేదు అనేది జనసైనికుల ఆందోళన. (రోజుకొక్కరు చొప్పున పార్టీ ఆఫీసులో తప్పక ఉండాలి అనే నిబంధన అమలు జరిగేటటట్లు గరళకంఠుడు పవన్ కళ్యాణ్ చర్యలు తీసికోవడం మంచిదేమో ఆలోచించాలి.

పార్టీ నిర్మాణం ఎప్పడు?

7. మరో కొద్ది కాలంలో పంచాయితీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి. మరొక పక్కన అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య గణనీయంగా పెరగబోతున్నది. ఇంకోపక్కన నామినేటెడ్ పోస్టుల సంఖ్యలో వాటా కోసం జనసేనాని పోరాడాల్సిన సమయం ఉంది. వీటి అన్నింటి పరిస్కారం కోసం పార్టీ నిర్మాణం పెరుగుతూ ఉండాలి. దీనికి పార్టీలోకి కొత్త నాయకులను అనుమతించాలి లేదా పార్టీలోనే ఉన్న వారికి తగు పదవులు ఇవ్వాలి. తద్వారా పార్టీని పటిష్టం చేసికోవాలి అనేది జనసైనికులు చేస్తున్న ప్రధాన విజ్ఞప్తి. (జనసైనికులు లేదా జనసేన నాయకులు ఇలా కోరుకొంటున్నది పార్టీ భవిత కోసమే. రేపటి పొత్తుల్లో సమ వాటా కోసమే. ఈ సమస్య పరిస్కారం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్ద మనస్సుతో స్పందించి సమస్యని పరిష్కరించడం మంచిదేమో. తద్వారా పార్టీ బలోపేతం అవుతుందేమో అని సేనాని ఆలోచించాలి.

8. డబ్భై సంవత్సరాల పైబడి వయస్సు ఉన్నాగాని, ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు వారానికి ఒక్కరోజు పార్టీ ఆఫీస్ కి వచ్చి ప్రతీ కార్యకర్తని, నాయకుడిని కలుస్తున్నారు. వారానికి ఒక్క రోజు తెలంగాణ ఆఫీస్ కి కూడా వెళతాను అని అంటున్నారు. ఇది చక్కటి విధానం. ఇదే విధానాన్ని పవనేశ్వరుడు పవన్ కళ్యాణ్ కూడా అనుసరించడం మంచిదేమో సేనాని ఆలోచించాలి.

9. పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తల అభీష్టాలను తెలుసుకొంటూ పార్టీ అధినేత కష్టపడుతున్నప్పుడే పార్టీకి అధికారం దక్కుతూ ఉంటుంది. దక్కిన అధికారంతో పార్టీని, కార్యకర్తలను మరిచిపోతే పార్టీ నిర్మాణం ఆగిపోతుంది. కార్యకర్తల మనోధైర్యం క్రుగిపోతుంది. వెరసి దక్కిన అధికారం ఆమడ దూరంలోకి వెళ్లే ప్రమాదం ఉందేమో జనసేనాని తక్షణమే ఆలోచించాలి.

అక్షర సందేశం

అక్షర సత్యం అనే జర్నలిస్టుగా గత పది సంవత్సరాలుగా విశ్లేషణలు చేస్తూ వస్తున్నాను. వివిధ విశ్లేషణల ద్వారా, వీడియోల ద్వారా, లేక వ్యాసాల ద్వారా, లేదా డిబేట్ ల ద్వారా జనసేన పార్టీని లేదా జనసేన పార్టీ భావజాలాన్ని సమర్ధిస్తు వస్తున్నాను. పవనేశ్వరుడు పవన్ కళ్యాణ్ ద్వారానే రాజకీయాల్లో సంపూర్ణ మార్పు రాగలదు. అందుకు జనసేన పార్టీ బలపడడం అవసరం ఎంతైనా ఉంది. జనసేన పార్టీ బలపడినప్పుడే సంపూర్ణ అధికార సాధన అనే మా పాలిత వర్గాల ఆకాంక్ష నెరవేరగలదు. దీన్ని మనః పూర్వకంగా నేను నమ్మి చేస్తున్న విశ్లేషణ ఇది అని గమనించాలి. జనసేన పార్టీ అధిష్టానం కూడా దీన్ని అర్ధం చేసికొని తగు చర్యలు తీసికొనగలదు అని భావిస్తున్నాను.

పవనేశ్వరుని భక్తుల మనోభావాలను సేనానికి చెప్పే చిరు ప్రయత్నమే నేటి అక్షర సత్యం సంపూర్ణ విశ్లేషణ.

ఆలోచించండి పవనేశ్వరా! “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో పవర్ ఉండాలి గాని పవర్ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిక్కుకోకూడదు” అని కోట్లాది ప్రజలు కోరుకొంటున్నారు. ఇదే అక్షర సత్యం.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్

Spread the love