ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా, ఎన్నో రకాల ప్రలోభాలు పెట్ట చూపినా హుజూరాబాద్ (Hujarabad) ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారని విజయం సాధించిన ఈటల రాజేందర్ (Etela Rajendra) అన్నారు. ఉప ఎన్నికలో ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించారని.. తనకు గొప్ప మెజారిటీ అందించారని ఈటెల చెప్పారు. ఏడోసారి ఎమ్మెల్యేగా తనను గెలిచిపించారని.. ఏం చేసినా హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని రాజేంద్ర అన్నారు. ఎన్నికైన సందర్భంగా ఆయన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన నేపథ్యంలో హుజూరాబాద్‌లో నిర్వహించిన మీడియా (Media) సమావేశంలో ఈటల మాట్లాడారు. రూ.వందల కోట్ల ఖర్చు, వందల లారీల మద్యంతో తెరాస ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తనకు ఘన విజయాన్ని అందించారు అని ఈటెల అన్నారు. సీఎం కేసీఆర్ (KCR) అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా ఈటల అభివర్ణించారు.
ఎక్కడికీ మీ రుణం తీర్చుకోలేను
‘‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, ఎన్ని జన్మలెత్తినా హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేను. విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతాంగం, కుల సంఘాలు.. ఇలా అందరీ నా విజయానికి తోడ్పాటు అందించారు. కులపరంగా చీలిక తేవడానికి ప్రయత్నాలు చేశారు. ప్రలోభాలతో ఒత్తిడికి గురిచేశారు. నిజం చెప్పాలంటే ఈ ఎన్నికలో ఏదీ పనిచేయలేదు. తెరాస కుట్రలను ప్రజలు ఎదిరించారు. ధర్మాన్ని నిలుపుకోవాలని.. ప్రజస్వామ్యాన్ని రక్షించుకోవాలని భావించారు. తమ కళ్ల ముందు ఇన్నేళ్లూ ఉన్న తమ బిడ్డను కాపాడుకోవాలనే వాళ్ల సంకల్పమే నన్ను గెలిపించింది.
నేను బయటకు రాలేదు. వాళ్లే వెన్నునన్ను బయటకు పంపారు
తెరాసకు (TRS) వెన్నుపోటు పొడిచి నేను వెళ్లినట్లు ఆరోపణలు చేశారు. నేను ఆ పార్టీకి మోసం చేయలేదు.. పార్టీ విడిచి బయటకు రాలేదు. వాళ్లే నన్ను బయటకు పంపారు. నా చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిది. సూర్యుడిపై ఉమ్మివేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగింది. మొదట బీజేపీకి (BJP) కృతజ్ఞతలు చెప్పాయి. తెరాస నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ నన్ను అక్కున చేర్చుకుంది. కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్‌షా (Amit Sha) నన్ను దిల్లీకి (Delhi) పిలిపించుకుని మాట్లాడారు. నీ చరిత్ర తెలుసని.. అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (J P Nadda) కూడా ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు (Bandi Sanjay) సూచనలు, సలహాలు చేశారు. పార్టీకి చెందిన చాలా మంది జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, రాష్ట నేతలు నాకు మంచి సహకారం అందించారు. జిల్లా, మండల స్థాయిలో నేతలు కూడా ఎప్పటికప్పుడు నా ముందుండి గొప్పగా నన్ను నడిపించి గెలిచేటట్లు చేశారు.