Road accidentRoad accident

ప్రమాదంలో మృతి చెందిన నోవా కాలేజీ విద్యార్థులు

పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం (Jangareddygudem) సబ్ స్టేషన్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వివరాలు ప్రకారం ఇద్దరు విద్యార్థులు వేగవరం నోవా కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు.

కొట్టేటి సాయి (22) మేక జానకి రామ్ (21) కాలేజీలో పరీక్షలు రాసి మోటార్ సైకిల్’పై వస్తుండగా ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొట్టేటి సాయి రాజమండ్రి జిల్లా గోకవారానికి చెందినవారుగా జానకిరామ్ గుంటూరు జిల్లా రేపల్లెకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో వాటిని తరలించడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఎం. సాగర్ బాబు, స్వయంగా ఆయనే ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దేశంలో కార్యకర్తలకు అండగా ఉండే ఏకైకపార్టీ జనసేననే

Spread the love