Babu and Pawan Kalyan during manifestoBabu and Pawan Kalyan during manifesto

చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు.. సామాన్యులకు అందుబాటులో ఇసుక
మత్స్యకారులకు రూ. 20 వేల వేట విరామ భృతి.. జి.ఒ. 217 రద్దు..
అధికారికంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం
రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తాం… రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం
వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై కత్తి వేలాడుతోంది
లూటీ కోసమే రూ. 15 లక్షల కోట్ల అప్పులు చేశారు
రాష్ట్రాన్ని గాడిన పెట్టుకునే అవకాశం ఎన్నికల రూపంలో వచ్చింది
విధ్వంస పాలనను సాగనంపి స్వర్ణాంధ్ర సాధనకు మద్దతివ్వండి
చంద్రబాబు నాయుడు, సిద్ధార్ధ్ నాథ్ సింగ్ లతో కలసి కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

తెలుగుదేశం (Telugudesam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), బీజేపీ (BJP) ఇంచార్జి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ లతో కలసి జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల భవిష్యత్తుపై కత్తి వేలాడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి రాష్ట్రం పరిస్థితిని చూసి తలదించుకుంటోంది. లూటీ కోసమే రూ. 15 లక్షల కోట్ల అప్పులు చేసి పాలకులు రాష్ట్రాన్ని దివాళా తీయించారు.

గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమన స్థితిలో పయనిస్తోంది. ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలే కనబడుతున్నాయ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల భారం రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం మీద తలకి రూ. 8 లక్షలు మోపారన్నారు. పది రూపాయిలు ఇచ్చి వంద కొట్టేస్తూ.. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తూ సాయంత్రం సారాయితో కొట్టేశారని తెలిపారు. మంగళవారం ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్ధనాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీకి యువగళంలో, జనసేన పార్టీకి జనవాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, సూచనలు క్రోడీకరించి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తూ రేపటి ఆకాంక్షలు సాకారం దిశగా ఉమ్మడి మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుంది. నిరుద్యోగంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది.

రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం

రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది. 18 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ను, నదుల అనుసంధానాన్ని గోదావరిలో ముంచేశారు. ఉపాధి కల్పనా కేంద్రం.. అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. లక్ష కోట్లు దారి మళ్లించారు. అన్న క్యాంటిన్లు, నిరుద్యోగ భృతి లాంటి వందకు పైగా పథకాలను, తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో వేయించుకుని లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తుల మీద కన్నేశారు. మాఫియాలతో కలిసి రూ. 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కోత విధించి 16,800 పదవుల్ని బీసీలకు దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశారు. 30 వేల మంది ప్రాణాలు తీసి మహిళల పసుపు తాళ్లు అగ్నిలో కలిపేశారు. గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను 600 మందిని హత్య చేశారు.

వివేకానందరెడ్డి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు దారి మళ్లించారు. గ్రామ, పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు. ఈ విధ్వంసకర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టుకునే అవకాశం ఎన్నికల రూపంలో మన ముందుకు వచ్చింది. విధ్వంస పాలనను సాగనంపి స్వర్ణాంధ్ర సాధన కోసం కూటమి అభ్యర్ధులను గెలిపించాలి.

ప్రతి రైతుకీ ఏడాదికి రూ. 20 వేల ఆర్ధిక సాయం

టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్మఖ వ్యూహం కలిపి 12 అంశాలతో అన్ని రంగాల వారి కోసం ఈ మేనిఫెస్టో రూపొందించాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తాం. నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ. 15 వేలు, ప్రతి రైతుకీ ఏడాదికి రూ. 20 వేల ఆర్ధిక సాయం అందిస్తాం. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సుగల ప్రతి మహిళకి నెలకి రూ. 1500 ఇస్తాము. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు..

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. మత్య్సకారులకు వేట విరామ సమయంలో రూ. 20 వేల ఆర్ధిక సాయం అందజేస్తాం. మత్స్యకారుల జీవితాలను నాశనం చేసే 217 జీవో రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతు, ఆధునిక సమాచార వ్యవస్థ కోసం ఆర్ధిక సాయం ఇవ్వాలని మా నిర్ణయం. ఆర్య వైశ్య కార్పోరేషన్ కి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు.. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తాం. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.

ఆక్వా రంగానికి అవసరం ఉన్న జిల్లాల్లో 5 వేల టన్నుల సామర్ధ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, యూనిట్ రూపాయిన్నరకు విద్యుత్. ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు, ఏరియేటర్లపై సబ్సిడీ ఇస్తాం. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్ర ఇసుక విధానం తీసుకువస్తాం. ఎయిడెడ్ సంస్థల్లో చదువుకొనే విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు పునరుద్దరిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

పిఠాపురం జనసైనికుల గర్జనకు షేక్ అయిన ఏపీ!

Spread the love