Eluru District SPEluru District SP

ఏలూరు జిల్లా: పోలీసు ప్రధాన కార్యాలయములో గత సోమవారం నాడు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదిదారులు వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై సత్వరమే చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్’లో మాట్లాడారు. అనంతరం ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తక్కువ వడ్డీకి తక్కువ సమయంలో ఇస్తామని చెప్పి మోసగించే సైబర్ నేరగాల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని ఫేక్ లోన్ యాప్ దారులు 2000 అప్పుగా ఇస్తే, రెండు లక్షల రూపాయలను వసూలు చేస్తారని గ్రహించాలని తెలిపారు. ఏ విధమైన తనఖాలు లేకుండా ఒక్క ఫోన్ నెంబరు ఆధారంగా ఇచ్చే ఫేక్ లోన్ యాప్ ల పట్ల ప్రజలు జాగ్రత్తలను తీసుకోవాలని ఎస్పీ కోరారు.

అలా కాకుండా మీరు ఫేక్ లోన్ యాప్ ద్వారా ఆప్పు తీసుకున్న ఎడల, మీ యొక్క ఫోన్ లో ఉన్న సమాచారాన్ని తస్కరించి మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి మీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారని గ్రహించాలని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు.

–జంగారెడ్డిగూడెం నుండి గురువు బాబురావు

పెట్టుబడిదారుల సహకారంతో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ: సీఎం జగన్