హీరోగానే కాదు, సేవకార్యక్రమాలలోనూ తనది ప్రథమ స్థానమే అని నిరూపించుకుంటున్నారు మన మెగా కర్ణ (Mega Karna) చిరంజీవి (Chiranjeevi). మెగాస్టార్ (Mega Star) చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust) నిరంతర సేవాకార్యక్రమాల్లో దశాబ్ధాలుగా ఉన్న సంగతి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ (Blood Bank), ఐ బ్యాంక్ (Eye Bank) సేవలతో ఎందరో అవసరార్థులను ఈ ట్రస్ట్ ఆదుకొంటున్నది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంద్వారానే కరోనా క్రైసిస్ (Crona Crisi) కష్టకాలంలో ఆక్సిజన్ సేవల్ని ప్రారంభించి ఎందరో ప్రాణాల్ని చిరంజీవి కాపాడారు . ఇవే కాదు. ఎన్నో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చిరు చేస్తూనే ఉన్నారు. అవసరంలో ఉన్న వారెవరికైనా ముందు గుర్తొచ్చేది చిరంజీవే అంటే అతిశయోక్తి కానేరదు.
అటువంటి చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి (Bharatha Vice President) ఎం.వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సమక్షంలో యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ సెంటర్ బుధవారం ప్రారంభమైనది. మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌తో (MAA) పాటు 24 శాఖల కార్మికులకు సాయం అందించాలని ఈ డయాగ్నస్టిక్స్ సెంటర్’ను చిరంజీవి కోరారు. మెగాస్టార్ (Mega Star) అడగగానే సినిమా కుటుంబానికి సంబంధించిన ఎవరికైనా 50 శాతం తక్కువ ఖర్చులోనే ఆరోగ్య సేవలు అందిస్తామని దీని వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల (Sudhar Kancherla) చెప్పారు. అంతేకాదు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు ఆయన.. రూ. 25 లక్షల విరాళం కూడా అందించారు.