బ్రహ్మరధం పడుతున్నతెలుగు ప్రేక్షకులు
ఇది పవర్ స్టార్ మానియా!
ప్రతి థియేటర్లోనూ పెనుసునామీ -పెను ప్రభంజనం
భీమ్లానాయక్’గా (Bheemla Nayak) ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ – రానాల సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చికొన్నది. భీమ్లానాయక్’కి ఎక్కడ చూసినా అపూర్వ నీరాజనం పలుకుతున్నారు. అభిమానులు అయితే పూనకాలతో ఊగిపోతున్నారు.
గత ఏడాది ‘వకీల్‌సాబ్’ చిత్రంతో వచ్చిన పవన్ సినిమా (Pawan Cinema) బాక్సాఫీస్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ అయినప్పటికి కూడా తెలుగు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి (Rana Daggupati) నటించారు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వచించారు. త్రివిక్రమ్ (Trivikram) ఈ చిత్రానికి మాటలు, స్ర్కీన్‌ప్లే అందించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
కేరింతలు,కేకలు ,గోల గోల…
స్క్రీన్’పై పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు… తుళ్ళింతలు , కేరింతలు,కేకలు ,గోల గోల, కుర్చీలో కూర్చోవడానికి అభిమానులు ఇబ్బంది పడ్డారు అనడం అతిశయోక్తి కాదేమో.
దటీజ్ పవన్ కళ్యాణ్ అని ప్రభుత్వ వర్గాలు కూడా అనుకొంటున్నాయి అంటే… ఇది నిజంగా పవన్, పవన్ అభిమానులు సాధించిన విజయం అని చెప్పాలి.
పవన్ స్టైల్ అదరహో. డైలాగ్స్ చెప్తుంటే సుపెర్బ్, పిచ్చేకించారంటే నమ్మవచ్చు. ఈ భీమ్లా నాయక్ సినిమాలోని ప్రతి సీన్ ఆకట్టుకుంది. ప్రతి టెక్నీషియన్ ప్రతిభావంతగా పోషించారు అని చెప్పాలి.
నవయువ దర్శకుడు శ్రీ సాగర్ చంద్ర నిజాయితీ , నిబద్ధత ఈ సినిమాలో కనిపిస్తుంది.
మాటల గురువు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై సినిమాకి పరిపూర్ణత తెచ్చారు అని తెలుగు ప్రేక్షకులు మెచ్చుకొంటున్నారు.
గణేష్ కొరియోగ్రఫి , మరీ ప్రత్యేకించి ఈ చిత్రం ద్వారానే పరిచయం అయిన కొత్త టాలెంట్ మొగలయ్యా ప్రతిభావిశేశాలు… ప్రతీ ఒక్కటి ఆడియన్స్’ని అలరించింది అని చెప్పాలి.
మొత్తానికి ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు భీమ్లా నాయక్ సినిమా మంచి ఊపు నిచ్చింది అని చెప్పాలి. ఒక్కమాటలో ఈ భీమ్లా నాయక్ చిత్రం సెన్సేషనల్ హిట్. చరిత్ర లిఖించింది. పవన్ సినీ జీవితంలో చెప్పుకోదగ్గ ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది అని చెప్పక తప్పదు. శ్రీ జనసేనాని పవన్ కళ్యాణ్ యొక్క అద్భుత నటనకు మెగా అభిమానులు శిరస్సు వంచి నమస్కిరిస్తున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు.
సినిమాలోని కొన్ని డైలాగ్’ల సారాంశం:
దారి తప్పిన గొర్రెల మందలను “కాపు” కాయడానికి, వాటికి దారి చూపడానికి, ఆ గొర్రెల మందతో అధికారం చెలాయించే నీ లాంటి అహంకారుల ఆటకట్టించడానికి వచ్చిన వాడిని.
ఓటమికి భయపడే వాడిని కాదు. నువ్వు తొక్కేకొద్దీ ఎదుగుతా? నువ్వు పీకే కొద్దీ పెరుగుతా…
ప్రతీ శుక్రవారం స్టేషన్’కి సంతకం పెట్టి పోరా నా కొడకా
పాపులర్ డైలాగ్: రా రా కొడకా
చివరగా ఒక్క మాట?
కొన్ని రాష్ట్రాలు పవన్ సినిమా భీమ్లా నాయక్’పై కక్ష కట్టి ఎన్నో అడ్డంకులు సృష్టించాయి అని మెజారిటీ ప్రజలు, మెగా అభిమానులు భావిస్తున్నారు. దీనివల్ల ఆ రాష్ట్ర భ్రాభుత్వాలు సాధించింది ఏమిటి అనేది ఇంకెప్పటికైనా తెలుసుకోవాలి. తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. లేకపోతే అణచివేతలకు గురిఅవుతున్నాం అనే వర్గాలు ప్రభుత్వానికి దూరం కాక తప్పదు. అప్పుడు నష్టపోయేదే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అని గమనించాలి.
ప్రభుత్వ తప్పిదాలు పవన్ ఇమేజ్’ని మరింత పెంచాయి. సినిమాకి క్రేజ్’ని పీక్స్’కి తీసికెళ్ళాయి. ఇది ప్రభుత్వ వ్యూహాత్మక తప్పిదమే అని చెప్పాలి.
(అభిమానసంఘాలు, ప్రేక్షకుల అభిప్రాయాల నుండి సేకరణ)