Parchuru press meetParchuru press meet

ప్రభుత్వ అడ్డంకుల్ని లెక్కచేయం

అడ్డుకొంటే అడ్డుకోండి: నాదెండ్ల మనోహర్
పర్చూరు సభా వేదికను పరిశీలించిన నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ (Janasena Party) తదుపరి కౌలురైతు భరోసా యాత్ర (Kaulu Rythu Barosa Yatra) కడపలో (Kadapa) ఉంటుంది అని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రికి (AP Chief Minister) నిజాయతీ ఉంటే తన సొంత డబ్బుతో రైతులకు సాయం చేస్తున్న జనసేన అధ్యక్షులు (Janasena President) పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) మనస్ఫూర్తిగా అభినందించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించకపోగా జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారు అని నాదెండ్ల అన్నారు.

ఒక మంచి పనికి జనసేనాని (Janasenani) ముందుకు వస్తే ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని
నాదెండ్ల తెలిపారు. కడప జిల్లాలో వీర మహిళా నాయకురాలికి సభకు వెళ్లవద్దంటూ నోటీసులిచారు. జనసేన పార్టీ (Janasena Party) తదుపరి కౌలు రైతు భరోసా యాత్ర కడప జిల్లాలోనే చేపట్టబోతున్నాం ఎలా అడ్డుకుంటారో మేము చూస్తాం అని మనోహర్ అన్నారు. శనివారం సాయంత్రం పర్చూరు, ఎస్.కె.పి.ఆర్. కళాశాల ప్రాంగణంలోని సభా వేదికను పరిశీలించిన అనంతరం మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.

“జగన్ రెడ్డి (Jagan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏ విధంగానూ రైతులకు భరోసా కల్పించడం లేదు. కొత్తకౌలు రైతు చట్టం తీసుకువచ్చి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రూ.7 లక్షల పరిహారం ఇస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు కేవలం 24 శాతం రైతులకే ప్రభుత్వం నుంచి సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాకు తిరిగి రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపుతుంటే ఈ ఏపీ ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? అని నాదెండ్ల మనోహర్ విరుచుకు పడ్డారు.

మా పార్టీ నాయకులకు సభకు వెళ్లవద్దని నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణం. కడప జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 132 మంది కౌలు రైతులు కుటుంబాలను ఆదుకుంటాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ (Pulivendhula) ఆత్మహత్యకు పాల్పడిన 13 మంది కౌలు రైతులకు సహాయం చేస్తాం. కచ్చితంగా రైతులకు అండగా నిలబడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది” అని నాదెండ్ల అన్నారు.

మీడియా సమావేశంలో (Press Meet) పార్టీ ప్రకాశం, గుంటూరు జిల్లాల అధ్యక్షులు షేక్ రియాజ్, గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు పెదపూడి విజయ్ కుమార్, డాక్టర్ గౌతమ్ రాజ్, చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీమతి రాయపాటి అరుణ, కందుకూరి బాబు, బెల్లంకొండ సాయిబాబు, కంచర్ల శ్రీకృష్ణ, వరికూటి నాగరాజు, మలగా రమేష్, రాయపాటి ప్రసాద్, కందుకూరి బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా నుంచి జనసేనలోకి మరిన్ని చేరికలు

ప్రకాశం జిల్లా (Prakasam District) దర్శి, యరగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ, వైసీపీల నుంచి జనసేన పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) యరగొండపాలెం మండల నాయకులు శ్రీ బంటి క్రిస్టఫర్’తో పాటు 50 మంది, దర్శి నియోజకవర్గం, ఈదర, సందువారిపాలెం, బండివెలగల గ్రామాల నుంచి మరో 50 మంది పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ నాయకులు డాక్టర్ పి.గౌతమ్ రాజ్, వరికూటి నాగరాజుల ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు.

సీఎం గారూ 19న పర్చూరు రండి…