AP High CourtAP High Court

రాజధానిపై (AP Capital) ఏపీ హైకోర్టు (AP High Court) కీలక తీర్పుని వెలువరించింది. రాజధాని అమరావతిని (Amaravati) మార్చ రాదు అనే తీర్పు జగన్ ప్రభుత్వానికి (Jagan Government) గట్టి షాక్ అని చెప్పాలి. అమరావతినే ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు హైకోర్ట్ అంగీకరించి సుదీర్ఘ విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని (Capital) మార్చే అధికారం లేదని న్యాయస్థానం (Court) తేల్చి చెప్పింది.

రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్ల వేయగా వీటి అన్నింటిపై… గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలి అని కోర్టు తేల్చి చెప్పింది.

జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్

రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (AP High Court) వివరించింది. ఒప్పందం ప్రకారమే ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను 3 నెలల్లోనే అప్పగించాలని కూడా కోర్టు గడువు కూడా విధించింది.

అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వానికి (Jagan Government) న్యాయస్థానం సూచించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక కూడా ఇవ్వాలని రాష్ట్ర హైకోర్ట్ చెప్పింది.

రాజధాని భూములను తనఖా పెట్టొద్దు

రాజధాని అమరావతి భూములను రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టడానికి వీలులేదు. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి ప్రభుత్వ భూములను ఇవ్వకూడదు అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నూరవసారి యుద్ధం చేయడం తధ్యం…
జనసేనాని ట్వీటీపై ఘాటైన విమర్శ